kcr

కేసీఆర్‌ సెంటిమెంట్ అస్త్రం...

Submitted by arun on Mon, 09/17/2018 - 11:02

అభ్యర్ధుల ప్రకటనతో రేగిన అసమ్మతిని చల్లార్చేందుకు టీఆర్ఎస్ అధినేత సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పోరాడి సాధించుకున్న  రాష్ట్రంలో అధికారం కావాలంటే  కలిసి ఉందామంటూ భావోద్యేగాలను రాజేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంటేనే అందరికి న్యాయం జరుగుతుందంటూ కొత్త ఆశలు రాజేస్తూ అసమ్మతి నేతలను దారికి తెచ్చుకుంటున్నారు.  

నన్ను అరెస్టు చేసుకోమను... నేను రెడీగా ఉన్నా: రేవంత్‌

Submitted by arun on Thu, 09/13/2018 - 11:02

కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ కేసీఆర్‌ కక్ష సాధింపులకు దిగుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ కేసులో ఆధారాలుంటే తనను అరెస్ట్‌ చేసుకోవచ్చని రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేసులకు కాంగ్రెస్‌ నేతలు భయపడరు అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక లెక్కకు లెక్క తీర్చుకుంటామని రేవంత్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణలోని కొందరు ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి మోకరిల్లుతున్నారని... కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 15:28

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని ఓడిస్తానని చెప్పారు. టీఆర్ ఎస్ పతనం నిజామాబాద్ జిల్లా నుంచి ప్రారంభం అవుతుందని భూపతిరెడ్డి తేల్చి చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే తాను కూడా ఇప్పుడే రాజీనామా చేస్తానని... లేకపోతే చేయను అన్నారు భూపతిరెడ్డి. నేను తప్పు చేస్తే ఎందుకు సస్పెండ్ చేయరు క్షమాపణ ఎందుకు చెప్పరు?

మాజీ ఎమ్మెల్యే ఓదెలు స్వీయా గృహనిర్బంధం

Submitted by arun on Tue, 09/11/2018 - 11:45

మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలనేదని మనస్థాపంతో.. మాజీ ఎమ్మెల్యే ఓదెలు స్వయంగా గృహనిర్బంధం వెళ్లారు. ఇంట్లో తాళం వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఓదెలుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా గృహనిర్బంధంలోనే ఉన్నారు. 24 గంటల్లో టికెట్‌పై హామీ రాకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా ఓదెలు చెప్పారు. కేసీఆర్ ను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనకు టికెట్ ఎందుకు ఇవ్వరని ఓదెలు ప్రశ్నించారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశాననీ, అలాంటి తనను పక్కకు తప్పించడం దారుణమని ఓదేలు వాపోయారు.

ఆ సీటు ఇస్తేనే వస్తామని చెప్పాం: కొండా సురేఖ

Submitted by arun on Sat, 09/08/2018 - 12:14

టీఆర్ఎస్‌ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ ప్రకటించిన జంబో లిస్ట్‌లో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందన్నారు. బీసీ మహిళననే నా పేరు ప్రకటించకుండా అవమానించారని ఆరోపించారు. మేం చేసిన తప్పేంటో తెలియజేయాలన్నారు. కార్పొరేషన్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా డబ్బులు ఖర్చు చేసి గెలిపించామని వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గత ఎన్నికల సమయంలో చాలాసార్లు తమకు వర్తమానం పంపారని...అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్‌ఎస్‌లోకి వస్తామని తాము తెల్చిచెప్పామని అన్నారు.

కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్...ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం...

Submitted by arun on Sat, 09/08/2018 - 11:59

టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సినీయర్‌ నేత జానారెడ్డి ఫైరయ్యారు. రైతులకు 24గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా పట్టుకుంటానని తాను చెప్పలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌ జెండా పట్టుకుంటానని ఎప్పుడు చెప్పలేదని స్పష్టం చేశారు. నిజంగా ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అబద్దాలు ఎలా చెబుతారని నిలదీశారు. ఇష్టానుసారంగా  మాట్లాడుతున్న కేసీఆర్‌ ఆత్మ విమర్శన చేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌పై జానారెడ్డి ఫైర్

Submitted by arun on Fri, 09/07/2018 - 15:50

కాంగ్రెస్ త్యాగాల పునాదులపైనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. అలాంటి కాంగ్రెస్‌ పెద్దలపై కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మాటలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముందస్తుకు వెళ్తున్నారని జానా ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌పై మంత్రి నారాలోకేష్‌ సెటైర్లు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:56

కేసీఆర్‌పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన తెలుగు వాళ్లంతా కలుసుండాలని  ఓ వైపు చెబుతూనే మరో వైపు జాగో  బాగో అంటున్నారన్నారు. టీఆర్ఎస్‌లో టీడీపీ వాళ్లు ఎంత మంది ఉన్నారో అందరికి తెలుసంటూ వ్యాఖ్యానించిన లోకేష్‌ ఆంధ్రుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పక్కలో కూర్చోబెట్టుకున్నారన్నారు. ఆంధ్రా వాళ్ల ఓట్లతోనే టీఆర్ఎస్‌‌కు జీహెచ్‌ఎంసీ పీఠం దక్కిందన్నారు.  తెలంగాణ అసెంబ్లీ రద్దు ఆమోదం పొందిన సమయంలో నారాలోకేష్ కామెంట్స్ ఆసక్తి కరంగా మారాయి.  

ఉత్తమ్‌కు గట్టిపోటీనిచ్చేందుకు గులాబీ బాస్‌ వ్యూహాలు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:24

కేసీఆర్‌ తమ అభ్యర్థులను ప్రకటించని మరో రెండు కీలక నియోజకవర్గాలు హుజూర్‌ నగర్, కోదాడ. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలివి. ఉత్తమ్‌కు చెక్‌పెట్టాలని రకరకాల వ్యూహాలు వేస్తున్న గులాబీ బాస్, వీటికి అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఈ స్థానాలకు క్యాండెట్స్‌ను ప్రకటించకపోవడానికి కారణమేంటి....ఈ రెండు నియోజకవర్గాలపై కేసీఆర్‌ గురి ఏంటి? 

ఆ 14 నియోజకర్గాల్లో పెండింగ్.. ఎందుకంటే?

Submitted by arun on Fri, 09/07/2018 - 10:20

ముందస్తు గంట మోగించిన టిఆరెస్ అధినేత కేసిఆర్ ఏకంగా 105 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేసి సమరానికి సై అన్నారు. చాలా మంది సిటింగ్ లకు సీట్లు ఖరారైనా.. ఇద్దరికి మాత్రం టిక్కెట్లు నిరాకరించగా, అయిదుగురు సిటింగ్ ల సీట్లను పెండింగ్ లో పెట్టారు. మరో 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.