rape

అత్యాచారం చేసి, డ్రైవర్‌తో పెళ్లి చేయించిన బీజేపీ నేత

Submitted by arun on Mon, 07/30/2018 - 12:39

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మీరట్‌లో అధికార బీజేపీకి చెందిన ఓ నేత, తన డ్రైవర్‌తో కలిసి ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత కేసు నుంచి తప్పించుకునేందుకు తన డ్రైవర్‌తో ఆ మహిళకు బలవంతంగా వివాహం జరిపించాడు. ఆరు నెలలు ఆమెతో కలిసి ఉన్న ఆ డ్రైవర్ తాజాగా వదిలేయడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. బీజేపీ నాయకుడు విక్కీతనేజా తన డ్రైవరు జైబ్ తో బాధిత మహిళ పెళ్లిని బలవంతంగా చేయించాడు. పెళ్లి అనంతరం ఆరునెలల తర్వాత బీజేపీ నేత డ్రైవరు బాధిత మహిళను వదిలి వెళ్లాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

షాకింగ్: మహిళా కానిస్టేబుల్ కూతురిపై డీసీపీ అత్యాచారం

Submitted by arun on Thu, 06/28/2018 - 11:45

మహారాష్ట్ర ఔరంగబాద్ లో దారుణం జరిగింది. కంచే చేను మేసింది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కూతురిని డీసీపీ రేప్ చేశారు. 23 ఏళ్ల యువతికి మంచి జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికి ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. డీసీపీ రాహుల్‌ శ్రీరామ్ పై  ఔరంగాబాద్‌ ఎండీసీ పోలీస్‌ స్టేషన్‌లో  కేసు నమోదైంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్‌ శ్రీరామ్‌ను అభ్యర్థించింది మహిళా కానిస్టేబుల్‌. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు.

ఫేస్‌బుక్‌లో పరిచయం..థియేటర్‌లో అత్యాచారం

Submitted by arun on Fri, 02/02/2018 - 10:55

ఫేస్‌బుక్‌లో పరిచయమైన  యువతిని మాయమాటలతో నమ్మించి సినిమాకు తీసుకెళ్లి థియేటర్‌లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ యువకుడు.  మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ మట్టయ్య కథనం ప్రకారం..జనగాం జిల్లా నెర్మెట్ట గ్రామానికి చెందిన భిక్షపతి(23) జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన యువతి(19) ఇంటర్‌ వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. భిక్షపతికి రెండు నెలల క్రితం ఆ యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఫోన్‌లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భిక్షపతి జగద్గిరిగుట్టలో ఉండే చెల్లెలు ఇంటికి తరచుగా వస్తుండేవాడు.

రేప్ చేసి వీడియోతీసి, సోషల్ మీడియాలో పెట్టి..

Submitted by arun on Thu, 01/04/2018 - 13:03

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో దారుణం జరిగింది. మార్కండేయ కాలనీకి చెందిన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కట్టెల కోసం వెళ్లిన బాలికపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్‌లో ఆల్కహాల్ మిక్స్ చేసి తర్వాత అత్యాచారం చేశాడు. రేప్ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వేరే వ్యక్తులకు వాట్సాప్ చేశాడు నగేష్. రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోను మరికొందరు యువకులు డౌన్ లోడ్ చేసుకుని బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం.. పెద్దలకు చెప్పటంతో.. అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు.

యువతిపై హీరో అత్యాచారం

Submitted by arun on Fri, 12/29/2017 - 12:58

సుబ్రహ్మణ్యం అనే కన్నడ హీరో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ 23 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. రాజాజినగర్‌కి చెందిన ఓ యువతి.. సుబ్రహ్మణ్యంతో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. వీరిద్దరి ప్రేమను అంగీకరించి పెద్దలు పెళ్లికి కూడా ఒప్పుకొన్నారు. కానీ షూటంగ్‌తో బిజీగా ఉన్నానని చెప్పి సుబ్రహ్మణ్యం పెళ్లి వాయిదా వేశాడు. నవంబర్‌ 1న తన సోదరి ఇంట్లో పార్టీ ఉందనిచెప్పి ఆ యువతిని ఇంటికి రమ్మన్నాడు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతి నిలదీయడంతో త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు.

ఐదు రూపాయలిచ్చి అత్యాచారం.. అరవై ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం

Submitted by arun on Fri, 12/29/2017 - 11:05

చిన్నా.. పెద్దా.. అన్న తేడా లేకుండా చిన్నారులు, మహిళలపై మృగాళ్ల లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు ఇద్దరు మైనర్‌ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని పాలం ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడు తన ఇంటిపక్కనే ఆడుకుంటున్న ఐదు, తొమ్మిది సంవత్సరాలున్న ఇద్దరు చిన్నారులను స్వీట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచి వారిపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ వారికి 5 రూపాయలు ఇచ్చాడని ఢిల్లీ డీసీపీ మిలింద్‌ మహదేవ్‌ తెలిపారు.

పార్కుల్లో అలాంటి ప్రవర్తన వల్లే రేప్‌లు: బీజేపీ ఎంపీ

Submitted by lakshman on Wed, 09/20/2017 - 19:22
ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఒకరు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రేప్ జరగడానికి గల కారణాల గురించి ప్రస్తావిస్తూ...