Komati reddy venkat reddy

ఆ సీట్లు గెలవకపోతే...నేను గెలిచినా రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

Submitted by arun on Fri, 10/05/2018 - 13:12

నల్గొండలో జిల్లాలోని 12 స్థానాలకు 10 స్థానాల్లో గెలిచి చూపిస్తాం...10 సీట్లు గెలవకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా పదవికి రాజీనామా చేస్తానని  ప్రకటించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్గొండ సభలో కేసీఆర్ పూర్తిగా అబద్ధాలు మాట్లాడారని విమర్శించిన ఆయన... అభద్రతా భావంతోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... సాగర్ ద్వారా 10 లక్షలు ఎకరాలకు కాంగ్రెస్‌ హయాంలోనే నీరు ఇచ్చామన్నారు. జగదీశ్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని అని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దామరచర్ల ప్లాంట్‌ను ఆపేస్తామన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Submitted by arun on Sat, 07/28/2018 - 07:17

తెలంగాణ సర్కార్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలపై ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే 3వ తేదీకి వాయిదా వేసింది ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

Submitted by arun on Mon, 06/04/2018 - 11:02

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ సభ్యత్వాల రద్దుపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దును కొట్టివేసిన హైకోర్టు... తాజాగా అప్పీల్‌ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది.