Baba Ramdev

మార్కెట్లోకి పతంజలి జీన్స్‌ వచ్చేశాయ్‌

Submitted by arun on Mon, 11/05/2018 - 17:06

రోజువాడుకునే సరకులు, ఆహార, ఆరోగ్య ఉత్పత్తుల రంగంలోకి అడుగు పెట్టి తక్కువకాలంలోనే వృద్ధిని నమోదు చేసిన సంస్థ పతంజలి. స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా తమ సంస్థ నుంచి పతంజలి పరిధాన్‌ పేరుతో బట్టలను ఉత్పత్తిచేస్తున్నట్లు గతంలోనే రాందేవ్‌ బాబా ప్రకటించారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 'పతంజలి పరిధాన్‌' పేరుతో యాక్సెసరీస్‌ స్టోర్‌ను సోమవారం ప్రారంభించారు. ధనత్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా పరిధాన్‌ జీన్స్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు రాందేవ్‌ బాబా వెల్లడించారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని బాబారాందేవ్ పేర్కొన్నారు.

35 రూపాయలకే పెట్రోల్‌!

Submitted by arun on Mon, 09/17/2018 - 15:19

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాని మోదీ కొంప ముంచుతాయని యోగా గురు రాందేవ్ బాబా సున్నితంగా హెచ్చరించారు. ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కలిగిస్తే తాను లీటర్ పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే దేశానికి అందిస్తానని చెప్పారు. ఎన్‌డీటీవీ యూత్ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన బాబా రాందేవ్ సమకాలీన అంశాలపై ఆసక్తికరంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, 28 శాతం శ్లాబ్ కింద ఉంచాలని ఆయన సూచించారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా లేనని, రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.

బాబారామ్దేవ్ ట్రంప్

Submitted by arun on Mon, 07/30/2018 - 13:25

న్యూయార్క్ టైమ్స్ రాయడం,
 
రాందేవ్ బాబా, ట్రంపు ఒకటేనట,
 
వారియొక్క పనులు చేయడం,
 
చూస్తే బాబా ప్రధాని కావచ్చు ఒకనాడట. శ్రీ.కో

యోగీ వర్సెస్ బాబా రాందేవ్‌

Submitted by arun on Wed, 06/06/2018 - 11:33

ఓ వైపు వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాలంటూ బాబా రాందేవ్‌ను.. బీజేపీ అగ్రనాయకత్వం కలిసి విజ్ఞప్తి చేస్తుండగా.. మరోవైపు అదే పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం యోగా గురుకు ఎదురుదెబ్బ తగిలింది. పతంజలీ సంస్థ సుమారు 6 వేల కోట్లతో గ్రేటర్ నోయిడాలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫుడ్ పార్క్‌కు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చే విషయంలో.. జరుగుతున్న తాత్సారంపై రాందేవ్ బాబా.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై అసహనంతో ఉన్నారు. ఎన్నిరోజులైనా విషయం తేల్చకపోవడంతో విసుగుచెందిన రాందేవ్.. చివరకు తన ఫుడ్ పార్క్‌నే తరలించాలని నిర్ణయించారు. ఇటు ఫుడ్‌ పార్క్‌ స్కీమ్‌ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను..

వాట్సాప్‌కు పోటీగా పతంజలి కొత్త మెసేజింగ్ యాప్..!

Submitted by arun on Thu, 05/31/2018 - 12:15

ప్రఖ‌్యాత మెసేజింగ్ యాప్ వ్యాట్సాప్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రఖ్యాత యోగా గురువు రాందేవ్ బాబా కింబో అనే పేరుతో ఓ సరికొత్త మెసేజింగ్ యాప్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. సరికొత్త ఫీచర్లతో ఉన్న ఈ యాప్ ను ఇప్పటికే వేలాది మంది డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు.

పతంజలి సిమ్ కార్డులు.. ఆఫర్స్ అదుర్స్

Submitted by arun on Mon, 05/28/2018 - 16:09

దేశంలో అత్యంత నమ్మకమైన కన్జ్యూమర్‌ గూడ్స్‌ బ్రాండ్‌గా పేరులోకి వచ్చిన రాందేవ్‌ బాబా పతంజలి బ్రాండు ఆదివారం టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డులను రాందేవ్‌ బాబా లాంచ్‌ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ భాగస్వామ్యంలో ఈ సిమ్‌ కార్డులను ప్రవేశపెట్టారు. తొలుత ఈ సిమ్‌ కార్డు ప్రయోజనాలను పతంజలి ఉద్యోగులకు, ఆఫీసు బేరర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాందేవ్‌ బాబా చెప్పారు.