ys jagan

పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసిన ప్రముఖ నటుడు

Submitted by arun on Tue, 09/18/2018 - 15:28

ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్‌ వెంక‌ట్.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 265వ రోజు మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మార్గ‌మ‌ధ్య‌లో వెంక‌ట్ వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు.. ఈ సందర్భంగా జగన్‌తో కలిసి కొంత దూరం నడిచారు. కాగా.. సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టులు జ‌గ‌న్‌ను క‌లిసి ఇదివ‌ర‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

వైసీపీపై వంగవీటి రాధా ఫైర్

Submitted by arun on Tue, 09/18/2018 - 14:56

వైసీపీ హైకమాండ్ పై ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... అయినా తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్‌ సీటు మల్లాది విష్ణుకు కేటాయించారన్న వార్తల నేపథ్యంలో ఇవాళ తన సన్నిహితులతో రాధా సమావేశమయ్యారు. రాధాకు పార్టీ అన్యాయం చేసిందని రాధా వర్గీయులు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఐతే.. మూడు రోజులు ఓపిక పెట్టాలని వారికి రాధా సూచించారు. 'మనం ఇంకా పార్టీలోనే ఉన్నాం..అధిష్టానంతో మాట్లాడదాం' అని చెప్పారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని రాధా తెలిపారు.  

వంగవీటి రాధా ఇంటి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకున్న అనుచరులు

Submitted by arun on Mon, 09/17/2018 - 15:37

వైసీపీలో విజయవాడ్ సెంట్రల్ నియోజక వర్గం సీటు వివాదం ముదురుతోంది. వంగవీటి రాధాకు సెంట్రల్ సీటుపై హామీ ఇవ్వకపోవడాన్ని రాధా అనుచరులు నిరసిస్తున్నారు. రాధాకు కాకుండా సెంట్రల్ సీటు ఎవ్వరికి ఇచ్చినా  ఆ ప్రభావం చాలా నియోజక వర్గాలమీద పడుతుందని రాధా అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాధా ఇంటి వద్దకు భారీగా చేరుకున్న ఆయన అనుచరులు అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. రాధాకు సెంట్రల్‌ సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. గమనించిన రాధా అడ్డుకుని వారించారు. ఇద్దరి కళ్లల్లో పెట్రోల్‌ పడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి చర్యలను తాను సహించేది లేదని..

ఇండియా టుడే సర్వే...సీఎంగా జగన్‌...

Submitted by arun on Sat, 09/15/2018 - 11:03

ఏపీలో ఫ్యాన్‌ స్పీడ్‌కు సైకిల్‌ వేగం తగ్గనుందా..? ఏపీ సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు..? తెలుగు రాష్ట్రాల ఓటరు నాడి ఎటువైపు..? సంచలన విషయాలను వెల్లడించిన ఇండియా టుడే సర్వే ఫలితాలు

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ పై ఇండియా టుడే సర్వే ఫలితాలు అత్యంత ఆసక్తిగొలిపే విధంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో వైసీపీకి ఓటేస్తామని రాష్ట్రవ్యాప్తంగా 43 శాతం మంది వెల్లడించినట్లు సర్వే ఫలితాలు తెలిపాయి. అధికార తెలుగుదేశానికి 38 శాతం మంది, జనసేన పవన్‌కు 5 శాతం మంది జై కొట్టారు. 

వైసీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు

Submitted by arun on Sat, 09/08/2018 - 14:49

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాంకుమార్‌రెడ్డి వైసీపీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ కండువా కప్పి రామ్‌కుమార్‌ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 1990, డిసెంబర్ 17 నుంచి 1992, అక్టోబర్ 9 వరకు ఏపీ సీఎంగా సేవలందించారు. ప్రజలకు రాజకీయ నాయకులపై ఉండాల్సింది అభిమానం, నమ్మకమని ఇవి దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి నెలకొల్పారని నేదురుమల్లి రామ్‌కుమార్‌ అన్నారు.

