brand ambassador

‘అమ్రపాలి’పై ధోని ఫిర్యాదు

Submitted by arun on Thu, 04/12/2018 - 12:41

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలిపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీ కోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు చెల్లించాల్సిన 150 కోట్ల రూపాయలు చెల్లించలేదని ధోనీ దావా దాఖలు చేశాడు. ధోనీతో పాటు కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, డుప్లెసిస్ కూడా ఈ సంస్థపై ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకలాపాలకోసం తమకు చెల్లింపులు చేయలేదని వారు దావాలో పేర్కొన్నారు.

ఇరిగేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఐదేళ్ల నేహాల్‌

Submitted by arun on Mon, 02/05/2018 - 11:17

మీకు తెలిసిన యు.కే.జి చదివే పిల్లలు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారంటే ఆడుకోవడమో లేక టివి  చూస్తాడని అంటారు. కానీ, ఖమ్మం జిల్లా చింతకాని మండలం పండిళ్లపల్లికి చెందిన కోటి నెహల్ అనే బాల మేధావి  తన జ్ఞాపక శక్తితో తెలంగాణ ప్రభుత్వాన్నే మెప్పించాడు. సీఎం కేసీఆర్‌ రీ డిజైన్‌ చేసిన ప్రాజెక్టుల తీరును అనర్గళంగా చెప్పి మంత్రి హరీశ్‌రావు మనసు చూరగొన్నాడు. దీంతో కోటి నెహాల్‌ను తెలంగాణా ఇరిగేషన్‌ శాఖ బ్రాండ్‌ అంబాసిడార్‌గా నియమించారు. 

కెఎల్‌ఎమ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

Submitted by lakshman on Tue, 09/19/2017 - 19:10

ఒక్క చాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటానంటూ ఫిల్మ్ నగర్‌లో చెప్పులరిగేలా తిరిగే వాళ్లు ఈరోజుకూ ఉన్నారు. టాలీవుడ్‌లో చాలామంది ఆ ఒక్క చాన్స్ వల్లే ఈరోజు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎన్ని సినిమాలు తీసే సత్తా ఉన్నా ఒక్క హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎన్నటికీ గుర్తింపు రాదు. ఆ ఒక్క హిట్ పడితే ఆ హీరో రేంజే మారిపోతుంది. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో అలా ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నాడా అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానమొస్తుంది. పెళ్లిచూపులు సినిమాకు ముందు ఎన్ని సినిమాల్లో నటించినా విజయ్‌కు ఆశించిన గుర్తింపు రాలేదు.