sanjay leela bhansali

పద్మావత్‌ సినిమా రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌

Submitted by arun on Thu, 01/18/2018 - 12:27

సంజయ్‌ లీలా భన్సాలీ పద్మావత్‌ మూవీ రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. పద్మావత్‌ విడుదలపై సుప్రీంకోర్టు నిషేధం ఎత్తివేసింది. దాంతో నిషేధం విధించిన నాలుగు రాష్ట్రాల్లో పద్మావత్‌ రిలీజ్‌కు లైన్‌క్లియరైంది. అన్ని రాష్ట్రాలతోపాటు హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లోనూ పద్మావత్‌ విడుదల కానుంది. సెన్సార్‌ సమస్యలను దాటి ఈ నెల 25న రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెన్సార్‌ బోర్డ్‌ రిలీజ్ కు అనుమతించినా.. తాము మాత్రం అనుమతించబోమని ఆయా ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. దీంతో నిషేదంపై చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఒక్కొక్క‌టిగా తొలుగుతున్న ‘పద్మావత్’ అడ్డంకులు

Submitted by lakshman on Mon, 01/15/2018 - 09:16

పద్మావత్’ చిత్రంలో ఓ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా స‌న్నివేశాలు ఉన్నాయంటూ ఆరోప‌ణ‌లు తలెత్తిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై ఒక్కోరాష్ట్రం ఒక్కోలా వ్య‌వ‌హ‌రిస్తు సినిమా విడుద‌ల కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ద్మావ‌త్ చిత్రం విడుద‌ల‌కు సీఎం జైరాం ఠాగూర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. యూపీలో ఈ చిత్రం విడుదలకు సీఎం యోగీ ఆధిత్యనాథ్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో కూడా అనూహ్యంగా ఈ చిత్రం విడుదలకు అనుమతి లభించింది. రాష్ట్రంలో ఈ చిత్రంపై బ్యాన్ ఉండబోదని సీఎం జైరాం ఠాగూర్ స్పష్టంచేశారు.

సాహ‌సం.. సామ‌ర్థ్యం.. మ‌హారావ‌ల్ ర‌త‌న్‌సింగ్‌

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:55

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం 'ప‌ద్మావ‌తి'. దీపికా ప‌దుకునే, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ హిందీ చిత్రం డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెప్టెంబ‌ర్ 20న‌ దీపికా పోషిస్తున్న‌ ప‌ద్మావ‌తి పాత్ర‌ ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసిన చిత్ర బృందం.. ఇవాళ షాహిద్ క‌పూర్ పోషిస్తున్న మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్ పాత్ర ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు.

'ప‌ద్మావ‌తి' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌ అదుర్స్‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 11:54

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ సినిమాలంటే క‌ళాత్మ‌కతకి పెట్టింది పేరు. కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న శైలే అంత‌. ప్ర‌స్తుతం సంజ‌య్‌ తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. దీపికా ప‌దుకునే టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ర‌ణ‌వీర్ సింగ్, షాహిద్ క‌పూర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్స్‌ని ఇవాళ విడుద‌ల చేశారు. ప‌ద్మావ‌తిగా దీపికా ఫ‌స్ట్‌లుక్ చూసిన‌వారంతా అదుర్స్ అంటున్నారు.