జగన్ కి టీడీపీ ఎమ్మెల్యే సవాల్

Submitted by arun on Tue, 08/21/2018 - 14:43

పాయకరావుపేట నియోజకవర్గ కోటవురట్లలో వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. ఈ ఆరోపణలపై జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి పాయకరావు పేట నియోజకవర్గ కోటవురట్లలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికార పార్టీపై పలు ఆరోపణలు చేశారు. కాగా..దీనిపై మంగళవారం ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు అవినీతి పరులకు అవునీతి తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనపడడంలేదని విమర్శించారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు.

కేరళకు వైఎస్‌ జగన్‌ భారీ విరాళం

Submitted by arun on Mon, 08/20/2018 - 13:25

వరదలతో అల్లకల్లోలమైన కేరళను ఆదుకునేందుకు రాష్ట్రాలు, ప్రముఖులు, సామాన్యులు కూడా చేయి కలిపారు. ఆపదలో ఉన్న మలయాళీలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి వైఎస్సార్‌సీపీ పంపనుంది.
 

జగన్‌ లేఖకు యనమల కౌంటర్...

Submitted by arun on Sat, 08/11/2018 - 12:56

ఈడీ కేసులో జగన్ రాసిన బహిరంగ లేఖపై మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. జగన్ వాదన విచిత్రంగా ఉందంటూ యనమల కౌంటర్ ఇచ్చారు. ఈడీ కేసులో జగన్ కుటుంబం ప్రమేయం ఉందో? లేదో? ఆయన స్పష్టం చేయాలని కోరారు. అవినీతి చేయలేదని జగన్ ఎక్కడా చెప్పలేదన్నారు. అయితే జగన్ రాసిన లేఖలో ఆయన కుటుంబ ప్రమేయం స్పష్టంగా అర్థమైందన్నారు. ఈడీ ఛార్జిషీట్‌తో తెలుగుదేశం పార్టీకి ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. కేసు ద్వారా సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన యనమల... జగన్ వైఖరితోనే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందన్నారు. జగన్ ఎక్కడా కేసులో పేరు ఉండడాన్ని ఖండించలేదని వ్యాఖ్యానించిన ఆయన...

ఛార్జిషీట్‌లో భారతి పేరు.. జగన్ షాకింగ్ రెస్పాన్స్

Submitted by arun on Fri, 08/10/2018 - 14:03

తన భార్య వైఎస్ భారతి పేరును ఈడీ ఛార్జిషీట్‌లో చేర్చినట్టు పత్రికల్లో కథనాలు రావడం పట్ల వైఎస్‌ఆర్సీపీ నేత వైఎస్ జగన్ స్పందించారు. కొన్ని పత్రికల్లో తన భార్య పేరును ఈడీ చార్జిషీటులో పొందుపర్చినట్లు వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని జగన్ ట్వీట్ చేశారు. రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం చూస్తుంటే బాధ కలుగుతోందని, చివరికి కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన భార్య వైఎస్ భారతి పేరును కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ ఛార్జిషీట్‌లో చేర్చినట్టు కథనాలు వెలువడ్డాయి.

‘వీక్లీఆఫ్‌లతో పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్’

Submitted by arun on Thu, 08/09/2018 - 11:54

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న వంచన వ్యతిరేక దీక్షపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఏం సాదిద్దామని వంచన వ్యతిరేక దీక్షలు చేస్తున్నారని మండిపడ్డ పుల్లారావు. కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని వెనుకేసుకు రావడం తప్ప వంచన దీక్షలు ఏమి సాధించడానికి చేస్తున్నారో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు వంచన, మోసం కలిపితే జగన్ అవుతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రత్తిపాటి. రాష్ట్రాన్ని వంచించింది జగన్‌మోహన్‌రెడ్డి కాదా అని మంత్రి మండిపడ్డారు.