AICC

ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్

Submitted by arun on Fri, 06/22/2018 - 15:35

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఏఐసీసీలో కీలక మార్పులు కొనసాగిస్తున్నారు. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు మార్పులు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ బాధ్యులు,ఏఐసీసీ కార్యదర్శుల నియామకం చేపట్టారు. తాజా నియామకాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా తెలంగాణాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమిస్తూ మహారాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. మాజీ కేంద్రమంత్రి జేడీ శీలంను కూడా ఏఐసీసీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ కు అనుసంధానించారు.

జిల్లా అధ్యక్షులను నియమించిన రాహుల్ గాంధీ

Submitted by arun on Sat, 05/26/2018 - 11:36

తెలంగాణ జిల్లా స్థాయి పద‌వుల భ‌ర్తీకి కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కారం చుట్టింది. కొత్త జిల్లాల ప్రాతిప‌దిక‌న కాకుండా పాత ప‌ది జిల్లాల‌ ప్రకారమే హైక‌మాండ్ డీసీసీ అధ్యక్షుల్ని నియమించింది. దాదాపు అంతా పాత వాళ్ళేకే అవ‌కాశం క‌ల్పించ‌గా..హైద‌రాబాద్‌ అధ్యక్షుడిగా దానంను త‌ప్పించి అంజ‌న్ కుమార్ యాద‌వ్‌కు ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

Tags

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పీసీసీ చీఫ్

Submitted by arun on Thu, 04/26/2018 - 11:35

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తాను అనుకున్న దారిలో దూసుకుపోతున్నారు. పార్టీలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటూనే తన పీఠాన్ని కాపాడుకుంటున్నారు. పాదయాత్రలు చేయాలనుకున్న నేతలకు AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనే నో చెప్పించడం సీనియర్లు తనపై ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకుండా వంటి ఎత్తుగడలు వేస్తున్నారు.