guntur

ఏపీలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

Submitted by arun on Sat, 02/17/2018 - 15:22

తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరిగాయి. ఏపీలో కేసీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా జరిపారు. ఖాదర్ అనే వ్యక్తి కేసీఆర్‌కు వీరాభిమాని. దీంతో కేసీఆర్ పుట్టిన రోజును పురష్కరించుకుని ఓ ఫ్లెక్సీ ఏర్పాటుచేసి అనాథాశ్రమంలో మహాన్నదానం నిర్వహించారు. అలాగే సాకలి చెరువు వద్ద కేక్ కట్ చేశారు. అంతేగాక పేదలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఖాదర్ మాట్లాడుతూ...

టీడీపీ-బీజేపీ పొత్తుపై గుంటూరులో ఫ్లెక్సీ కలకలం

Submitted by arun on Sat, 02/03/2018 - 12:08

ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి ఎలాంటి సహకారం లేదని టీడీపీ నేతలు అంటుంటే, తప్పంతా టీడీపీదే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపించడంతో, టీడీపీ నేతల్లో ఆగ్రహం మరింత ఎక్కువైంది. బీజేపీతో తెగతెంపులు చేసుకుందామంటూ పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ లో ఏకంగా చంద్రబాబుకే టీడీపీ నేతలు సూచించారు. గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు ..మన గింజలు కూడా మనకు దక్కవు అన్న నినాదంతో రాసిన ఫ్లెక్సీని పెట్టారు.

కిలాడీ లేడీ..3 పెళ్లిళ్లు.. 6 సహజీవనాలు.. ఎన్నారైలే దీప్తి టార్గెట్!

Submitted by arun on Thu, 01/25/2018 - 16:05

విజయవాడలో కిలాడీ లేడీ దీప్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు బ్రాడీపేటలో నివాసముంటున్న దీప్తి మ్యాట్రీమోనీలో ఫేక్‌ ప్రొఫైల్స్‌తో ఎన్నారైలను మోసం చేస్తోంది. అందమైన అమ్మాయిల ఫొటోలతో ఎన్నారైలకు వలేస్తున్న దీప్తి లక్షల రూపాయలు వసూలుచేసి ఆ తర్వాత బెదిరింపులకు దిగుతోంది. ఇదే తరహాలో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధరణికుమార్‌ను బురిడీ కొట్టించిన దీప్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షా 86వేల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత బెదిరింపులకు దిగడంతో మోసపోయానని గ్రహించిన ధరణికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధరణి ఫిర్యాదుతో దీప్తిని అరెస్ట్‌‌చేసి రిమాండ్‌కి తరలించారు.

గుంటూరులో టీడీపీ-వైసీపీ సవాళ్లు...ప్రతిసవాళ్లు..వైసీపీ లీడర్‌ హౌస్‌ అరెస్ట్‌..

Submitted by arun on Mon, 01/08/2018 - 11:04

టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ లీడర్‌ అంబటి రాంబాబు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు రాష్ట్రాభివృద్ధిపై సవాళ్లు విసురుకున్నారు. సత్తెనపల్లి వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమవడంతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు సై అన్న టీడీపీ బుద్ధా వెంకన్న విజయవాడ నుంచి సత్తెనపల్లి బయల్దేరారు. మరోవైపు వైసీపీ లీడర్‌ అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లి బయల్దేరడానికి సిద్ధమవడంతో పోలీసులు అతన్ని గుంటూరులో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దాంతో అటు గుంటూరులో ఇటు సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మరో స్వాతి ఎపిసోడ్..బావ సాయంతో భర్తను కడతేర్చిన కసాయి పెళ్లాం

Submitted by arun on Sat, 01/06/2018 - 11:56

గుంటూరు జిల్లాలో మరో స్వాతి ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. బావ సాయంతో భర్తను చంపేసింది ఓ కసాయి పెళ్లాం. బావతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీవిద్య భర్తను అడ్డుగా భావించింది. బావతో పాటు మరో ఇద్దరి సాయంతో భర్తను హత్య చేసింది. సాతులూరులో గత నెల 19న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుబాడు నివాసి నల్లబోతు నరేంద్ర(27)కు అదే గ్రామంలో ఉండే మేనమామ కూతురు శ్రీవిద్యతో మూడున్నరేళ్ల కిందట పెళ్లయింది. నరేంద్ర పరిశ్రమ కాపలాదారుగా, శ్రీవిద్య నరసరావుపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

నకిలీ డాక్టర్‌.. మాయమాటలతో ఐదు పెళ్లిళ్లు

Submitted by arun on Tue, 12/19/2017 - 18:05

మాయమాటలతో వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న మరో నిత్య పెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. నడిపేది బోగస్‌ ఆస్పత్రి. దానిని అడ్డుపెట్టుకొని నాలుగైదు నెలలకు ఒకసారి పెళ్లికి ముస్తాబవుతాడు. తన పేరు మార్చుకోవడమే కాదు, నకిలీ ఎంబీబీఎస్‌ వైద్యుడిగా అవతారమెత్తుతాడు. డాక్టర్‌నని చెప్పుకొని ఇప్పటికి ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పేరు, వృత్తే కాదు పెళ్లి చూపులకు వెంట తీసుకెళ్లే అమ్మానాన్నలు కూడా బోగసే. అద్దెకు మనుషులను మాట్లాడుకొని పెళ్లి తతంగం నడిపించేస్తున్నాడు. కొన్నేళ్లుగా పలు జిల్లాల్లో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు.

హృదయ విదారక ఘటన

Submitted by lakshman on Thu, 09/21/2017 - 18:19
గుంటూరు జిల్లా శివారు అడవి తక్కెళ్లపాడులో విషాద ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన చూపరులను...