Trs Govt

ముందస్తుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు సమాచారం...ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, రాజీవ్‌శర్మ

Submitted by arun on Thu, 08/23/2018 - 13:49

ముందస్తుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోతున్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి మంత్రులతో ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజార్టీ మంత్రులు ముందస్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఇవాళ తెల్లవారుజామునే మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ ము‌ఖ్య సలహాదారు రాజీవ్‌శర్మతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ముందస్తుపై చర్చించారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని అడిగి తెలుసుకున్నారు.

రైతు బీమా.... నా జీవితంలో నేను చేసిన గొప్పపని : సీఎం కేసీఆర్‌

Submitted by arun on Mon, 06/04/2018 - 13:25

రైతు బీమా పథకం... తన జీవితంలోనే గొప్పపని అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్ఐసీసీలో జరిగిన రైతు సమన్వయ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ... రైతు బీమా పథకానికి సంబంధించి ఎల్ఐసీ సంస్థతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రైతు మరణించిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి ఐదు లక్షల బీమా అందుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

వచ్చే జూన్2 నాటికి సీఎంగా కేసీఆర్ ఉండరు: ఉత్తమ్

Submitted by arun on Sat, 06/02/2018 - 13:40

నాలుగేళ్ల తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబమే బాగుపడితే, ప్రజలకు దు:ఖం మిగిలిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, నిలదీస్తే పోలీసులు కేసు పెడుతున్నారని ఆరోపించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణలో వేడుకల్లో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి తెలంగాణ ఇచ్చిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు ఉత్తమ్ కుమార్ .

రైతుల కలలు నిజం చేస్తున్నాం : కేసీఆర్

Submitted by arun on Sat, 06/02/2018 - 12:28

సమైక్య పాలనలో తెలంగాణ అణచివేతకు గురైందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎన్నో అడ్డంకులను అధిగమించి....ఏ రాష్ట్రమూ అమలు చేయని సంక్షేమ పథకాలు చేశామని స్పష్టం చేశారు. ఆడపిల్ల పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తున్నామన్న ఆయన...దశల వారీగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.