sukumar

‘జిగేల్‌ రాణి’ గాయనికి ఎంత పారితోషికం ఇచ్చారంటే...

Submitted by arun on Sat, 07/21/2018 - 11:38

రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాట పాడిన...సింగర్ వెంకటలక్ష్మికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. రెమ్యూనరేషన్ విషయంలో..మధ్యవర్తుల చేతిలో మోసపోయిన వెంకటలక్ష్మికి డైరెక్టర్ సుకుమార్ అండగా నిలబడ్డాడు. పెద్దమొత్తంలో ఆర్థికసాయం చేశాడు. వారం రోజులుగా వెంకటలక్ష్మికి న్యాయం చేసేందుకు..హెచ్ఎంటీవీ చేసిన ప్రయత్నం చివరికి ఫలించింది.

‘రంగస్థలం’ క్లైమాక్స్‌ వివాదం.. క్లారిటీ ఇచ్చిన సుకుమార్‌

Submitted by arun on Tue, 05/29/2018 - 13:04

రామ్ చరణ్ హీరోగా తాను రూపొందించిన 'రంగస్థలం' చిత్రంపై నెలకొన్న కాపీ వివాదం దర్శకుడు సుకుమార్ స్పందించారు. ఈ కథను ఎక్కడి నుండి కాపీ కొట్టలేదని, సొంతగా తాను రాసుకున్నదే అని తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌కు ఆరు పేజీల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ నేతృత్వంలోని సంఘం..... సుకుమార్ వివరణతో ఏకీభవిస్తూ అధికారిక నోటీసు జారీ చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఫిర్యాదుదారు, సినీ రచయిత యం. గాంధీకి సూచించింది.

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

Submitted by arun on Fri, 04/20/2018 - 11:55

బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం జైత్ర యాత్ర కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 1980 నాటి పల్లెటూరి కథతో సుకుమార్ మ్యాజిక్ చేశాడు. రాంచరణ్ తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేశాడు. సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి వంటి ఆకట్టుకునే నటన కనబరచడంతో రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.

చిరు సినిమాను దాటేస్తున్న రంగస్థలం క‌లెక్షన్స్

Submitted by arun on Sat, 04/14/2018 - 14:36

ఊహించినట్టుగానే ‘రంగస్థలం’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. సుకుమార్ తీర్చిదిద్దిన ఈ కళాఖండానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఎన్నడూ చూడని రామ్ చరణ్‌ను చిట్టిబాబులో చూశామంటూ అభిమానులు పొంగిపోతున్నారు. 1980ల నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండిస్తోంది. 

పాట మార్పుపై స్పందించిన సుకుమార్

Submitted by arun on Tue, 04/03/2018 - 15:09

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘రంగ‌స్థ‌లం’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్షింపబడుతోంది. చిత్రంలో నటించిన అందరు నటీనటులకు ఫుల్ క్రెడిట్ దక్కింది. భారీ కలెక్షన్స్‌తో రికార్డులను తిరగ రాస్తూ పరుగులు పెడుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయింది. కానీ సినిమాలోని ఓ పాట విషయంలో అనుకోని వివాదం తలెత్తడం ప్రస్తుతం హాట్‌టాపిక్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ తరువాత ఈ గట్టునుంటావా పాటపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. పాటకు ఆడియోలో శివ నాగులు గొంతు వినిపించగా..

దేవిశ్రీ, సుకుమార్ మీద మండిపడుతున్న ప్రేక్షకులు

Submitted by arun on Tue, 04/03/2018 - 12:46

రంగస్థలం సాంగ్ ఆ గట్టునుంటావా ఇప్పటికే వైరల్ అయ్యింది. తెలుగు జనాల్లోకి చొచ్చుకెళ్లింది శివనాగులు గొంతులో ఆ మ్యాజిక్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది కాని థియేటర్స్ కి వెళ్లిన ప్రేక్షకులకి సడన్ గా శివనాగులు గొంతు బదులు, దేవి శ్రీ గొంతుతో ఆ పాట వినిపించేసరికి, అంతా మండిపడుతున్నారు. 

ఫ‌స్ట్ డే రంగ‌స్థ‌లం క‌లెక్షన్స్

Submitted by lakshman on Sat, 03/31/2018 - 00:36

సమ్మర్ రేస్‌లో దమ్ము చూపేందుకు విడుద‌లైన‌ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న‌ట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి జతకట్టిన రామ్ చరణ్.. ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపాడని మెగాఫ్యాన్స్‌నుండి వినిపిస్తున్నమాట. అత్యంత భారీ అంచనాలతో సుమారు 1700 థియేటర్స్‌లో శుక్రవారం నాడు భారీగా విడుదలైంది ‘రంగస్థలం’. సుమారు ఏడాది తరువాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కోసం గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. అన్ని థియేటర్లలోనూ ఉదయం 5 గంటలకే షోలు స్టార్ట్ కాగా..

సుకుమార్ ను సిగ్గుపడేలా చేసిన వ్యక్తి ఎవరు?

Submitted by arun on Fri, 03/16/2018 - 11:32

వెర్సటైల్ దర్శకుడు సుకుమార్ నే సిగ్గుపడేలా చేశారట ఓ వ్యక్తి. రంగస్థలం సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సుక్కూ గుర్తు చేసుకున్నాడు. మామూలుగా.. సుకుమార్ చేసే సినిమాలన్నీ స్టయిలిష్ గా, టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఇదే విషయాన్ని సుకుమార్ తో ఓ వ్యక్తి ప్రస్తావించారట. వన్ నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో సినిమాలు చేసే సమయంలో తాను అమెరికాకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు సుకుమార్ చెప్పాడు.