Movies

రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన నటుడు.. పోటీ అక్కడినుంచే..

Submitted by nanireddy on Sat, 09/22/2018 - 09:31

టాలీవుడ్ నటుడు, దర్శకుడు జీవి సుధాకర్ నాయుడు త్వరలో రాజకీయాల్లో చేరనున్నారు. అంతేకాకుండా తెలంగాణలో వచ్చే  ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్దమయ్యాడు. అందుకోసం సుధాకర్ నాయుడు కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే అయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం వెల్లడికాలేదు. కానీ అయన సన్నిహితులు మాత్రం జనసేనలో చేరే అవకాశముందని అంటున్నారు. తన రాజకీయ భవిశ్యత్ గురించి మాట్లాడిన జీవి.. కులాలు, మతాల పేరుతో ప్రజలను ఓట్ల కోసం విభజించి పాలిస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ప్రణయ్‌ హత్యపై స్పందించిన రాంగోపాల్‌వర్మ

Submitted by nanireddy on Fri, 09/21/2018 - 19:34

సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు ప్రణయ్ హత్యపై తీవ్రంగా స్పందించారు. తాజగా ఈ పరిణామంపై స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రణయ్ చంపించిన మారుతీరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.. 'నిజమైన పరువు హత్య అంటే.. పరువు కోసం ఇతరుల ప్రాణాలు తీసేందుకు వెనకాడని వారిని చంపడమేనని చెప్పుకొచ్చారు. ఒకవేళ పరువు కోసమే ప్రణయ్‌ ప్రాణాలు తీయించానని చెప్పిన హంతకుడు తన పరువును చేజేతులా బజారుకీడ్చుకున్నాడు. పరువు పోయింది గనుక మారుతీరావు చనిపోయేందుకు సిద్ధంగా ఉండాలా' అని ప్రశ్నించాడు.

విజయ్ దేవరకొండ నిజంగా ఫారెనర్ తో డేటింగా?

Submitted by arun on Fri, 09/21/2018 - 12:44

సినిమా అంటేనే పుకార్లకు కేరాఫ్ అడ్రస్ గంట గంటకూ రోజురోజుకు కొత్తకొత్త పుకార్ల షికార్లు చేస్తునే ఉంటాయి అవి ఈ మద్య టాలీవుడ్లో  ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ పుకార్లు నుంచి తప్పించుకోవడం సీనియర్స్ నుండి జూనియర్స్ కు అంతా పెద్ద తల నొప్పిలా మారింది ఎందుకలా.

కూతురిపై నటుడు విజయకుమార్‌ ఫిర్యాదు

Submitted by arun on Fri, 09/21/2018 - 11:53

ఇళ్లు ఖాళీ చేయడం లేదంటూ తన కుమార్తెపై ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మధురవాయిల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ళుగా వ‌నిత‌, విజ‌య్ కుమార్ కుటుంబాల మ‌ధ్య గొడ‌వలు జ‌రుగుతుండ‌గా, బుధ‌వారం ఇది మ‌రోసారి బ‌హిర్గ‌తైమంది. వివ‌రాల‌లోకి వెళితే విజ‌య్ కుమార్ అల‌పాక్క‌మ్‌లోని అష్ట‌ల‌క్ష్మీ న‌గ‌ర్ 11వ వీధిలో ఉన్న త‌న ఇంటిని అప్పుడప్పుడు షూటింగ్‌ల‌కి ఇస్తున్న‌ట్టు తెలిపాడు. ఈ క్ర‌మంలో త‌న కూతురు షూటింగ్ కోసం ఇల్లు అద్దెకి అడ‌గ‌డంతో ఇచ్చాన‌ని విజ‌య్ కుమార్ అన్నారు.

