Petrol Prices

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Submitted by arun on Sat, 06/09/2018 - 11:39

16 రోజుల పాటు వరుసగా వినియోగదారులకు వాత పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు... గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గింపు బాట పట్టాయి. నేడు కూడా గత 10 రోజులతో పొలిస్తే ఈ రోజు ధరలు భారీగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 40 పైసలు, డీజిల్ పై 30 పైసలను తగ్గించినట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఈ ఉదయం 6 గంటల నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59కి, డీజిల్ ధర రూ. 74.22కి తగ్గింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82.84కి, డీజిల్ ధర రూ. 75.20కి తగ్గింది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.02, ముంబైలో రూ. 84.84, కోల్ కతాలో రూ. 79.68గా ఉంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Submitted by arun on Thu, 05/31/2018 - 11:09

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే కేరళ రాష్ట్రం మాత్రం వాటి ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వఖజానాకు కోట్లాది రూపాయల భారం పడుతున్నా లెఫ్ట్ ప్రభుత్వం ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై అమ్మకం పన్ను తగ్గించడంతో వాటి ధరలు ఒక్క రూపాయి తగ్గనుంది.

పైసా తగ్గింపుపై ఫైర్‌..

Submitted by arun on Wed, 05/30/2018 - 17:50

పెట్రోలు ధర లీటరుపై ఒక్క పైసా తగ్గించడంమీద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీని తన ట్విటర్ లో దుయ్యబట్టారు. ప్రజలతో మీరు చెలగాటమాడుతున్నారని, ఒక్క పైసా తగ్గించడం తనను షాక్ కి గురి చేసిందని అన్నారు. ఇదే మీరు చేస్తున్న తమాషా అయితే..ఇది నిజంగా పిల్ల చేష్ట.. అధ్వాన్నమైన , పరిణతి లేని చర్య అని ఆయన ఫైర్ అయ్యారు. ఫ్యుయెల్ ఛాలెంజ్ అంటూ తను గతవారం విసిరిన సవాలుకు ఇది సరైన స్పందన కాదని రాహుల్ పేర్కొన్నారు.

కంపెనీల గేమ్స్‌.. కస్టమర్స్‌ అవుట్‌... పెట్రోల్‌పై ఏంటీ డ్రామాలు

Submitted by arun on Wed, 05/30/2018 - 14:52

పెట్రోలు, డీజీల్ ధరలు తగ్గాయి. అలా అని సంబర పడకండి. తగ్గిన రేటు ఎంతో తెలిస్తే నవ్వాలో..ఏడవాలో అర్థం కాదు. ఇదేం తుగ్లక్ నిర్ణయంరా బాబూ అని కోపం రాక మానదు.  ఎవరిని ఉద్ధరించడానికో ఈ తగ్గింపు అని అనడం ఖాయం. ఇంతకీ పెట్రోలు, డీజీల్ పై తగ్గింది కేవలం ఒక పైసా మాత్రమే. అవును మీరు వింటున్నది నిజమే. పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొద్ది రోజులుగా జనం గగ్గోలు పెగుతుంటే...చమురు కంపెనీలు మాత్రం ఎంతో ఉదారత ప్రదర్శించాయి. లీటరు పెట్రోలు , డీజిల్‌పై కేవలం పైసా తగ్గించాయి.

16రోజుల తర్వాత స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Submitted by arun on Wed, 05/30/2018 - 11:13

కర్నాటక ఎన్నికల పోలింగ్ అనంతరం వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి.  రూపాయి బలపడడంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో  లీటర్‌ పెట్రోల్‌‌పై 60పైసలు,  డీజిల్‌  56పైసల వరకు తగ్గింది. రాజధాని డిల్లీలో లీటరు పెట్రోల్‌  77 రూపాయలు 83 పైసలు ఉండగా,  డీజిల్‌  68 రూపాయల 75కు చేరింది.  ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వివరాల ప్రకారం పెట్రోల్‌ ధర మంగళవారం ఆల్‌టైమ్‌ హైకి చేరింది.  కర్నాటక ఎన్నికల అనంతరం  లీటర్‌ పెట్రోల్‌పై  3 రూపాయల 80 పైసలు పెరగ్గా,  డీజిల్‌ ధర 3 రూపాయల 38 పైసల వరకు పెరిగింది.