JD Lakshminarayana

వైఎస్ భారతిపై కేసు గురించి మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే..

Submitted by arun on Sat, 08/11/2018 - 14:31

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన అభియోగాలపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ స్పందించారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లా చోడవరంలో ‘విద్యార్థులను తీర్చిదిద్దడం ఎలా?’ అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. వైఎస్ భారతిపై ఈడీ కేసు గురించి ఈ సందర్భంగా లక్ష్మీనారాయణను విలేకరులు ప్రశ్నించగా.. ‘‘జగన్ సతీమణి భారతిపై ఈడీ కేసు గురించి నాకేం తెలియదు.’’ అని బదులిచ్చారు.
 

'నాడు జగన్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది?' అన్న ప్రశ్నకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సమాధానం

Submitted by arun on Mon, 05/28/2018 - 14:02

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వైకాపా అధినేత, అప్పటి కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, తాజాగా, ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ జగన్ కేసుల ప్రస్తావన రాగా కీలక వ్యాఖ్యలు చేశారు.