kcr

గవర్నర్‌తో ముగిసిన భేటీ.. గన్‌పార్కుకు కేసీఆర్

Submitted by arun on Thu, 09/06/2018 - 14:42

అసెంబ్లీ రద్దుపై కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు కేసీఆర్‌ అందించారు. కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. రాజ్‌భవన్ నుంచి నేరుగా కేసీఆర్ గన్‌పార్కుకు బయల్దేరారు. అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకొని మీడియాతో మాట్లాడనున్నారు. అసెంబ్లీ రద్దుకు గల కారణాలను వివరించనున్నారు. 
 

Tags

ముందస్తుపై ఎందుకు వెనక్కి తగ్గారు..?

Submitted by arun on Thu, 08/23/2018 - 08:49

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై అంచనాలు తారుమారైనట్లు తెలుస్తోంది. అధినేత ఒకటనుకుంటే మంత్రులు మరోలా స్పందించడంతో కేసీఆర్‌ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. మంత్రులతో సుమారు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ ఎన్నికలు ఎప్పుడు జరిపితే మంచిదంటూ అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు అంశం ఎలాగున్నా సెప్టెంబర్ రెండున సుమారు 25లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఎమ్మెల్యేల్లో మొదలైన ఆందోళన...సర్వే రిపోర్టులు అందజేయనున్న సీఎం

Submitted by arun on Thu, 08/16/2018 - 09:37

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ముందస్తు ఎన్నికలు తప్పవన్న వాతావరణం క్రియేట్ కావడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికార పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. త్వరలో జరగనున్న టీఆర్ఎస్‌ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ ముందస్తుపై ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేయనున్నారు. 

సిద్దం మేము..ప్రకటిస్తున్నాము చూడు

Submitted by arun on Tue, 08/14/2018 - 12:09

రాబోయే ఎన్నికలకు తెరాస సిద్ధమనే,

సెప్టెంబరులోనే అభ్యర్థులను ప్రకటిస్తామనే,

ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామననే

సెప్టెంబరు రెండున బహిరంగ సభ అవుతదనే. శ్రీ.కో 

Tags

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్...ఆ 20మంది ఎవరు..?

Submitted by arun on Tue, 08/14/2018 - 10:08

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. సిట్టింగ్ లందరికీ సీట్లు గ్యారెంటీ అని చెబుతూనే సుమారు 20మంది సీట్ల మాత్రం గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. దీంతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆ 20 మంది ఎవరనే ఉత్కంఠ మొదలైంది. ఇంతకి డేంజర్ జోన్ ఉన్నదెవరు తిరిగి బెర్త్ దక్కించుకుంటునది ఎవరు..?

ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించిన కేసీఆర్

Submitted by arun on Tue, 08/14/2018 - 09:59

కేసీఆర్ ముందస్తు ఎన్నికల సమర శంఖం పూరించారు. డిసెంబర్ లో ఎన్నికలు తధ్యమని సంకేతాలిచ్చారు. సెప్టెంబర్ లోనే అభ్యర్ధులను ప్రకటిస్తామన్నారు. అభ్యర్ధుల ఎంపిక కోసం పార్టీ సెక్రటరి జనరల్ కేకే అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసారు. ఎన్నికల కోసం పార్టీ కాడర్ ను సిద్దం చేయాలని పార్టీ రాష్ట కమిటీ నేతలను పిలుపు నిచ్చారు. 

కరుణ పార్థివదేహం వద్ద పిడికిలి బిగించిన కేసీఆర్!

Submitted by arun on Wed, 08/08/2018 - 15:57

రాజాజీ హాల్‌లో పోరాట యోధుడు, ద్రవిడ ఉద్యమ సారథి, డీఎంకే అధ్యక్షుడు ముత్తువేల్ కరుణానిధి(94) భౌతికకాయానికి తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. సీఎం వెంట ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. నివాళి అర్పించిన అనంతరం... జోహార్ కరుణానిధి అంటూ పిడికిలి బిగించారు కేసీఆర్. అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. అంత‌కుముందు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. రాజాజీ హాల్ నుంచి సాయంత్రం 4 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్‌

Submitted by arun on Tue, 08/07/2018 - 11:11

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికల్లో  బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ స్పీడు పెంచారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మద్ధతు కోరుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన నితీష్‌కుమార్‌..జేడీయూ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ నితీష్‌ కోరారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ అభ్యర్థిగా జేడీయూ తరుపున హరివంశ్‌నారాయణ్‌సింగ్‌ పోటీ చేస్తున్నారు. దీనికి స్పందించిన కేసీఆర్‌ పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూకి చెందిన హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ను బీజేపీ ప్రాతిపాధించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్‌...సర్వేలో మార్కులు తగ్గిన వారికి గట్టి వార్నింగ్‌

Submitted by arun on Tue, 07/03/2018 - 13:04

టీఆర్ఎస్‌‌ ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్‌ పట్టుకుంది. ఎన్నికలకు ముందు మూడో సర్వే చేయించిన సీఎం కేసీఆర్‌... ఎమ్మెల్యేల పని తీరుపై రిపోర్ట్‌ ఇస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను ప్రగతిభవన్‌ పిలిపించి సర్వే వివరాలు చెబుతున్నారు. సర్వేలో మార్కులు తగ్గిన ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్‌ పీకుతున్నట్టు తెలుస్తోంది.

రేపు విజయవాడలో పర్యటించనున్న కేసీఆర్‌

Submitted by arun on Wed, 06/27/2018 - 15:15

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. తెలంగాణ మొక్కులు చెల్లించుకుంటున్న కేసీఆర్‌ ...కనకదుర్గమ్మను దర్శించుకుని ముక్కుపుడక సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులను కేసీఆర్‌ వరుసగా తీర్చుకుంటున్నారు. ఇక తన విజయవాడ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుతో కేసీఆర్ భేటీ కావచ్చని తెలుస్తోంది.  ఇప్పటికే తిరుమల వెంకన్నకు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి, వరంగల్ భద్రకాళి అమ్మవారికి, కురవి వీరభద్ర స్వామికి పెట్టిన మొక్కులను కేసీఆర్ తీర్చుకున్నారు.