wife

హిట్‌తో బొద్దింకల్ని చంపొచ్చు. కానీ భర్తనే కడతేర్చింది ఓ కసాయి భార్య

Submitted by arun on Tue, 08/07/2018 - 17:49

హిట్‌తో బొద్దింకల్ని చంపొచ్చు. కానీ భర్తనే కడతేర్చింది ఓ కసాయి భార్య. నిత్యం వేధిపులకు గురిచేస్తున్నాడన్న కోపంతో... మైకంలో ఉన్న భర్త నోట్లో హిట్‌ కొట్టింది. అంతే అపస్మారక స్థితిలోకి వెళ్లిన జగన్‌ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే కుటుంబ కలహాలే ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.

దారుణం : అద్దెకు భార్యలు!

Submitted by arun on Mon, 07/02/2018 - 12:10

దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు రకాలైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని దధీచ ప్రాత అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారంగా తన భార్యను ఇతర వ్యక్తులకు భర్త విక్రయించుకొనే వెసులు బాటు ఉంది. స్టాంపు పేపర్‌పై ఇరు వర్గాల మధ్య  ఒప్పందం కుదుర్చుకొంటే సరిపోతోంది. ఈ ఒప్పందంలో భార్యను విక్రయించిన భర్తకు ఎంత ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తే అంత ఎక్కువ కాలం కొనుగోలుదారుడి వద్ద ఉంచుకొనే వెసులుబాటు ఉంటుంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి.

కర్నూలు జిల్లాలో దారుణం...పెళ్లాం పిల్లల్ని అమ్మకానికి పెట్టిన భర్త

Submitted by arun on Thu, 06/28/2018 - 11:19

నాడు సత్యం కోసం భార్యా పిల్లలను అమ్మేశాడు సత్య హరిశ్చంద్రుడు. ఇప్పడు జల్సాల కోసం ఓ ప్రబుద్ధుడు భార్య, పిల్లల్ని అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా వెంకటమ్మ, పసుపులేటి మద్దిలేటి దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. ఆటో నడిపే మద్దిలేటి  ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జల్సాల కోసం అప్పులు చేస్తూ భార్యాపిల్లల్ని వేధిస్తున్నాడు. 

ఆమెకు 35, అతనికి 25....ఇద్దరు కూతుళ్లున్నా.. ఎఫైర్ నడుపుతున్న మహిళ

Submitted by arun on Wed, 06/27/2018 - 10:36

భర్త, ఇద్దరు కూతుళ్లున్న ఓ వివాహిత.. మరొకరితో సంబంధం పెట్టుకుని.. బజారును పడింది. కోటీశ్వరుడైన వ్యాపారవేత్తకు భార్య అయినా.. తప్పుదారి పట్టి సంసారాన్ని నాశనం చేసుకుంది. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌కు చెందిన 35 యేళ్ల ఓ వివాహిత.. తనకంటే పదేళ్ల చిన్నవాడైన మాధవ్ అనే కుర్రాడితో సంబంధం పెట్టుకుంది. భర్త బిజినెస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో కారు వాషింగ్ షాప్ ఓనర్ అయిన పాతికేళ్ల మాధవ్ తో పరిచయం పెంచుకుని రహస్యంగా సంబంధం పెట్టుకుంది. 

ప్రియుడితో కలిసి భర్తకే స్పాట్ పెట్టిన భార్య...సినిమా స్టోరీనే తలదన్నేలా స్క్రీన్ ప్లే

Submitted by arun on Tue, 06/26/2018 - 12:18

ప్రేమించింది ఒకరిని.. పెళ్లి చేసుకుంది మరొకరిని. అయితే మనస్సు మాత్రం మనువాడిన వాడిని కాదని చెప్పింది. అంతే ప్రియుడితో కలిసి భర్తకు స్పాట్ పెట్టింది. ఎలాగైన వదిలించుకునేలా ప్లాన్ చేసింది. పేరు ప్రఖ్యాతలున్న వారి పరువు తీస్తే ప్రాణం తీసినట్లే అని అనుకున్న వివాహిత షర్మిల.. తన ప్రియుడు సయ్యద్ వలీతో కలిసి.. భర్త డాక్టర్ సంతోష్‌ను ఏకంగా మేల్ ఎస్కార్ట్‌గా క్రియేట్ చేసింది. లొకెంటో అనే సైట్లో మేల్ ఎస్కార్ట్‌గా ఉన్నారంటూ తన భర్తకే తాను చూపించింది. దీంతో షాక్ తిన్న సంతోష్.. విషయం ఆరా తీస్తే బండారం బట్టబయలైంది. ప్రియుడితో కలిసే తన భార్యే తనను మోసం చేసిందని తెలుసుకున్నాడు.