బుల్లితెరకు వచ్చేస్తున్న హీరో విశాల్

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 20:17

తెలుగులో పుట్టి తమిళంలో రాణిస్తున్నవిశాల్ ప్రస్తుతం నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, నిర్మాతగా, నటుడిగా బిజీగా ఉన్నాడు.. తాజాగా ఓ షోతో బుల్లితెరను కూడా పలకరించబోతున్నారాయన. తెలుగులో పాపులర్‌ అయిన ‘మేము సైతం’ కార్యక్రమం తరహా షోను తమిళ్‌లో విశాల్‌ హోస్ట్‌ చేయబోతోన్నాడు. సెలబ్రెటీలు సామాన్యులుగా మారి సంపాదించే డబ్బును చారిటీలకు ఇచ్చేలా విశాల్ హ్యాండిల్ చెయ్యబోతున్న షోను డిజైన్‌ చేయబోతున్నారు. కాగా ఇటీవల 'అభిమన్యుడుతో' తిరుగులేని హిట్‌ కొట్టాడు విశాల్ తెలుగులో డబ్బింగ్‌ సినిమాగా రిలీజైనా కూడా.. ఒక స్ట్రెయిట్‌ సినిమాలా కలెక్షన్లను కొల్లగొట్టింది.

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్ కుమార్

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 20:11

తాను కేవలం సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని అక్షయ్ కుమార్ మరోసారి నిరూపించుకున్నాడు. యాసిడ్ దాడికి గురై.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న లక్ష్మి అగర్వాల్‌కి రూ.5 లక్షలు సాయం అందించాడు. ఇటీవల ఆమె గురించి ఓ వార్త పత్రిక ద్వారా తెలుసుకున్న అక్షయ్ కుమార్ సదరు బాధితురాలికి తనవంతు సాయం అందించి.. మరికొందరు ముందుకొచ్చి ఇలాంటి వారిని ఆదుకునేలా మానవత్వాన్ని చూపించాడు. సాయం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అక్షయ్ కుమార్..  'నేను చేసిన సాయం చాలా చిన్నది. దీన్ని ప్రస్తావించడం కూడా నాకు ఇష్టంలేదు. లక్ష్మి గౌరవంగా జాబ్ సంపాదించాలనీ..

ఆకట్టుకుంటున్న ‘యన్‌.టి.ఆర్‌’ సరికొత్త పోస్టర్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 17:20

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రంలోనుంచి ఈ రోజు ఉద‌యం ఏఎన్ఆర్ ఫ్ట‌స్ లుక్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఆ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. అక్కినేనిగా సుమంత్ ఎంతగా కుదిరారనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది .      

చిన్నారి కలను నిజం చేసిన సూర్య...ఆ బాలుడి ఖర్చు భరిస్తానని హామీ!

Submitted by arun on Thu, 09/20/2018 - 13:31

సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం నటన మాత్రమే కాదు, సేవా గుణం, అభిమానుల పట్ల చూపించే ప్రేమ ఆయన్ను ఇంత గొప్పస్థాయికి తీసుకొచ్చిందని చెబుతుంటారు. తాజాగా మరోసారి సూర్య తన పెద్ద మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న దినేశ్ అనే బాలుడికి తన అభిమాన నటుడైన సూర్యను చూడాలనిపించిందట. కుర్రాడికి నటుడు సూర్యను కలవాలన్నది చిరకాల కల అట. ఈ విషయం తెలుసుకున్న సూర్య .. ఆ పిల్లాడిని తన ఇంటికి పిలిపించుకుని సరదాగా గడిపారు. ఆ పిల్లాడికి కొన్ని కానుకలను అందజేయడమే కాకుండా .. సెల్ఫీలు కూడా తీసుకుని అతణ్ణి ఉత్సాహపరిచారు.

మోహన్‌బాబు ఇంట్లో విషాదం

Submitted by arun on Thu, 09/20/2018 - 09:51

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆమె భౌతికకాయాన్ని తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు తరలించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. రేపు మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి. లక్ష్మమ్మ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

గుండెపోటుతో సినీనటుడు మృతి

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 18:41

నటుడు కెప్టెన్‌ రాజు (68) మృతిచెందారు. గత కొంతకాలంగా గుండె సంబంధించిన సమస్యతో బాధపడుతున్న కెప్టెన్‌ రాజు ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కు విమానంలో వెళ్తుండగా  గుండెపోటుకు గురయ్యారు. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసి, కొచ్చిలోని ఆస్పత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ  కెప్టెన్‌ రాజు తుదిశ్వాస విడిచారు. అయన మొదట్లో భారత సైనిక దళంలో సేవలందించారు. రిటైర్‌మెంట్‌ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. తొలిసారిగా  'రక్తం' అనే మలయాళ చిత్రంలో నటించారు. అనంతరం మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు.