kcr

నేటి నుంచి కేసీఆర్ తుది ప్రచారం..

Submitted by arun on Mon, 11/19/2018 - 12:03

అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. ఇక మిగిలింది ప్రచారమే. ఇవాళ్టి నుంచి గులాబీ బాస్‌ కేసీఆర్‌ ప్రచార పర్వం షురూ కానుంది. ఇన్నాళ్లూ అభ్యర్థుల ఎంపిక, యాగ నిర్వహణలో బిజీగా ఉన్న కేసీఆర్‌ ఇక నుంచి ఎన్నికల కధన రంగంలోకి దూకనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచే ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మంలో జరిగే ప్రచార సభకు హాజరుకానున్నారు. ఖమ్మం మొదలు ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 

ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కేసీఆర్ యాగాలు

Submitted by chandram on Sun, 11/18/2018 - 10:27

కేసీఆర్ మళ్ళీ యాగం చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, తెలంగాణ ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా..ఇవాల్టి నుంచి హోమాలు చేస్తారు. ఎర్రవల్లిలోని కేసీఆర్  వ్యవసాయక్షేత్రంలో మూడు రోజులపాటు హోమాలు చేస్తారు. 120 మంది ఋత్వికులు యాగకార్యాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఇప్పటివరకు ఆయన చేపట్టిన హోమాలు, యాగాలే అందుకు నిదర్శనం. గతంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే కోరికతో ఆయన అత్యంత భారీగా అయుత చండీయాగం చేశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఆయుత చండీయాగం గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ అలాంటి యాగాన్నే చేస్తున్నారు.

రేపటి నుంచి యాగాలు చేయనున్న కేసీఆర్..

Submitted by chandram on Sat, 11/17/2018 - 19:23

తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టాలని, ఘనమైన మేజరీటీ రావాలని, రాజయోగం రావాలని రేపటి నుంచి కేసీఆర్ యాగాలు చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు రాజా శ్యామల చండీహోమం, చండీ సహిత రుద్ర హోమంను చేయనున్నారు. యాగ కార్యక్రమాలల్లో భాగంగా ఇప్పటికే, ఎర్రవెల్లి గ్రామస్థులు గ్రామ దేవతలకు పూజలు చేశారు. రేపు ఉదయం నుండి కెసిఆర్ దంపతులు పూజలు నిర్వహించనున్నారు.
 

ప్రచార జోరు పెంచుతున్న గులాబీ దళం

Submitted by arun on Sat, 11/17/2018 - 10:42

టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చార జోరు పెంచబోతోంది. కేసీఆర్ ప్ర‌చార షెడ్యూల్ ఖరారు కారు జెట్ స్పీడులో దూసుకుపోబోతోంది. ఇంతకాలం మహాకూటని సీట్లు ఫైనల్ కాలేదని ప్రచారానికి విరామం ఇచ్చిన కేసీఆర్ వ‌రుసగా బహిరంగ సబల్లో పాల్గొనబోతున్నారు. బాస్ వస్తే క్షేత్ర స్థాయిలో సీన్ మారిపోతుందని టీఆర్ఎస్ అభ్యర్థులు భరోసాగా ఉన్నారు. 

19 నుంచి కేసీఆర్‌ బహిరంగ సభలు

Submitted by arun on Fri, 11/16/2018 - 11:19

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 19, 20 తేదీల్లో 9 నియోజక వర్గాలను కవర్ చేసేలా మొత్తం 6 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం రెండున్నరకు ఖమ్మంలోనూ ,. 19వ తేదీ మధ్యాహ్నం మూడున్నరకు జనగామ జిల్లా పాలకుర్తిలోనూ ముఖ్యమంత్రి బహిరంగ సభలు ఉంటాయి. అలాగే 20వ తేదీ ఒంటిగంటకు సిద్దిపేటలోనూ, మధ్యాహ్నం రెండున్నరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోనూ సీఎం సభలు ఉంటాయి. ఇక 20వ తేదీ మధ్యాహ్నం మూడున్నరకు సిరిసిల్లలోనూ..
సాయంత్రం నాలుగున్నరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు.

