trisha

ఇందిరా గాంధీ పాత్రలో త్రిష ?

Submitted by arun on Fri, 10/26/2018 - 16:20

నువ్వస్తానంటే నేనోద్దంటానా, వర్షం, అతడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన గ్లామర్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న త్రిష తెలుగు లో  సినిమాలు చేయకపోయిన తమిళంలో మాత్రం బాగానే అవకాశలు తెచ్చుకుంటుంది..అయితే ఇటివల తమిళ మీడియాలో త్రిష గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది..  ఇందిరా గాంధీ బయోపిక్ లో త్రిష నటిస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది కోలీవుడ్ లో..ఇందిరా గాంధీ ట్రేడ్ మార్క్ అయిన షార్ట్ హైర్ స్టైల్, సాల్ట్ & పెప్పర్ లుక్ తో చీర కట్టు లో త్రిష అచ్చం ఇందిరా గాంధీ లాగే ఉంది. సోషల్ మీడియా లో మాత్రం త్రిష ఇందిరా గాంధీ బయోపిక్ లో నటిస్తుంది అన్న వార్త వైరల్ అయ్యింది.

పెళ్ళి వార్త‌లపై స్పందించిన త్రిష‌

Submitted by arun on Wed, 05/30/2018 - 13:37

టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మళయాళ సినిమాలతో బిజీగా ఉంది. ఆ మధ్య వరుణ్ అనే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరిగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ బిజినెస్ మన్ తో త్రిషకు ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. అతడ్ని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించు కుందని ఇందుకోసమే భారీ స్థాయిలో షాపింగ్ చేస్తోందని కూడా ప్రచారం జరిగింది. దీనిపై త్రిష తాజాగా స్పందించింది. కొంతకాలంగా నా పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. పెళ్లి ఆలోచ‌న నా మ‌న‌సులో ఇప్ప‌టి వ‌ర‌కు లేదు.

బాత్రూమ్స్‌ కట్టిన త్రిష

Submitted by arun on Sun, 12/31/2017 - 11:16

చెన్నై బ్యూటీ త్రిష న‌టిగానే కాదు సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్య‌క్తి కూడా. యూనిసెఫ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న త్రిష ప్ర‌జ‌ల‌లో అవ‌గాహాన క‌లిపించేందుకు అప్పుడ‌ప్పుడు ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతూనే ఉంటుంది. ఇంక పెటా ద్వారా జంతువుల‌ సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ని కూడా తీసుకుంది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం జిల్లాలోని నెమలి గ్రామంలో నాలుగు మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేశారు త్రిష. సిమెంట్‌ను తన చేతులతో కలిపిన త్రిష.. ఇటుకలను వరుసలో పెట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం. మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడిన త్రిష..

త్రిష‌ని అంత‌మంది ఫాలో అవుతున్నారు

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 17:34

'వ‌ర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అత‌డు', 'ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే' చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన చెన్నై సుంద‌రి త్రిష‌. తెలుగుతో పాటు త‌మిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ‌.. 'నాయ‌కి' త‌రువాత మ‌ళ్లీ మ‌రో తెలుగు చిత్రానికి సంత‌కం చేయ‌లేదు. అయితే త‌మిళంలో మాత్రం అర‌డ‌జ‌ను చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉంది.

అక్టోబ‌ర్ లో వ‌స్తున్న 'చ‌దురంగ వేట్టై2'

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 16:24

2014లో చిన్న సినిమాగా విడుద‌లై.. సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌మిళ చిత్రం 'చ‌దురంగ వేట్టై'. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా 'చ‌దురంగ వేట్టై 2' రూపొందుతోంది. అర‌వింద్ స్వామి, త్రిష జంట‌గా న‌టించిన ఈ సినిమాకి 'చదురంగ వేట్టై' ద‌ర్శ‌కుడు హెచ్‌. వినోద్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు అందించ‌గా.. ఎన్వీ నిర్మ‌ల కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.