mumbai

దమ్మరో.. దం ...గమ్మతు గోదాములు

Submitted by arun on Fri, 08/10/2018 - 16:27

ఒక ఫ్యాక్టరీకి చెందిన గమ్మత్తు గోదాములపై దాడులు,

అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా యొక్క గుట్టు రట్టుకి దారులు,

నవీ ముంబాయి లో 37 కోట్ల విలువ చేసే కిక్ఇచ్హే మత్తులు,

మలేసియా డ్రగ్‌ మాఫియా పనేమో అని అంటున్న అధికారులు.

కికీ ఛాలెంజ్‌ తీసుకున్న ముగ్గురి తిక్క కుదిర్చిన కోర్ట్

Submitted by arun on Fri, 08/10/2018 - 12:37

కికీ ఛాలెంజ‌్  తీసుకున్న ముగ్గురు కుర్రాళ్లకు మహారాష్ట్ర పోలీసులు తిక్క కుదిర్చారు. ఈ ఛాలెంజ్‌ గురించి దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నా కుర్రకారు ఆగడం లేదు. ఛాలెంజ్‌ను స్వీకరించొద్దంటూ పోలీసులు ఎంతగా చెప్పుకొస్తున్నా యూత్‌ దాన్ని బుర్రకెక్కించుకోవడం లేదు. మహారాష్ట్రలోని విరార్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు కికీ ఛాలెంజ్‌ చేశారు. కదులుతున్న రైలు నుంచి ప్లాట్‌ ఫామ్‌ పైకి దూకి డ్యాన్సులు చేశారు. దీన్నీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. 

ముంబైలో రెచ్చిపోయిన యువత...సెల్పీలు దిగేందుకు రన్నింగ్‌ ట్రైన్‌లో స్టంట్స్‌

Submitted by arun on Wed, 08/01/2018 - 15:01

ముంబయి లో పోకిరీలు రెచ్చిపోయారు. వేగంగా వెళ్తున్న లోకల్‌ ట్రైన్‌లో డేంజర్‌ స్టంట్స్‌ చేశారు. పైగా సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. యువకులు చేసిన విన్యాసాలు చూసి తోటి ప్రయాణీకులు హడలిపోయారు. ఫ్రెండ్స్‌  మధ్య పోటీ బెట్టింగ్‌ పెట్టుకుని కదులుతున్న ట్రైన్‌లలో డేంజర్‌ స్టంట్స్ చేసి కెమెరాకు చిక్కాడు. గతంలో ఇలాంటి సాహసాలు చేసి కోందరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్న రైల్వే పోలీసులు పట్టించుకోకపోవటంపై విమర్శలు వస్తున్నాయి.  ప్రస్తుతం యువకులు చేసిన స్టంట్స్‌ వీడియో వైరల్‌గా మారింది.

Tags

ముంబై లోకల్ ట్రైన్ డోర్ లో చిక్కుకున్న మహిళ చీర

Submitted by arun on Wed, 07/25/2018 - 12:13

ఓ మహిళ చీర రైలులో చిక్కుకొని గాయపడిన ఘటన ముంబై లోకల్ ట్రైన్ లో జరిగింది. ముంబైలోని కంజుమార్గ్ రైల్వే స్టేషన్ లో నెమ్మదిగా కదులుతున్న రైలు నుంచి దిగుతున్న ఓ మహిళ చీర డోర్ లో చిక్కుకుపోయింది.  వెంటనే మహిళ కింద పడిపోయింది. రైలు నెమ్మదిగా వేగం అందుకోవడంతో ఆమెను లాక్కెళ్లింది. ఈసమయంలో అక్కడే ఫ్లాట్ ఫాంపై ఉన్న ఓ రైల్వే పోలీసు ఆమెను రక్షించడంతో పెద్ద ప్రమాదం నుంచి బయట పడింది. 

కూలిన విమానం...అయిదుగురి మృతి

Submitted by arun on Thu, 06/28/2018 - 14:46

ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఓ చార్టర్డ్ విమానం ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో కూలిపోయింది. ఇవాళ మధ్యాహ్నం ఘట్కోపూర్‌లో సర్వోదయ్ నగర్‌లో ఈ ప్రమాదం చేసుకుంది. ఘట్‌కోపర్‌ ప్రాంతంలో ల్యాండ్‌ అవుతండగా అదుపుతప్పిన విమానం.. నివాసాల మధ్యే కూలిపోయింది. ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం. వీరందరూ ఈ ఘటనలో మరణించారు. పైగా ఈ విమానం కూలిన చోట రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంద ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

ముంబై వర్షాలు

Submitted by arun on Tue, 06/26/2018 - 11:47

ముసుర్లతో ఉసురుమంటున్నవా,

ముంబాయి మునిగి తెలుతుంటివా,

ముంచెత్తిన వర్షానికి తడిసిముద్దయితివా,

ముందస్తుచర్య లేకపోతే మహనగరమైన మట్టే నంటివా.

‘నల్లగా ఉన్నావు...వంట రాదన్నందుకు’

Submitted by arun on Sat, 06/23/2018 - 13:38

నల్లగా ఉన్నావంటూ ఎగతాళి చేసినందుకు ఓ మహిళ తన బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. తినే ఆహారంలో విషం కలిపి ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ప్రంద్యా అలియాస్‌ జ్యోతి సురేష్‌ సర్వసేకు రెండేళ్ల​ క్రితం వివాహమయ్యింది. కానీ వివాహమయిన నాటినుంచి ఆమె అత్తింటి వారు, బంధువులు ఆమెను నల్లగా ఉన్నావని,  వంట చేయడం రాదని విమర్శిస్తుండేవారు. వీటన్నిటిని మనసులో పెట్టుకున్న జ్యోతి తన అత్తింటివారి మీద ద్వేషం పెంచుకుంది. వారికి బుద్ధి చెప్పడం కోసం ఎదురుచూస్తుంది.

ముంబై వర్లి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

Submitted by arun on Wed, 06/13/2018 - 17:33

దక్షిణ ముంబై వర్లి ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లో ఉన్న బ్లూమౌంట్‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో భవనంలోని పైరెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

ఈ భవనంలోనే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు మంటలను నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Tags

హోటళ్లో టీ తాగుతుండగా ఒక్కసారిగా ఫోన్ బ్లాస్ట్‌

Submitted by arun on Wed, 06/06/2018 - 14:00

ముంబాయిలో నిత్యం రద్దీగా ఉండే బందూర్ ప్రాంతంలోని ఓ హోటళ్లో ఉన్నట్టుండి సెల్‌ఫోన్ పేలిపోయింది. హోటల్లో కూర్చొని టీ తాగుతుండగా జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో  పేలి పొగలు కమ్ముకున్నాయి. దీంతో చుట్టుపక్కల వారు ఏం జరిగిందో తెలియక పరుగులు పెట్టారు. ముచ్చటపడి ఈఎమ్‌ఐల ద్వారా  కొన్న ఫోన్ పేలి పోవడంతో  సెల్‌ యజమాని లబోదిబోమంటున్నాడు.  

రణరంగంగా ముంబై

Submitted by arun on Tue, 03/20/2018 - 11:19

ముంబై మళ్లీ హోరెత్తుతోంది. నినాదాలతో దద్దరిళ్లుతోంది. మొన్నటివరకు రైతుల ఆందోళనలతో అట్టుడికిన ముంబై మహానగరం తాజాగా రైల్వే ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగుల ఆందోళనతో అట్టుడికిపోతోంది. రైల్వే పోస్టుల కోసం పరీక్షలు రాసిన అభ్యర్థులు నియామకాలు కోరుతూ ఇవాళ భారీ ఆందోళనను చేపట్టారు. మతుంగ, ఛత్రపతి శివాజీ టెర్మినల్ల మధ్య భారీ నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైలు పట్టాలపైనే నిరసన చేపట్టడంతో 60 కి పైగా లోకల్ రైళ్లను అధికారులు రద్దు చేశారు.