R. Krishnaiah

రాహుల్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

Submitted by arun on Tue, 08/14/2018 - 17:32

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో  టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం నాడు సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి రాజకీయ  ప్రాధాన్యత లేదని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. దాదాపు మూడు గంటల పాటు రాహుల్‌‌తోనే ఆర్‌.కృష్ణయ్య కలిసి తిరిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రజా చైతన్య బస్సులోకి ఎక్కి వారితో ప్రయాణం చేశారు. ఆర్‌.కృష్ణయ్యను బస్సులోకి కుంతియా ఆహ్వానించారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్‌ను కలిశానని ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. తెలంగాణలోని ఎల్బీనగర్  నుండి టీడీపీ నుండి గత ఎన్నికల్లో ఆర్. కృష్ణయ్య  విజయం సాధించారు. 

టీడీపీ అల్లకల్లోలం, బాబుకు భారీ దెబ్బ..

Submitted by arun on Sat, 05/26/2018 - 13:16

ప్రస్తుతం ఏపీలో  టీడీపీ పరిస్థితి బాగానే ఉన్నా తెలంగాణాలో మాత్రం రేపోమాపో పూర్తిస్థాయిలో నెలకొరిగేలా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని టీడీపీకీ గుడ్ బై చెప్పగా ఇప్పుడు పార్టీకి చెందిన మరో ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే వాళ్ళు రేపో మాపో పార్టీనుండి బయటకి వెళ్లే సూచనలు కనిపిస్తోన్నాయి. ఎందుకంటే మెన్న హైదరాబాదులో జరిగిన మహానాడు సమావేశానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు,  బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమయింది. అసలే వీళ్ళు  తమ పార్టీ ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదని అసంతృప్తితో ఉన్నారు.

మహానాడు వేళ టీ టీడీపీకి ఊహించని షాక్...పార్టీని వీడే యోచనలో సీనియర్ నేత

Submitted by arun on Thu, 05/24/2018 - 13:24

మహానాడు వేళ టీటీడీపీకి  ఊహించిన షాక్‌లు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.  తెలంగాణ పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్న నేతగా గుర్తింపు పొందిన మొత్కుపల్లి నరసింహులు  పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ఆయన ... మహానాడుకు హాజరుకాలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ పదవి ఆశించి భంగపడిన మోత్కుపల్లి గతంలోనూ రాజీనామా చేస్తారంటూ వార్తలు వినిపించాయి. అయితే మొత్కుపల్లితో పాటు మరో సీనియర్ నేత ఆర్‌ కృష్ణయ్య కూడా హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.