కొడుకు, కోడలికి కేసీఆర్ బాకీ...ఎంతంటే...

Submitted by arun on Thu, 11/15/2018 - 13:19

మంత్రి కేటీఆర్‌ దంపతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.కోటికి పైగా బాకీ ఉన్నారు. ఇందులో కొడుకు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ 82లక్షల 82వేల 570రూపాయిలు. కోడలు శైలిమ వద్ద కూడా కేసీఆర్ అప్పు చేశారు. ఆమెకు 24లక్షల 65వేలు బకాయి ఉన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన నామినేషన్‌లో తన ఆస్తులు, అప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ అఫిడవిట్‌లో పొందుపర్చారు. కేసీఆర్ సమర్పిచిన అఫిడవిట్ ప్రకారం.. కేసీఆర్‌ ఆస్తులు రూ.12.20 కోట్లు కాగా.. మొత్తంమీద ఆయనకు రూ.8.88 కోట్ల అప్పులు ఉన్నాయి.

Tags

కేసీఆర్‌ ఆస్తులు.. అప్పులు

Submitted by arun on Thu, 11/15/2018 - 10:24

నాలుగున్నరేళ్లు సీఎంగా పనిచేస్తున్న కేసీఆర్‌కు ఎంత ఆస్తి ఉంటుంది..? స్థిరాస్తులు ఎన్ని..? చరాస్తులు ఎన్ని..? కేసీఆర్ అప్పులు కూడా చేశారా..? ఆయనకు అప్పులు ఇచ్చిన వారు ఎవరు..? ఆయన ఎవరెవరి వద్ద ఎన్నెన్ని అప్పులు చేశారు..? కేసీఆర్ తాజా అఫిడవిట్ తో ఇలాంటి సమాచారం బయటకు వచ్చింది.
  

గజ్వేల్‌లో నామినేషన్‌ వేసిన కేసీఆర్‌

Submitted by chandram on Wed, 11/14/2018 - 15:20

టీఆర్ఎస్‌ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వెల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. సరిగ్గా 2 గంటలా 34 నిముషాలకు గజ్వెల్‌‌ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనుకున్న సమయానికే ఆర్డీవో కార్యాలయం చేరుకున్న ఆయన అట్టహాసాలకు దూరంగా నామినేషన్ వేశారు. కేసీఆర్‌ వెంట హరీశ్‌రావుతో పాటు మరో ఐదుగురు ముఖ్యులు మాత్రమే ఉన్నారు. కాన్వాయ్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌ కేవలం మూడు కార్లలోనే ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ వేశారు. 
 

హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి

Submitted by arun on Wed, 11/14/2018 - 13:22

ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ వేయబోతున్న సీఎం కేసీఆర్ గజ్వేల్ దగ్గర కోనాయిపల్లి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మధ్యాహ్నం కోనేటి రాయుడి ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు స్వాగతం పలికారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్‌ నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచారు. కేసీఆర్‌తో  పాటు మంత్రి హరీశ్‌రావు వెంకన్నను దర్శించుకున్నారు.

గజ్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుస్తా: కెసిఆర్

Submitted by chandram on Sun, 11/11/2018 - 17:38

గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుస్తానని అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. గజ్వేల్‌లో ఇల్లు లేనివారు ఎవరూ ఉండకూడదని, ఎర్రవల్లి ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు వేసుకున్నాం. త్వరలోనే గజ్వేల్‌కి రైలు మార్గం వస్తుందని తెలిపారు. గజ్వేల్ ఇంకా విస్తరించబోతుందని, ప్రజలందరికి తాగునీరుఇచ్చాం త్వరలోనే సాగు నీరుకూడా వస్తుందని అలాగే కొండపోచమ్మ ప్రాజెక్ట్ ను నింపితీరుతామని కెసిఆర్ స్పష్టం చేశారు.