wife

అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్స్‌తో వ్యభిచారం...హీరోయిన్‌ ఫిర్యాదుతో గుట్టు రట్టు చేసిన అమెరికా పోలీసులు

Submitted by arun on Thu, 06/14/2018 - 13:01

ఎన్నో ఆశలతో..హీరోయిన్ గా వెలిగిపోవాలని..ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంతమంది తారల పరిస్థితి తారుమారువుతోంది. తెరపై తళుక్కుమని వెలిగే జీవితాల వెనుక..ఓ వికృత క్రీడ దాగివుంది. అవకాశాల కోసం ఎదురుచూసే హీరోయిన్లకు..డబ్బు ఆశ చూపించి గాలం వేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇండియాలో కాదు..ఏకంగా అమెరికాలోనే హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నారు. 

ఖాకీ వనంలో గంజాయి మొక్క

Submitted by arun on Tue, 06/12/2018 - 16:55

అతడో ఏఆర్ కానిస్టేబుల్ చట్టాన్ని కాపాడాల్నిన వాడు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో భార్యకు విడాకుల నోటిస్ పంపించాడు. తన భర్త నిర్వాకంపై భార్య పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. మంచిర్యాలకు చెందిన స్రవంతిని ప్రేమించానని హన్మకొండ ఏఆర్ కానిస్టేబుల్  శ్రవణ్ వెంటపడ్డాడు. 2012లో  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్రవంతి. పెళ్లి సమయంలో స్రవంతి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చారు. వివాహం అయిన ఏడాదికే భార్యకు అదనపు కట్నం కోసం వేధించాడు.

అనుమానంతో భార్యను ఇంట్లో నిర్బంధించి...

Submitted by arun on Thu, 06/07/2018 - 14:17

కట్టుకున్న భార్యకు.. ప్రత్యక్ష నరకాన్ని చూపించాడో భర్త. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడకు చెందిన రాజుకు.. 14 నెలల క్రితం బేతంచెర్ల మండలం గుంటుపల్లె గ్రామానికి చెందిన లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన పది రోజుల నుంచే భార్యను హింసించడం మొదలుపెట్టాడు. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. కర్రలతో కొట్టడమే కాకుండా.. ఒళ్లంతా వాతలు పెట్టడంతో.. లక్ష్మీని తీవ్రంగా గాయపర్చాడమే కాకుండా.. ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో లక్ష్మీ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజును అరెస్ట్ చేసి..

భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడని నడిరోడ్డుపై....

Submitted by arun on Fri, 06/01/2018 - 11:01

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో రమాదేవి అనే మహిళ నడిరోడ్డుపై ఓ యువతిని చావబాదిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా పెద్దపరినికి చెందిన సురేష్ కుమార్‌కు 9ఏళ్ల క్రితం రమాదేవితో పెళ్లైయ్యింది. సురేష్ విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీళ్లకో బాబు ఉన్నాడు. అయితే సురేష్ కుమార్ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, మరో యువతితో సంబంధమే అందుకు కారణమని రమాదేవి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మందలించి వదిలేయడంతో స్వయంగా వాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగింది రమాదేవి.

భార్యను రెడ్‌హ్యాండెడ్‌గాపట్టుకున్న భర్త...కేసు నమోదు

Submitted by arun on Mon, 03/26/2018 - 12:36

ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. వీరి దాంపత్య జీవితానికి ముగ్గురు పిల్లలు. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. భర్త డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండే వాడు. భార్య ఇంటి వద్దే ఉండి పిల్లల బాగోగులు చూసుకునేది. అయితే యువతికి ఇంటి పక్కనే ఉన్న భీమయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయితే భర్త మాటలను భార్య లెక్కచేయనేలేదు.. నేను చేసేది.. చేసేదే అన్నట్లుగా ఆమె విర్రవీగి ప్రవర్తించింది.

