bahubali

అవార్డు ప్ర‌క‌ట‌న‌పై వివాదం..

Submitted by arun on Fri, 04/13/2018 - 15:24

65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను అధికారికంగా ప్రకటించారు. జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న దర్శకుడు శేఖర్ కపూర్ ఈ అవార్డులను ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలకు కూడా స్థానం లభించింది. రానా నటించిన 'ఘాజీ' చిత్రానికి బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు దక్కింది. ఇదే సమయంలో 'బాహుబలి-2'కి మూడు అవార్డులు లభించాయి.

ప్ర‌భాస్ స్టార్ గా ఎద‌గ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా

Submitted by lakshman on Tue, 01/16/2018 - 19:47

బాహుబ‌లితో ప్ర‌పంచ దిగ్గ‌జాల‌తో శ‌భాష్ అనిపించుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కు సిగ్గెక్కువ. మ‌రి అలాంటి ప్ర‌భాస్ స్టార్ ఎద‌గ‌డానికి ఓ కార‌ణం ఉందంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం సాహోతో బిజీగా ఉన్న ప్ర‌భాస్ ఓ మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌రమైన విష‌యాల్నివెల్ల‌డించాడు. మీకు సిగ్గుఎక్కువ అనే విష‌యాన్ని చాలా సార్లు చ‌ర్చించారు. మ‌రి చుట్టూ వందల మంది ఉన్న షూటింగ్‌ స్పాట్‌లో బిడియం లేకుండా ఎలా నటించారు. అనే ప్ర‌శ్న‌పై స్పందించిన ప్ర‌భాస్..1976లో శ్రీకాళ‌హ‌స్తి మ‌హాక్షేత్రంలో శివ భ‌క్తుడి జీవిత ఆధారంగా త‌న పెద్ద‌నాన్న కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’.అనే సినిమా చేశారు.

బాహుబలి 2 తో పోటీ ప‌డ‌నున్న అజ్ఞాతవాసి

Submitted by arun on Sun, 01/07/2018 - 14:03

అజ్ఞాతవాసి పై ట్రేడ్ పండితులు లెక్క‌లు మొద‌లెట్టేశారు. ఎన్నిథియేట‌ర్లు, ఎన్నిషోలు, ఈస్ట్ ఎంత వెస్ట్ ఎంత వ‌సూలు చేస్తుంది. బాహుబ‌లి రికార్డ్ ల‌ను క్రాస్ చేస్తుందా అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ లెక్క‌లు ఎలా ఉన్నా సినిమా రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. జ‌న‌వ‌రి 9 న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు టాక్. ఇక అమెరికాలో అయితే అజ్ఞాతవాసి హ‌డావిడి అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అన్న‌ట్లుగా అడ్వాన్స్ బుక్కింగ్ ల  కోసం ఎగ‌బ‌డుతున్నారు. 

ప‌ద‌హారేళ్ల ప్రాయంలో 'స్టూడెంట్ నెం.1'

Submitted by nanireddy on Wed, 09/27/2017 - 10:34

'బాహుబ‌లి' సిరీస్‌తో తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అలాంటి ద‌ర్శ‌క‌మౌళి రూపొందించిన తొలి చిత్రమే 'స్టూడెంట్ నెం.1'. క‌థానాయ‌కుడిగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కి రెండో సినిమా అయిన ఈ 'స్టూడెంట్ నెం.1'.. అత‌నికి తొలి విజ‌యాన్నిచ్చింది. అంతేకాకుండా.. 'అన్న‌మ‌య్య' త‌రువాత స‌రైన హిట్ లేని సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణికి మ‌ళ్లీ క్రేజ్‌ని తీసుకువ‌చ్చింది కూడా ఈ సినిమానే.

'మ‌హానుభావుడు'కి ప్ర‌భాస్ అతిథి

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 21:09

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి చిత్రం 'మ‌హానుభావుడు'. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 29న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా 'బాహుబ‌లి', 'బాహుబ‌లి2' చిత్రాల క‌థానాయ‌కుడు, రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హాజ‌రుకానున్నారు. ప్ర‌భాస్‌తో 'మిర్చి' చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

50 సంవ‌త్స‌రాల క్రితం క‌థ‌తో ప్ర‌భాస్‌

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 15:34

'బాహుబ‌లి', 'బాహుబ‌లి 2' చిత్రాల‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 'సాహో' అనే త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.  'ర‌న్ రాజా ర‌న్' ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి, నీల్ నితేష్ ముఖ్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, లాల్ వంటి భారీ తారాగ‌ణంతో తెలుగు, హిందీ, త‌మిళ్ భాష‌ల్లో ఈ చిత్రం రూపొందుతోంది.