murder

డ్యాన్స్ చేయలేదని సింగర్‌ను కాల్చి చంపేశాడు!

Submitted by arun on Thu, 04/12/2018 - 13:03

ఓ వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ చేయకుండా పాట పాడుతోందని సింగర్‌ని కాల్చిచంపారు ఓ వ్యక్తి. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో జరిగింది. 24 ఏళ్ల సమినాసింధు అనే సింగర్.. పెళ్లి విందులో పాటలు పాడింది. ఐతే, ఆమె గర్భిణి కావడంతో కేవలం పాటలు మాత్రమే పాడింది. గర్భవతి అయిన గాయని సమీనా కూర్చొని పాటలు పాడుతుండగా తారిఖ్ అహ్మద్ జతోయ్ అనే వ్యక్తి ఆమెను డ్యాన్స్ చేస్తు పాడాలని కోరాడు. తారిఖ్ అహ్మద్ మాట వినలేదనే కోపంతో గాయని సమీనాను తారిఖ్ అహ్మద్ కాల్చి చంపాడు. తీవ్రంగా గాయపడిన సమీనాను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ప్రకటించారు.

కూతురిని కట్టేసి.. తల్లిని చంపి..

Submitted by arun on Tue, 03/13/2018 - 08:55

కూతురిని కట్టేసి తల్లిని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం..కాటారం మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు రామిల్ల కవిత (30), పదేళ్ల క్రితం భర్తతో విడిపోయి, తన ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలతో కలసి మంథనికి వెళ్లిన ఆమె, నూతన వధువుకు తోడుగా చిన్న కుమార్తెను ఉంచి, పెద్ద కుమార్తెతో కలసి ఇంటికి చేరుకుంది. ఆపై ఆమె ఇంట్లోకి చొరబడిన దుండగులు, కుమార్తె చేతులు కట్టేసి ఓ గదిలో బంధించారు.

ప్రేయసిని చంపి.. పెళ్లిపీటలెక్కాడు!

Submitted by arun on Wed, 03/07/2018 - 10:11

ప్రియురాలిని వంచించి, ఆమెను హతమార్చిన మరుసటి రోజే మరోయువతి మెళ్లో తాళికట్టిన ఓ మోసగాడు, ఆ మర్నాడే పోలీసులకు పట్టుబడిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య కూతురు భార్గవి (23) డిగ్రీ వరకు చదివింది. ఆత్మకూర్‌(ఎం) మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని సత్తయ్య కుమారుడు నరేందర్‌ అలియాస్‌ నరేశ్‌ కొన్నాళ్లు ఓ పెట్రోలు పంపులో పనిచేసి మానేశాడు. కులాలు వేరైనా ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నరేందర్‌కు నాలుగేళ్ల క్రితమే వివాహమైంది.

బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ

Submitted by arun on Mon, 02/12/2018 - 10:34

రెండు వారాల క్రితం కొండాపూర్ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద గోనె సంచుల్లో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మృతురాలి భర్త, అత్త, మరిది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని  గుర్తించారు. ఆదివారమే సీసీ ఫుటేజీ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు సోమవారం నిందితులను కనుగొన్నారు. కొండాపూర్‌లోని ఒక బార్‌లో పనిచేసే అమర్‌కాంత్‌ ఝా, అతని తల్లి, మృతురాలి భర్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టగా.. అమర్‌ కాంత్‌, అతని తల్లి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేశారని పోలీసులు తెలిపారు.

కన్నీరుమున్నీరైన కోమటిరెడ్డి

Submitted by arun on Thu, 01/25/2018 - 10:52

కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, నల్గొండ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటికి కూతవేటు దూరంలోనే  శ్రీనివాస్‌ను దుండగులు చంపేశారు. గొడవ జరుగుతోంది ఆపుదాం రమ్మంటూ అర్థరాత్రి శ్రీనివాస్‌ని తీసుకెళ్లిన దుండగులు ఇంటికి సమీపంలోనే రాళ్లతో కొట్టిచంపారు. అత్యంత పాశవికంగా తల, ముఖం చిద్రంచేసి డ్రైనేజీలో పడేశారు. భర్త దారుణహత్యతో ఆయన భార్య నల్గొండ మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి కుప్పకూలిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

ప్రియుడి మోజులో మునిగి.. భర్తని కడతేర్చిన భార్య

Submitted by arun on Sat, 01/20/2018 - 11:35

వివాహేతర సంబంధానికి అడ్డొస్తాడని భర్తని తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ తో హత్య చేసిందో భార్య. మృతుని సోదరుడు తన అన్న కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కాపురం వుంటున్న నందినికి విశ్వేశ్వర్ రెడ్డితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. మంజునాథ్ తమ సంబంధానికి అడ్డు తగులుతాడని భావించిన నందిని, విశ్వేశ్వర్ రెడ్డి జనవరి 3న మద్యం సేవించి హిందూపురానికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. తమతో విశ్వేశ్వర్ రెడ్డి స్నేహితుడు హనుమంతరాయుడిని వెంట తీసుకెళ్లారు.

ఉన్మాది ఘాతుకం..యువతిని చంపి.. ఆత్మహత్య

Submitted by arun on Sat, 12/30/2017 - 17:44

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్మాది రెచ్చిపోయాడు. దమ్మపేట మండలం నెమిలిపేటలో ప్రవల్లిక అనే విద్యా వాలంటీర్ పై కత్తితో దాడి చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రవల్లికను ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయింది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

స్వాతి నుంచి ప్రాణహాని ఉంది

Submitted by arun on Thu, 12/28/2017 - 10:39

స్వాతి నుండి పిల్లలు వర్షిణి, దర్శిత్ రెడ్డిలకు ప్రాణహని ఉందని సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. నాగర్‌కర్నూల్‌లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైన కాంట్రాక్టర్‌ సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ను కలిశారు. సుధాకర్‌రెడ్డి హత్యతో తాము వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్‌ వైద్య ఖర్చులు పెట్టించడంతో ఆర్థికంగా చితికిపోయామని తెలిపారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని వదినను హత్య చేసిన ఆడపడుచు

Submitted by arun on Fri, 12/22/2017 - 13:09

వివాహేతర సంబంధానికి అడ్డు పడుతుందని వదినను ఆడపడుచు తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతమిది. కర్నూల్‌  జిల్లా గోవిందపల్లెలో గత ఆదివారం జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో డీఎస్పీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన గంగదాసరి బాల నరసింహారెడ్డితో 15 ఏళ్ల క్రితం ఇందిరమ్మకు వివాహమైంది. కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె 12 ఏళ్లుగా పుట్టింటిలో తల్లి చిన్న లక్ష్మమ్మ, అన్న వెంకటేశ్వరరెడ్డి, వదిన సునీతతో కలిసి ఉండేది. 

గౌరీ లంకేశ్ కలం మూగపోయింది

Submitted by lakshman on Sat, 09/16/2017 - 20:23

ఆమె మరణించింది.. కానీ ఆమె రగిలించిన స్ఫూర్తికి మాత్రం చావులేదు.. యావత్ దేశాన్ని కదిలించిన ఆమె మరణంపై స్పందించని ప్రభుత్వం లేదు, గళమెత్తని సంఘం లేదు. బెంగళూరులో జరిగిన హత్య దేశమంతా పెను సంచలనం సృష్టించింది.