husband

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని భార్యపై భర్త ఘాతుకం

Submitted by arun on Sat, 01/20/2018 - 13:31

హైదరాబాద్‌‌లో శాడిస్ట్‌ మొగుడు భార్యకు నరకం చూపించాడు. భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కక్షగట్టిన నగేష్‌ దారుణానికి ఒడిగడ్డాడు. భార్యకు పిచ్చి పట్టిందంటూ మంత్రగాడితో భార్యకు వాతలు పెట్టించాడు. శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో ఈ దారుణం జరిగింది. శామీర్‌పేట పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. మండలానికి చెందిన మంగకు 10 ఏండ్ల క్రితం మండలంలోని బొమ్మరాశిపేటకు చెందిన కంచుగంట్ల నగేష్‌తో పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని ఏండ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో నగేష్‌కు వివాహేతర సంబం ధం ఏర్పడింది. 

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Submitted by arun on Sat, 12/23/2017 - 10:31

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం శవనవారిపల్లెలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసి అయిన శివను భార్య అరుణ...ప్రియుడితో కలిసి హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని అన్నాసముద్రం అటవీప్రాంతంలో పడేసింది. అయితే శివ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది.

అనుమానంతో భార్య‌ను హ‌త‌మార్చిన కాలేజీ ప్రొఫెస‌ర్‌

Submitted by lakshman on Mon, 09/11/2017 - 21:25
న‌గ‌రంలోని ఘట్‌కొపర్ ప్రాంతంలో దారుణం జ‌రిగింది. భార్య‌కు వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో ఓ ఫ్రొఫెస‌ర్ త‌న భార్య‌ను దారుణంగా హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత తానూ గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్యకు...