telugu states

దేశవ్యాప్తంగా దీవాళి సందడి

Submitted by arun on Wed, 11/07/2018 - 11:51

దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. వెలుగుల పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు వేడుకగా జరుపుకొంటున్నారు. దీపావళి సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలతో ఇళ్లను అందంగా అలంకరించుకున్నారు. మహిళలు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పండుగ రోజున తమ ఇంట లక్ష్మీ దేవిని రా రమ్మని ఆహ్వానిస్తున్నారు. సిరి సంపదలను అందచేయలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.దీపావళి సందర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తున్నదని వారన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసిన అవిశ్వాస తీర్మానం

Submitted by arun on Sat, 07/21/2018 - 12:39

కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై టీఆర్ఎస్ సభ్యులు భగ్గుమన్నారు.  విభజనకు ముందు మద్ధతిచ్చిన చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విభజన సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధాని చేసిన వ్యాఖలు కూడా ఇరు పార్టీల మధ్య  వివాదాన్ని స్పష్టించాయి.  

24 గంటలు.. 28 మంది ప్రాణాలు

Submitted by arun on Tue, 06/26/2018 - 10:49

24 గంటల్లో.. 28 మంది ప్రాణాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో రహదారుల రక్తదాహానికి.. లెక్కలివి. ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిన రోడ్లపై ప్రయాణం.. సరాసరి నరకానికే దారి తీస్తోంది. ఓవర్‌లోడ్‌తో పాటు.. ఓవర్‌ కాన్ఫిడెన్సే.. ప్రయాణీకుల పాలిట మృత్యువుగా పరిణమించుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రైవర్లే.. యమకింకరులుగా మారుతున్నారు. 

24 గంటలు.. 28 మంది ప్రాణాలు... సోమవారం...రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగాల..ఆటో, కారు ఢీ. ఆరుగురు ప్రయాణీకులు మృతి

ఆదివారం...యాదాద్రి జిల్లా వలిగొండ...అదుపు తప్పి మూసీ కాల్వలో పడ్డ ట్రాక్టర్...మూసీ నీటిలో కలిసిన 15 మంది ప్రాణాలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Submitted by arun on Sat, 06/23/2018 - 17:46

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇటీవల వరకూ కొనసాగిన ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. వీటి ప్రభావంతో మేఘాలు ఏర్పడి తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి.  నేటి నుంచి మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాయువ్య బంగాళాఖాతంలో ఏ‍ర్పడిన ఉపరిత ఆవర్తనం ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొంది. వర్ష సూచన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరో షాక్‌

Submitted by arun on Wed, 06/13/2018 - 17:09

తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందన్న కేంద్రం తొలి ఆరు నెలల్లోనే సాధ్యం కాదని తేల్చి చెప్పామన్నారు. అయితే మరింత పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్న సూచనలు రావడంతో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పష్టమైన నివేదిక ఆధారంగా సాధ్యంకాదని తేల్చామన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఎన్నికల ఫీవర్

Submitted by arun on Sat, 04/21/2018 - 10:33

తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక ఫీవర్ పట్టుకుంది. కర్ణాటక ఎన్నికలు , ఫలితాలపై ఏపీ, తెలంగాణలో టెన్షన్ మొదలైంది. కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంలో ఇక్కడి నేతల్లో గుబులు కనిపిస్తోంది. ఇంతకీ కర్ణాటక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఏమిటనేగా డౌట్. 

సెగలు రేపుతోన్న అవిశ్వాస అస్త్రం...పెరుగుతోన్న బీజేపీ వ్యతిరేక బలం

Submitted by arun on Mon, 03/19/2018 - 10:28

కేంద్రంపై టీడీపీ, వైసీపీ సంధించిన అవి‌‌శ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఆ పార్టీలిచ్చిన అవిశ్వాస తీర్మానాలు ఇవాళ మరోసారి లోక్‌సభ ముందుకు రానున్నాయి. దాంతో ఏ పార్టీ మోడీకి వ్యతిరేకమో తటస్థమో తేలిపోనుంది. ఒకవేళ ఓటింగ్‌ జరిగితే టీఆర్‌‌ఎస్‌ ఎటువైపు? బిజూ జనతాదళ్ ఏం చేస్తుంది? శివసేన స్టాండ్‌ ఎలా ఉండబోతుంది?
 

అటు హోదా.. ఇటు కోటా

Submitted by arun on Sat, 03/10/2018 - 10:41

తెలుగునాట రాజకీయాలు ఓ కొత్త ట్విస్టు తీసుకున్నాయి. అయితే పాత బాటలో పయనించడమే కొత్త ట్విస్టులో విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలన్నీ.. విభజనకు ముందు ఎలా నడిచాయో ఇప్పుడూ అలాగే నడుస్తున్నాయి. అప్పట్లో ఏపీ నుంచి సమైక్య నినాదాలు, తెలంగాణ నేతల నుంచి విభజన నినాదాలు పార్లమెంట్లో హోరెత్తగా... ఇప్పుడు ఏపీ నేతలు హోదా నాదం చేస్తుండగా.. టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ నినాదాలు చేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాలకు జైట్లీ షాక్‌

Submitted by arun on Thu, 02/01/2018 - 13:54

తెలుగు రాష్ట్రాలను కేంద్రం విస్మరించింది. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోగా.. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని అరుణ్ జైట్లీ ప్రస్థావించలేదు. మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులపైనా స్పందించలేదు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను అస్సలు పట్టించుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీరుపై  వైసీపీ ఎంపీలు  రాజీనామాలకు సిద్ధమయ్యారు. 

అమావాస్య చంద్రుడు.. పౌర్ణమి చంద్రుడు

Submitted by lakshman on Tue, 09/19/2017 - 22:06
చంద్రుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మారుతుంటాడు. పౌర్ణమి తర్వాత నుంచి క్రమంగా క్షీణిస్తూ చివరకు అమావాస్య నాటికి పూర్తిగా కనిపించకుండాపోతే.. అమావాస్య తర్వాత మాత్రం దినదినాభివృద్ధి చెందుతూ...