Konda Surekha

పరకాల పీఠంపై ఏ జెండా ఎగరబోతుంది..?

Submitted by chandram on Mon, 11/26/2018 - 15:25

ముందస్తు ఎన్నికలకు ముందే కొండ సురేఖపై టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా నొచ్చుకున్న సురేఖ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పింది. తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కొండ సురేఖ తనేంటో ఎన్నికల్లో చూపిస్తానని కెసిఆర్ కు సవాల్ విసిరింది. అనంతరం రాహుల్ గాంధీతో మంతనాలు జరిపి చివరకు రాహుల్ సమక్షంలో కొండ దంపతులు కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో కొండదంపతులు రెండు సీట్లు ఆశించినా అధిష్ఠానం ఒక్కదానితో సరిపెట్టుకొమని బుజ్జగించడంతో సురేఖ ఒక్కదానితో సరిపెట్లుకుంది. పరకాల నియోజకవర్గం కావాలనే కోరుకుంది.

కాంగ్రెస్ లో కొండాకు కీలక పదవి..?

Submitted by arun on Wed, 09/26/2018 - 17:33

కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొండా మురళి, సురేఖ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు స్థానాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. 

బ్రేకింగ్‌: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా దంపతులు..

Submitted by arun on Wed, 09/26/2018 - 12:45

తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో తన భర్త కొండా మురళితో కలిసి సొంతగూటిలో చేరారు. టీఆర్ఎస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఆమె ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. బహిరంగ లేఖ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తర్వాత నిన్న రాత్రే ఢిల్లీకి చేరిన కొండా దంపతులు ఇవాళ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ఆమెకు మాత్రమే టిక్కెట్‌ వస్తుందని తెలుస్తోంది. ఇటు కొండా దంపతుల రాకతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ మరింత బలపడినట్లైందని కాంగ్రెస్‌ కేంద్రనాయకత్వం భావిస్తోంది.

కొండా దంపతుల విమర్శలను తిప్పికొట్టిన కేటీఆర్

Submitted by arun on Wed, 09/26/2018 - 10:22

కొండా దంపతుల విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. కొండా సురేఖ, మురళి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు పోతూ పోతూ రాళ్లు వేయడం సహజమేనని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కొండా దంపతులు తనపై, పార్టీపై చేసిన ఆరోపణలపై పరోక్ష విమర్శలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు పోతూ పోతూ రాళ్లు వేయడం సహజమేనని అన్నారు. టీఆర్ఎస్‌పై విమర్శలు చేసి అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఎవరికి ఎంత బలం ఉందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

కొండ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎదురుదాడి...టీఆర్ఎస్‌లో చేరినప్పుడు దొరతనం కనిపించలేదా

Submitted by arun on Tue, 09/25/2018 - 16:40

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన కొండా దంపతులపై ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్‌ది దొరల పాలన అని విమర్శిస్తున్న కొండా కుటుంబానికి టీఆర్ఎస్‌లో చేరినప్పుడు దొరతనం కనిపించలేదా అని గుండు సుధారాణి ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అభద్రతాభావంతో కొండా సురేఖ, మురళి మాట్లాడుతున్నారు. కొండా దంపతులు ఒంటెద్దు పోకడలు పోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిది అని తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు అంతా గమనిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో వర్గాలు ఉన్నాయని కొండా దంపతులు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో గ్రూపులు లేవు.

కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి

Submitted by arun on Tue, 09/25/2018 - 15:06

భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడే చరిత్ర కొండా దంపతులదని ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత వారికి లేదని తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏకగ్రీవంగా గెలవాలని సవాల్‌ విసిరారు. అలా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ సర్వేలో కొండాకు మెజార్టీ రాలేదని వినయ్‌ భాస్కర్‌ చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు టీఆర్‌ఎస్ రాజకీయంగా పునర్జన్మనిచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో కేటీఆర్‌పై ఎన్నో కేసులు పెట్టారు. కేటీఆర్‌పై కొండా దంపతులు విమర్శలు చేయడం సరికాదన్నారు.

కొండా కపుల్స్‌... హరీష్‌రావు గ్రూపా?

Submitted by santosh on Tue, 09/25/2018 - 13:43

గులాబీ కోటలో ఏం జరుగుతుంది? బయట ప్రచారం జరుగుతున్నట్టు అసమ్మతి సెగలు కారును బేజారెత్తిస్తున్నాయా? టీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? కొండా సురేఖ... తాము హరీష్‌ వర్గమన్న విషయం అందరికీ తెలుసూ... అంటూ మీడియా ముందు ఎందుకు  మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయా? కేసీఆర్‌ కేంద్రంగా కేటీఆర్‌ గ్రూప్, హరీష్‌రావు గ్రూప్‌ అన్నట్టుగా పరిస్థితులు మారాయా? కొండా దంపతులు హరీష్‌ వర్గం కాబట్టే... సురేఖకు టికెట్‌ ఇవ్వలేదా? ఎర్రబెల్లి దయాకర్‌రావు తమపై విషం చిమ్ముతున్నారంటూ ఆరోపించిన కొండా మురళీ... తాము ఎవరి వర్గమో త్వరలోేనే తేలిపోతుందన్నట్టు ఎందుకు అన్నారు?

కేసీఆర్ కు కొండా సురేఖ బహిరంగ లేఖ...

Submitted by arun on Tue, 09/25/2018 - 12:22

టీఆర్ఎస్‌లో తాము హరీశ్‌రావు వర్గం అని కొండా సురేఖ దంపతులు తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌ పై తిరుగుబావుటా ఎగురవేసిన కొండా దంపతులు పార్టీ అధినేత కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనపై ఆమె డైరెక్ట్‌ అటాక్‌ చేసింది. తీవ్ర విమర్శలు చేసిన ఆమె వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించాలని తెలంగాణ ప్రజలను కోరింది. తాము హరీశ్‌రావు వర్గం అని చెప్పుకొచ్చిన ఆమె పార్టీలో ఆయన పరిస్థితి ఏంటో ఇటీవలే చూశారంటూ వ్యాఖ్యానించింది. 

అందుకే కొండా సురేఖకు టికెట్‌ ఇవ్వలేదు

Submitted by arun on Sat, 09/08/2018 - 16:12

టీఆర్‌ఎస్ పార్టీపై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ మఖ్యనేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిప‌డ్డారు. కొండా సురేఖ, మురళి దంపతులు స్వయంగా నా దగ్గరకు వచ్చి టీఆర్‌ఎస్ రాజకీయ జీవితం ఇవ్వాలని అడిగారు అని వినయ్ గుర్తు చేశారు. కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలనే ఆమెకు టిక్కెట్‌ ఇవ్వలేదని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. ఉద్యమ కారులను పక్కకు పెట్టి కొండా సురేఖకు టికెట్‌ ఇచ్చి గెలిపించామన్నారు. అలాంటిది ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

తెలంగాణ.. కల్వకుంట్ల ఇల్లు కాదు : కొండా సురేఖ

Submitted by arun on Sat, 09/08/2018 - 12:52

తనకు చోటు దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీసీ మహిళను అన్న కారణంతోనే తనను అవమానించారని ఆరోపించారు. ఇది కేవలం తననే కాకుండా రాష్ట్రంలోని బీసీలను, తెలంగాణ మహిళలు అందరినీ అవమానించినట్లేనని స్పష్టం చేశారు. తెలంగాణ అన్నది కల్వకుంట్ల ఇల్లు కాదన్నారు. తెలంగాణను కల్వకుంట్ల వారి ఇల్లుగా మార్చుతానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.