nipah virus

గబ్బిలాల బామ్మ...400 గబ్బిలాలను ఇంట్లో పెంచుకుంటున్న శాంతాబెన్

Submitted by arun on Sat, 05/26/2018 - 11:54

నిఫా వైరస్.. యావత్ దేశాన్ని వణికిస్తుంది. ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు తీస్తున్న నిఫా వైరస్ అంటేనే భయపడుతున్న వేళ.. గుజరాత్‌లో ఓ మహిళ ఏకంగా 400 గబ్బిలాలను పెంచుకుంటోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. గుజరాత్‌ గబ్బిలాల బామ్మ గురించి హెచ్ ఎం టీవీ ప్రత్యేక కథనం.. 

Image result for gujarat bat colony

హైదరాబాద్ కు పాకిన నిపా వైరస్?

Submitted by arun on Fri, 05/25/2018 - 15:47

కేరళ వాసులను వణికిస్తున్న నిఫా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులకు ఈ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాలను నిపా వైరస్ నిర్ధారణ కోసం పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కే రమేష్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా.. హైదరాబాద్, వరంగల్ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.

కర్ణాటకలో నిఫా వైరస్ కలకలం : ఇద్దరి శరీరంలో వ్యాధి లక్షణాలు

Submitted by arun on Wed, 05/23/2018 - 15:08

కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. కేరళ సరిహద్దు ప్రాంతమైన మంగళూరులో గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బుధవారం(మే-23) కర్ణాటకకు చెందిన హెల్త్ అధికారి తెలిపారు. పూర్తి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం వారి రక్త నమూనాలు మణిపాల్ పంపించాం అని.. నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు. నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్న ఇద్దరిని..