Bandaru Dattatreya

సనత్‌‌నగర్‌ బరిలో నిలిచేందుకు దత్తన్న...

Submitted by arun on Sat, 09/29/2018 - 14:39

తెలంగాణ అసెంబ్లీ పోరులో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు. అయితే ఈసారి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కూడా, శాసన సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. గతానికి భిన్నంగా కేవలం అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు వస్తుండడంతో పార్లమెంటుకు పోటీ చేసిన  మాజీ కేంద్రమంత్రులు, రంగంలో దిగుతున్నారు. ఈ ఎన్నికలో బీజేపీ ఒంటరిగా పోటీ  చేస్తుండటంతో, సిట్టింగ్ ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వరుసలో ముందున్నారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ.

దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతికి స్ట్రిక్ట్ డైటే కారణమా..?

Submitted by arun on Wed, 05/23/2018 - 13:02

దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతికి బరువు తగ్గడానికి చేస్తున్న స్ట్రిక్ట్ డైటే కారణమని తెలుస్తోంది. కఠినమైన డైట్ కారణంగా వేగంగా బరువు తగ్గుతారని దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండవచ్చనే చర్చ దత్తాత్రేయ బంధువుల్లో సాగుతోంది. అయితే వైష్ణవ్‌కు గుండెపోటు రావడానికి వైయిట్ లాసే కారణమా అనే అంశంపై డాక్టర్లు ఇంకా స్పందించలేదు.

బండారు దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

Submitted by arun on Wed, 05/23/2018 - 09:51

ఒక్కగానొక్క కొడుకు, చేతికి అందివచ్చాడు. ఉన్నత చదువులు చదువుతున్నాడు. పెద్ద వయసులో తమకు అండదండగా ఉంటాడని తల్లిదండ్రులు అలాంటి కుమారుడు ఇక లేడని తెలిస్తే..ఆ తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం.