Movies

గుండెపోటుతో సినీనటుడు మృతి

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 18:41

నటుడు కెప్టెన్‌ రాజు (68) మృతిచెందారు. గత కొంతకాలంగా గుండె సంబంధించిన సమస్యతో బాధపడుతున్న కెప్టెన్‌ రాజు ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కు విమానంలో వెళ్తుండగా  గుండెపోటుకు గురయ్యారు. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసి, కొచ్చిలోని ఆస్పత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ  కెప్టెన్‌ రాజు తుదిశ్వాస విడిచారు. అయన మొదట్లో భారత సైనిక దళంలో సేవలందించారు. రిటైర్‌మెంట్‌ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. తొలిసారిగా  'రక్తం' అనే మలయాళ చిత్రంలో నటించారు. అనంతరం మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు. 

చరిత్ర సృష్టించిన నటుడు రాజేంద్రప్రసాద్

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 18:21

తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. అయితే ఆ గౌరవం నటకిరీటి రాజేంద్రప్రసాద్ ద్వారా వచ్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నటుడు రాజేంద్రప్రసాద్ ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సిడ్నీ పార్లమెంట్ హాలులో అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆస్ట్రేలియా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వివిధ సినీ వర్గాలు హాజరయ్యాయి. భారతదేశం నుంచి రాజేంద్రప్రసాద్ ను ఎంపిక చేసి ఈ అరుదైన గౌరవాన్ని కల్పించింది. నటుడిగా విశిష్ట సేవలు అందించిన ఆయనకు ఈ అవార్డు దక్కింది.

అవి అందమైన జ్ఞాపకాలు: రేణు దేశాయ్

Submitted by arun on Mon, 09/17/2018 - 17:32

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా పాత స్మృతులను నెమరేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన మాజీ భర్త, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో, తనతో ముడివేసుకున్న బెలె అనే పెంపుడు కుక్క గురించి పోస్ట్ పెట్టారు. ఆ కుక్క పేరు బెల్‌. న్యూ ఫౌండ్‌ల్యాండ్‌ జాతికి చెందిన శునకం. అది పవన్‌ పెంపుడు కుక్కే. ఈ శునకంతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పవన్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ పాట చిత్రీకరణ మొత్తం న్యూజిలాండ్‌లో జరిగింది. ఈ పాటలో బెల్‌ కూడా ఉంది. షూటింగ్‌ సమయంలో అందరూ బెల్ ఆకారాన్ని చూసి తెగ భయపడేవారు.

కొత్త రికార్డు సొంతం చేసుకున్న ‘రంగస్థలం’!

Submitted by arun on Mon, 09/17/2018 - 13:04

రామ్ చరణ్, సమంతల కాంబినేషన్లో తెర‌కెక్కించిన‌ 'రంగస్థలం' చిత్రం అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ 1985 నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. గోదావరి యాసతో 'రంగమ్మా, మంగమ్మా... ఏం పిల్లడూ.. ' అనే పాట సోషల్ మీడియాలో 10 కోట్ల వ్యూస్ ను దాటేసి రికార్డు పుటల్లోకి ఎక్కింది. 100మిలియన్లు సాధించిన రెండో తెలుగు పాటగా రంగమ్మా.. మంగమ్మా నిలిచింది.

ప్రియుడు పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని నటి ఫిర్యాదు

Submitted by nanireddy on Mon, 09/17/2018 - 10:15

పెళ్లి చేసుకోమని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడనిి నీలాణి తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టెర్‌లైట్‌ పోరాట దృశ్యాలను పోలీసుల దుస్తుల్లో వెళ్లి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసి వార్తల్లోకెక్కి సంచలనం సృష్టించింది. అప్పట్లో ఆమెపై సీరియస్ అయిన పోలీసులు నీలాణిపై కేసు నమోదు చేశారు. ఆ  తరువాత బెయిల్ పొంది బయటికి వచ్చిన నీలాణి తమిళ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తోంది. అయితే అంతకుముందునుంచే ఆమెకు లలిత్‌కుమార్‌ అనే యువకుడికి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కొంతకాలంగావీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు.

తొలిరోజు దుమ్మురేపిన శైలజారెడ్డి అల్లుడు.. చైతు కెరీర్‌లో ....

Submitted by arun on Fri, 09/14/2018 - 14:33

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి రోజున మంచి వసూళ్లను రాబట్టుకుంది. పాజిటివ్ అంచనాల మధ్యన విడుదల అయిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రను పోషించారు. వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.93 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. నాగచైతన్య కెరీర్‌లో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని అంటున్నారు.

తొలిరోజు వసూళ్లు:

జగన్ పాత్రలో సెన్సేషనల్ హీరో

Submitted by arun on Fri, 09/14/2018 - 13:24

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందుతోంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ సినిమాలో జగన్ పాత్రలో ఏ హీరో నటించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సూర్య గానీ .. కార్తీ గాని జగన్ పాత్రలో కనిపించవచ్చనే టాక్ వచ్చింది. వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం కారణంగానే వారిద్దరిలో ఎవరో ఒకరు ఇందులో నటించనున్నారని టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు ఫిలింనగర్‌లో సమాచారం.

రోబో 2.O టీజర్ రిలీజ్...నెట్ లో హల్ చల్ చేస్తోన్న టీజర్

Submitted by arun on Thu, 09/13/2018 - 10:43

సూపర్ స్టార్ రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీ రోబో 2.O టీజర్ రిలీజైంది. వినాయక చవిత సందర్భంగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తీస్తున్నారు. బాహుబలిని మించిపోయేలా గ్రాఫిక్స్ తో రోబో.2. O రాబోతోంది. విడుదలైన గంటల్లో ఈ టీజర్ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. రజనీ మరోసారి సైంటిస్ట్‌ అవతారం ఎత్తి చిట్టి (రోబో) రూపంలో అన్ని సమస్యలు తీర్చనున్నాడు. ఈ టీజర్‌లో శంకర్‌ తన మార్క్‌ చూపించాడు. అక్షయ్‌కుమార్‌ బయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ టీజర్‌లోనే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరగొట్టేశాడు.

ఎన్టీఆర్ లో రానా లుక్ ఇదే..!

Submitted by arun on Wed, 09/12/2018 - 15:42

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్'బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన అల్లుడిగా చంద్రబాబు నాయుడి పాత్రను గురించి అందరికీ తెలిసిందే. అలాంటి కీలకమైన పాత్ర కోసం రానాను తీసుకున్నారు. ఆయన పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటీవల చిత్రీకరించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమాలోని రానా లుక్‌ను చిత్ర‌బృందం రివీల్ చేసింది. అలాగే ప్రేక్ష‌కుల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేశారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ డైరెక్ట‌ర్‌

Submitted by arun on Wed, 09/12/2018 - 11:19

యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగానే రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. మురుగదాస్‌ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్‌ చేస్తుండటంపై ఆనంద్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.