speaker madhusudhana chary

తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్ నోటీసులు

Submitted by arun on Tue, 08/14/2018 - 16:07

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అలాగే, అసెంబ్లీ, లా సెక్రటరీలు సెప్టెంబర్‌ 17న విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపిన స్పీకర్‌కు జరిమానా విధించండి

Submitted by arun on Wed, 05/30/2018 - 11:38

సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో బస్టాండు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి బైక్ ర్యాలీ నిర్వహించారు. గత వారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా స్పీకర్ బైక్ నడిపారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపినందుకు శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారిపై డీజీపీ మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ నేత ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. భూపాలపల్లిలో బస్టాండు ప్రారంభోత్సవం సందర్భంగా గతవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మధుసూదనాచారితోపాటు వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు.