ys jagan

జగన్ నోట గరుడ మాట

Submitted by arun on Wed, 11/21/2018 - 10:39

సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరో సారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆపరేషన్ గరుడ అంటూ ఊరు వాడ ప్రచారం చేస్తున్న చంద్రబాబు ... దీనిపై రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కురపాం బహిరంగ సభలో పాల్గొన్న జగన్‌... చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఐటీ, ఈడీ దాడుల నుంచి జాతీయ కూటమి వరకు అంశాల వారిగా ప్రస్తావిస్తూ చంద్రబాబును నిలదీశారు .

జగన్‌కు మరోసారి సిట్‌ నోటీసులు

Submitted by arun on Tue, 11/20/2018 - 10:12

కోడి కత్తి దాడి కేసులో జగన్‌‌కు మరోసారి సిట్‌ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో జగన్ వాంగ్మూలం అత్యంత కీలకమైనందున‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని సిట్‌ కోరింది. మరోవైపు ఇదే కేసులో జగన్‌‌కు నోటీసులు జారీ చేసిన విశాఖ కోర్టు దాడి జరిగిన రోజు ధరించిన చొక్కాను అందజేయాలని ఆదేశించింది. 

జగన్‌ హత్యాయత్నం కేసులో కీలక మలుపు...షర్ట్ కోసం జగన్‌కు కోర్టు నోటీసులు

Submitted by arun on Mon, 11/19/2018 - 10:52

వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసు మరో మలుపు తిరిగింది. దాడి ఘటన నాటి షర్ట్ కోసం జగన్‌కు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసింది. దాడి ఘటన సమయంలో జగన్‌ ధరించిన చొక్కాను ఈ నెల 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరి ఆ షర్ట్ జాగ్రత్తగా ఉందా..లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్‌ గా మారింది. 

జగన్‌‌పై జరిగిన దాడి కేసులో కీలక మలుపు

Submitted by arun on Tue, 11/13/2018 - 16:16

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు కొత్త మలుపు తిరిగింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై జరిగిన దాడిపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు మొత్తం 8మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. 

వైఎస్సార్‌ సీపీలో చేరిన రామచంద్రయ్య

Submitted by chandram on Tue, 11/13/2018 - 14:07

ఏపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎట్టకేలకు వైసీపీ గూటికి చేరారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ నేడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకండువా కప్పి ఆహ్వానించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో రామచంద్రయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీ తీర్ధంపుచ్చుకున్నారు.

వైఎస్‌ జగన్‌పై హత్యయత్నం కేసులో కీలక అంశాలను ప్రస్తావించిన హైకోర్టు

Submitted by arun on Tue, 11/13/2018 - 13:51

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది.  కేసు విచారణ ధర్డ్ పార్టీకి అప్పగించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. కేసు విచారణ ప్రారంభం కాగానే సిట్ అధికారులు కేసు విచారణ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా దాడి జరిగిన రోజు విమనాశ్రయంలోని సీసీ పుటేజీ ఎక్కడుందంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే గత మూడునెలలుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ  ఎయిర్ ఫోర్ట్‌ సీసీ టీవీ కోర్ టీం కోర్టుకు తెలిపింది.

వైసీపీ కోడికత్తి పార్టీగా మారింది

Submitted by arun on Mon, 11/12/2018 - 17:32

వైసీపీ కోడికత్తి పార్టీగా మారిపోయిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కోడికత్తి దాడి నుంచి సానుభూతి పొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చిన్న గాయం కాబట్టే ట్రీట్మెంట్‌ చేయించుకోకుండా జగన్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా... ప్రజలు మాత్రం చంద్రబాబు వెంటే ఉన్నారని అన్నారు.

రేపు మీడియా ముందుకు వైఎస్ విజయమ్మ

Submitted by arun on Sat, 11/10/2018 - 16:23

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై దాడి తర్వాత తొలిసారిగా ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రానున్నారు. రేపు ఉదయం వైఎస్ విజయమ్మ మీడియా ముందుకు రానున్నారు. జగన్ పై దాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై విజయమ్మ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దాడి నుంచి కోలుకుంటున్న జగన్ రేపు రాత్రికి విశాఖపట్నం చేరుకోనున్నారు. ఎల్లుండి నుంచి విజయనగరంలో ప్రజా సంకల్పయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటి వరకూ  వైఎస్‌ జగన్‌ 294 రోజులుపాటు పాదయాత్ర చేశారు. 
 

వైఎస్ జగన్‌ రిట్‌ పిటీషన్‌లో కీలక మలుపు

Submitted by arun on Fri, 11/09/2018 - 13:07

తనపై జరిగిన దాడి కేసు విచారణను స్వతంత్ర సంస్ధకు అప్పగించాలంటూ వైఎస్ జగన్ దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ విచారణ కీలక మలుపు తిరిగింది. కేసు విచారణ జరుపుతున్న అధికారులకు సీఆర్‌పీసీ 161 ప్రకారం స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ జగన్‌ను  హైకోర్టు ఆదేశించింది. మంగళవారం లోపు స్టేట్ ఇవ్వాలని ఆదేశించిన కోర్టు కేసు పూర్తి నివేదికను తమకు అందజేయాలంటూ సిట్‌ను ఆదేశించింది. 
 

జగన్ పై అన్ని పిటిషన్లను విచారించిన హైకోర్టు...

Submitted by arun on Thu, 11/08/2018 - 16:06

జగన్‌పై దాడి కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు విచారించింది. సిట్‌ దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, మరింత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారంలోపు సిట్ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరుపు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నాయి. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.