భర్తకు దేహశుద్ది చేసిన మొదటి భార్య

Submitted by arun on Thu, 06/21/2018 - 11:48

ప్రేమించి పెళ్లి చేసుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై మొదటి భార్య దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో చోటుచేసుకుంది. హనుమాన్ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్లో రెండో భార్య ప్రత్యుషతో నివాసం ఉంటున్న ఇంటిపై మొదటి భార్య రమణి, ఆమె బంధువులు దాడి చేసి రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని భర్తకు దేహశుద్ధి చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ శేషుకుమార్ 2009లో రాజమండ్రికి చెందిన రమణితో వివాహం జరిగింది. 2013 నుంచి మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్య ప్రత్యుషతో కాపురం చేస్తున్నాడు. ఈ రోజు గుర్తించిన రమణి బంధువుల సహాకారంతో భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసింది.

Tags

భర్తను ముక్కలు ముక్కలుగా చేసి..

Submitted by arun on Sat, 06/16/2018 - 16:39

అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడంటూ.. కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి హనుమాన్‌నగర్‌కు చెందిన కావలి మల్లయ్య.. సొంత భార్య చేతిలోనే హతమయ్యాడు. ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌లతో కలిసి.. పార్వతమ్మ తన భర్త మల్లయ్యను హత్య చేసింది. తర్వాత బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఓ సంచిలో మూటకట్టారు. తర్వాత నాగనూల్ నడి చెరువులోని ఓ చెట్టుకు మూటను కట్టారు. 45 రోజుల విచారణ తర్వాత విషయం వెలుగుచూసింది. తన భర్త మల్లయ్య కనబడటం లేదని.. 45 రోజుల క్రితం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో భార్య పార్వతమ్మ కంప్లైంట్ ఇవ్వగా.. విచారణ జరిపిన పోలీసులు.. భార్యే నిందితురాలని తేల్చారు. 

అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్స్‌తో వ్యభిచారం...హీరోయిన్‌ ఫిర్యాదుతో గుట్టు రట్టు చేసిన అమెరికా పోలీసులు

Submitted by arun on Thu, 06/14/2018 - 13:01

ఎన్నో ఆశలతో..హీరోయిన్ గా వెలిగిపోవాలని..ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంతమంది తారల పరిస్థితి తారుమారువుతోంది. తెరపై తళుక్కుమని వెలిగే జీవితాల వెనుక..ఓ వికృత క్రీడ దాగివుంది. అవకాశాల కోసం ఎదురుచూసే హీరోయిన్లకు..డబ్బు ఆశ చూపించి గాలం వేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇండియాలో కాదు..ఏకంగా అమెరికాలోనే హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నారు. 

ఖాకీ వనంలో గంజాయి మొక్క

Submitted by arun on Tue, 06/12/2018 - 16:55

అతడో ఏఆర్ కానిస్టేబుల్ చట్టాన్ని కాపాడాల్నిన వాడు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో భార్యకు విడాకుల నోటిస్ పంపించాడు. తన భర్త నిర్వాకంపై భార్య పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. మంచిర్యాలకు చెందిన స్రవంతిని ప్రేమించానని హన్మకొండ ఏఆర్ కానిస్టేబుల్  శ్రవణ్ వెంటపడ్డాడు. 2012లో  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్రవంతి. పెళ్లి సమయంలో స్రవంతి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చారు. వివాహం అయిన ఏడాదికే భార్యకు అదనపు కట్నం కోసం వేధించాడు.

అనుమానంతో భార్యను ఇంట్లో నిర్బంధించి...

Submitted by arun on Thu, 06/07/2018 - 14:17

కట్టుకున్న భార్యకు.. ప్రత్యక్ష నరకాన్ని చూపించాడో భర్త. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడకు చెందిన రాజుకు.. 14 నెలల క్రితం బేతంచెర్ల మండలం గుంటుపల్లె గ్రామానికి చెందిన లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన పది రోజుల నుంచే భార్యను హింసించడం మొదలుపెట్టాడు. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. కర్రలతో కొట్టడమే కాకుండా.. ఒళ్లంతా వాతలు పెట్టడంతో.. లక్ష్మీని తీవ్రంగా గాయపర్చాడమే కాకుండా.. ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో లక్ష్మీ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజును అరెస్ట్ చేసి..