Secunderabad

ఈసారి సంతోషం లేకుండా పోయింది: స్వర్ణలత భవిష్యవాణి

Submitted by arun on Mon, 07/30/2018 - 13:22

ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా నిన్న జోగిని శ్యామల చెప్పిన మాటలే రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిలబడి భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తన వద్దకు వచ్చేవారు సంతోషంతో కాక దుఖంతో వస్తున్నారని స్వర్ణలత రంగంలో తెలిపారు. ఏటా భక్తులు తనవద్దకు సంతోషంగానే వస్తున్నారని, అయితే ఈసారి మాత్రం సంతోషం లేకుండా పోయిందెందుకని స్వర్ణలత ప్రశ్నించారు.

సికింద్రాబాద్‌లో అర్ధరాత్రి లారీ బీభత్సం

Submitted by arun on Fri, 06/01/2018 - 12:18

సికింద్రాబాద్‌లో అర్ధరాత్రి లారీ బీభత్సం స‌ృష్టించింది. ప్యాట్నీ సెంటర్‌లో వేగంగా వస్తున్న లారీ కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో ఐదు కార్లు ధ్వంసం కాగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రియుడి కోసం డాక్టర్ వేషం.. బట్టబయలైన మోసం!

Submitted by arun on Fri, 05/25/2018 - 14:29

ప్రేమించిన ప్రియుడి కోసం డాక్టర్ అవతరమెత్తిన ప్రియురాలి గుట్టురట్టయింది. గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నానంటూ నమ్మించబోయి అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన రిజ్వానాబేగం(32) భర్తతో విడాకులు తీసుకొని బోయిన్‌పల్లిలో ఉంటోంది. స్థానికుడైన అబ్దుల్‌ కరీంతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తాను వైద్యురాలినని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నానంటూ నమ్మించింది. కరీం బంధువు ఒకామె ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయంలో సహాయం చేయాలని కరీం ప్రియురాలిని కోరాడు.