kcr

గజ్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుస్తా: కెసిఆర్

Submitted by chandram on Sun, 11/11/2018 - 17:38

గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుస్తానని అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. గజ్వేల్‌లో ఇల్లు లేనివారు ఎవరూ ఉండకూడదని, ఎర్రవల్లి ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు వేసుకున్నాం. త్వరలోనే గజ్వేల్‌కి రైలు మార్గం వస్తుందని తెలిపారు. గజ్వేల్ ఇంకా విస్తరించబోతుందని, ప్రజలందరికి తాగునీరుఇచ్చాం త్వరలోనే సాగు నీరుకూడా వస్తుందని అలాగే కొండపోచమ్మ ప్రాజెక్ట్ ను నింపితీరుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయిన సీఎం కేసీఆర్‌

Submitted by chandram on Sun, 11/11/2018 - 14:42

భారీ మెజార్టీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా గజ్వేల్‌కు చెందిన పార్టీ కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో కాసేపట్లో సమావేశం కానున్నారు. సుమారు 15 వేల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనట్టు సమాచారం. భద్రతా కారణాలతో 12 గంటల వరకే కార్యకర్తలను లోపలికి అనుమతించారు. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీ కలిసి పోటీ చేస్తున్ననేపధ్యంలో భారీ మెజార్టీ లక్ష్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో ఈ నెల 14న నామినేషన్ వేయనుండంతో జన సమీకరణ ఇతర అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు.  
 

Tags

12 నియోజ‌క‌వ‌ర్గాలకు త్వరలోనే అభ్యర్థుల‌ ప్రకటన

Submitted by arun on Sat, 11/10/2018 - 12:46

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందే గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థుల‌కు గుడ్ న్యూస్ అందించారు. ప్రక‌టించిన అభ్యర్థులంద‌రికి  బీ-ఫామ్స్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు. ఈనెల 11న తెలంగాణ భ‌వ‌న్‌లో స్వయాన ఆయ‌న చేతుల‌మీదుగానే అభ్యర్థుల‌కు బీ-ఫారాలు అందించ‌బోతున్నారు. నోటిఫికేషన్ వెలువ‌డిన నాటి నుంచే అభ్యర్థులంతా ప్రచారాన్ని మ‌రింత ముమ్మరం చేయాల‌ని, ప్రతిప‌క్షాల‌కు అవ‌కాశం లేకుండా గెలుపు మ‌నదే కావాల‌న్న దిశా-నిర్ధేశం చేయ‌బోతున్నారు గులాబీ బాస్.

రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటుతుంది

Submitted by chandram on Fri, 11/09/2018 - 16:42

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్ నియోజకవర్గం నుండి ల‍క్ష ఓట్ల మెజరిటీతో గెవడం ఖాయమని ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.కంటివెలుగుతో పేదల పెన్నిదిగా ఉన్న కెసిఆర్ కు ఓటువేసి గెలిపించాలన్నారు. తూప్రాన్ ను మున్సిపాలిటీగా, రీజీనల్ రింగ్ రోడ్డుతో అభివృద్ది పదంలో దూసుకపోతుందని తెలిపారు. రూ. 6కోట్లతో గజ్వేల్ లో కెసిఆర్ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు గజ్వేల్ ప్రచారంలో హరీశ్ రావు అన్నారు. కెసిఆర్ కు తిరుగులేదని ఇండియా టుడే సర్వేలో 75శాతంతో మళ్లీ కెసిఆరే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపడుతరని సర్వే వెల్లడించిన విషయం గుర్తుచేశారు.

బుజ్జగింపుల పర్వం పార్ట్‌-2...మిగతా 12 స్థానాల్లో ఆశావహులను...

Submitted by arun on Sun, 11/04/2018 - 14:28

గులాబీ తెరపై బుజ్జగింపుల పర్వం పార్ట్‌ టు మొదలైంది. మొన్నటి వరకు కొందర్ని దారిలోకి తెచ్చిన అధినాయకత్వం, మాటవినని మిగతా నేతలనూ చల్లబరిచేందుకు సిద్దమైంది. త్వరలో ప్రకటించబోతున్న 12 స్థానాల్లో, ఆశావహులు, మిగతా నేతలనూ పిలిపించుకుని మాట్లాడబోతున్నారు కేసీఆర్.

టీఆర్ఎస్‌లో స్టార్ క్యాంపెయిన‌ర్స్...40 మందిని ప్ర‌చారంలోకి దింపిన గులాబి బాస్ కేసీఆర్

Submitted by arun on Sat, 11/03/2018 - 11:02

టీఆర్ఎస్‌లో స్టార్ క్యాంపెయిన‌ర్స్ కేసీఆరే అని అంద‌రు భావించారు. కాని మ‌రో 40మంది కూడా రంగంలోకి దిగారు. వాళ్లు స్టార్ క్యాంపెయిన‌ర్స్ కాదు కేటీఆర్,హ‌రిష్ ,క‌విత‌లు అంత క‌న్నా కానే కాదు. మ‌రి ఎవ‌రా స్టార్ క్యాంపెయిన‌ర్స్ అనుకుంటున్నారా.? 

Tags

కేసీఆర్‌పై బీజేపీ అస్త్రం...పోటీకి యంగ్‌ లీడర్‌...

Submitted by arun on Wed, 10/24/2018 - 10:16

తెలంగాణలో బీజేపీ రూట్  మార్చిందా ? అధికారం కంటే సంచలన విజయాలపైనే దృష్టి సారించిందా ? ఏకంగా సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా కమలనాధులు పావులు కదుపుతున్నారా ?  గజ్వేల్‌ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెట్టారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు నిన్న మొన్నటి వరకు నమ్మిన నేస్తంగా ఉన్న మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ కుమారుడు ధర్మిపురి అరవింద్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. 

కేసీఆర్ సర్కార్ కు కేంద్రం ఊహించని షాక్

Submitted by arun on Tue, 10/16/2018 - 11:08

తెలంగాణ ప్రభుత్వానికి  మోదీ సర్కార్ ఊహించని షాకిచ్చింది.  కేంద్రం కేటాయించిన నిధులను వినియోగించుకోకుండా తాత్సారం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు  2016-17 ఏడాదికి గాను కేంద్రం తెలంగాణకు 70 వేల 674 ఇళ్ల కోసం 190.78 కోట్లను కేటాయించింది. అయితే ఈ నిధుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రెండేళ్లు గడిచినా  నిధులను వినియగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో...పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి...

Submitted by arun on Tue, 10/16/2018 - 10:45

ఎన్నికల ప్రచారంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న గులాబీ దళం మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిపెట్టింది. ఇప్పటికే పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు, సలహాలు, సూచనలు సేకరించిన కమిటీ ఈరోజు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మీటింగ్‌కి గులాబీ బాస్‌ కేసీఆర్‌ కూడా హాజరుకానుండటంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, రైతులు, బడుగు బలహీనవర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఖద్దర్‌ వేసుకుంటా... ఖబడ్దార్‌ అంటున్న గద్దర్

Submitted by santosh on Sat, 10/13/2018 - 16:03

ప్రజా గాయకుడు గద్దర్ యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగినా...అది అబద్ధమని ఆయన తేల్చి చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్‌ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. భార్య, కుమారుడితో సహా రాహుల్‌‌ని కలిశారు. కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, కొప్పుల రాజుతో పాటు రాహుల్‌తో సమావేశమయ్యారు. తర్వాత కొద్దిసేపటికే యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాతో కూడా గద్దర్ కుటుంబం భేటీ అయ్యింది.

Tags