అత్తారింట్లో ‘అల్లుడి కిరాతకం’

Submitted by arun on Wed, 03/21/2018 - 10:51

ఉగాది పండగ కోసం అత్తారింటికి వచ్చిన అల్లుడు కిరాతకానికి ఒడిగట్టాడు. అత్తమామలను బయటకు పంపి మరీ భార్య, ఇద్దరు పిల్లలను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. బాబు పాఠశాల సమయం అవుతోందని ఇంటికి తొందరగా వెళ్దామని భర్త అన్న మాటలకు వద్దని సమాధానం చెప్పినందుకు భార్యను, ఇద్దరు పిల్లలను చంపానని మీర్‌పేట ఠాణాలో లొంగిపోయిన నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత వేరుకాపురం పెడదామని ఒత్తిడి తెస్తుండటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. అయితే ఇద్దరు పిల్లలను కూడా కడతేర్చడం వెనక అసలు ఉద్దేశం ఏమిటనే దిశగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. 

కన్యాదానం సినిమా.. ఒడిశాలో నిజంగా జరిగింది!

Submitted by arun on Mon, 03/12/2018 - 13:54

శ్రీకాంత్, ఉపేంద్ర, రచన నటించిన కన్యాదానం సినిమా చూశారా? అందులో ఉపేంద్ర, రచన ప్రేమించుకుంటారు. అనుకోని పరిస్థితుల్లో రచన, శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటారు. తర్వాత.. అసలు విషయం తెలుసుకుని.. రచనను ఉపేంద్రకు ఇచ్చి శ్రీకాంత్ దగ్గరుండి పెళ్లి చేస్తాడు. అంటే.. తన భార్యను.. ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడన్నమాట. అచ్చంగా ఇదే కథ.. ఇప్పుడు ఒడిశాలో జరిగింది.

ఆడ పిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాక్

Submitted by arun on Mon, 02/05/2018 - 16:48

ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకే భర్త కరెంట్ షాక్ ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దగుడి ప్రాంతానికి చెందిన ఎస్. రాజారత్నం.. అదే ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే యువతిని ప్రేమించి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఈ వ్యక్తికి గతంలోనే వివాహమైంది. మొదటి భార్యకు విడాకులిచ్చి.. ప్రశాంతిని పెళ్లి చేసుకున్నాడు. 

రహస్య వివాహం చేసుకుని.. గర్భిణిని చేసి..

Submitted by arun on Tue, 01/23/2018 - 17:41

కడప జిల్లా రాజంపేట పట్టణం ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి గా పనిచేస్తున్నరంగాయపల్లె రాకేశ్‌ మోసం చేసి వదిలేసాడని భార్య విజయలక్ష్మీ చేస్తున్న నిరాహారదీక్ష రెండో రోజుకి చేరింది. విజయలక్ష‌్మి దీక్షకి టీడీపీ మహిళా అధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి, ఇతర మహిళా సంఘాల నేతలు మద్ధతు తెలిపారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేట పట్టణంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రంగాయపల్లె రాకేశ్‌ అనే యువకుడు శివపురం రంగయ్య కుమార్తె విజయలక్ష్మీ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విజయలక్ష్మీ గర్భం దాల్చింది.

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని భార్యపై భర్త ఘాతుకం

Submitted by arun on Sat, 01/20/2018 - 13:31

హైదరాబాద్‌‌లో శాడిస్ట్‌ మొగుడు భార్యకు నరకం చూపించాడు. భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కక్షగట్టిన నగేష్‌ దారుణానికి ఒడిగడ్డాడు. భార్యకు పిచ్చి పట్టిందంటూ మంత్రగాడితో భార్యకు వాతలు పెట్టించాడు. శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో ఈ దారుణం జరిగింది. శామీర్‌పేట పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. మండలానికి చెందిన మంగకు 10 ఏండ్ల క్రితం మండలంలోని బొమ్మరాశిపేటకు చెందిన కంచుగంట్ల నగేష్‌తో పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని ఏండ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో నగేష్‌కు వివాహేతర సంబం ధం ఏర్పడింది.