film chamber

24 గంటల్లో తేల్చండి.. లేకపోతే! : పవన్

Submitted by arun on Fri, 04/20/2018 - 15:51

పరుష పదజాలంతో తన తల్లిని దూషించిన వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైరయ్యాడు. ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని  పక్కా ప్లాన్ ద్వారా ... ముందే రచించిన స్క్రిప్ట్  ప్రకారం జరిగిన వ్యవహారమంటూ మండిపడ్డారు. మొత్తం ఎపిసోడ్‌లో కనబడుతున్న పాత్రధారుల కంటే వెనకుండి నడిపించిన బడాబాబులే కీలకపాత్ర పోషించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదంటూ మా అసోషియేషన్‌పై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం ప్రదర్శించారు. తన తల్లికి న్యాయం చేసే వరకు ఫిలిం ఛాంబర్‌ వదలి వెళ్లేది లేదని అక్కడే భైఠాయించారు.  భారీగా తరలివచ్చిన అభిమానులు, జనసేన కార్యకర్తలతో ఫిలిం చాంబర్ నినాదాలు మార్మోగింది.

ఫిల్మ్‌ ఛాంబర్‌‌ దగ్గర ఉద్రిక్తత

Submitted by arun on Fri, 04/20/2018 - 13:52

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్‌ పిలుపుతో పెద్దఎత్తున ఫిల్మ్‌ ఛాంబర్‌‌కి చేరుకున్న జనసేన కార్యకర్తలు, మెగా పవన్‌‌ అభిమానులు ఆందోళనకు దిగారు. పవన్‌‌కి మద్దతుగా ఫిల్మ్‌ ఛాంబర్‌‌ను ముట్టడించిన ఫ్యాన్స్‌‌ వర్మకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పవన్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటున్న అభిమానులు వర్మకి తగిన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.