mirchi

'మ‌హానుభావుడు'కి ప్ర‌భాస్ అతిథి

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 21:09

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్రం 'మ‌హానుభావుడు'. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 29న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా 'బాహుబ‌లి', 'బాహుబ‌లి2' చిత్రాల క‌థానాయ‌కుడు, రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హాజ‌రుకానున్నారు. ప్ర‌భాస్‌తో 'మిర్చి' చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

మ‌రో రీమేక్‌లో సుదీప్‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 12:33

'ఈగ' చిత్రంలో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న క‌న్న‌డ న‌టుడు సుదీప్‌. క‌న్న‌డ చిత్రాల్లో హీరోగా న‌టించే సుదీప్ తాజాగా ఓ రీమేక్‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించిన 'విక్ర‌మ్ వేద' ఆధారంగా ఈ క‌న్న‌డ  సినిమా తెర‌కెక్క‌నుంది. మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాని తెలుగులోనూ రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.