jai lava kusha

మూడు వారాలు .. మూడు సినిమాలు..

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 18:37

'ఊహ‌లు గుస‌గుస‌లాడే' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత 'జోరు', 'జిల్‌', 'శివ‌మ్‌', 'బెంగాల్ టైగ‌ర్‌', 'సుప్రీమ్‌', 'హైప‌ర్' చిత్రాల‌తో సంద‌డి చేసింది. తాజాగా ఎన్టీఆర్‌కి జోడీగా 'జైల‌వ‌కుశ‌'లో మెరిసింది. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ రాశి న‌టిస్తోంది. కాగా, రాశి న‌టించిన మూడు చిత్రాలు అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల‌కి సిద్ధ‌మ‌య్యాయి. ఆ చిత్రాలే 'రాజా ది గ్రేట్‌', 'విల‌న్‌', 'ఆక్సిజ‌న్‌'.

ఎన్టీఆర్‌.. మ‌రో కొత్త పాత్ర‌

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 21:15

ఈ త‌రం క‌థానాయ‌కుల్లో ఆల్‌రౌండ‌ర్ అనిపించుకున్న హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. తాజాగా వ‌చ్చిన 'జైల‌వ‌కుశ‌'లో మూడు విభిన్న పాత్ర‌లు చేసి మెప్పించాడు. ముఖ్యంగా న‌త్తితో మాట్లాడే జై పాత్ర అత‌నికి మంచి పేరుని తీసుకువ‌చ్చింది. ప్ర‌తినాయ‌కుడి ఛాయ‌లున్న ఈ పాత్ర‌లో తార‌క్ విశ్వ‌రూపం చూపించాడు.

ప్రేమ‌తో.. మీ నివేదా థామ‌స్‌

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 15:08

'జెంటిల్‌మాన్‌', 'నిన్ను కోరి' చిత్రాల‌తో వ‌రుస‌గా రెండు వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న నివేదా థామ‌స్‌.. తాజాగా 'జైల‌వ‌కుశ‌'తో ప‌ల‌క‌రించింది. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో న‌టిస్తే.. వాటిలో జై పాత్ర స‌ర‌స‌న ఈ ముద్దుగుమ్మ న‌టించింది. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా.. వ‌సూళ్లు బాగున్నాయి. ఈ సంద‌ర్భంగా నివేదా థామ‌స్ హ్యాట్రిక్ విజ‌యాల ప‌ట్ల ట్విట్ట‌ర్‌లో స్పందించింది. ఓ లేఖ రూపంలో త‌న స్పంద‌న‌ని తెలిపిందీ కేర‌ళ‌కుట్టి.

మిలియ‌న్ క్ల‌బ్‌.. వ‌రుస‌గా నాలుగోసారి

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 12:29

ఓవ‌ర్‌సీస్ మార్కెట్ ప‌రంగా 'మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్' అనేది తెలుగు సినిమాకి ప్ర‌త్యేకమైన విష‌యంగా చెప్పుకోవ‌చ్చు. మ‌హేష్‌బాబు 'దూకుడు'తో మొద‌లైన ఈ ట్రెండ్‌.. 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' వంటి చిన్న చిత్రాల విష‌యంలోనూ కొన‌సాగి.. తెలుగు సినిమా స్థాయి పెరిగిన‌ట్ల‌య్యింది. ఇదిలా ఉంటే.. యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్ కొత్త చిత్రం 'జైల‌వ‌కుశ' కూడా తాజాగా ఈ క్ల‌బ్‌లోకి చేరింది. ఈ క్ల‌బ్‌లో చేరిన తార‌క్ ఐదో చిత్ర‌మిది. అలాగే తార‌క్ నుంచి వ‌చ్చిన వ‌రుస నాలుగు చిత్రాలు ఈ క్ల‌బ్‌లో చేర‌డం విశేషం. 

జై ఒక అద్భుతం - ద‌ర్శ‌కేంద్రుడు

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 13:20

'నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను'.. ఇదీ ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జైల‌వ‌కుశ' చూశాక ట్విట్ట‌ర్ లో తెలిపిన స్పంద‌న‌.

ఎన్టీఆర్‌కి రాజ‌మౌళి ప్ర‌శంస‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 14:02

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన తొలి చిత్రం 'జై ల‌వ కుశ‌'. జై, ల‌వ‌కుమార్‌, కుశ అనే మూడు పాత్రల్లో తార‌క్ న‌టించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా చూసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. ఎన్టీఆర్‌ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. 'తార‌క్‌.. నా హృద‌యం చాలా గ‌ర్వంతో ఉప్పొంగుతోంది. మాట‌లు స‌రిపోవ‌డం లేదు. జై జై' అంటూ ట్వీట్ చేశారు.

2400 థియేట‌ర్స్‌లో 'జై ల‌వ కుశ‌'

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 11:30

'టెంప‌ర్', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్' వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా  చిత్రం 'జై ల‌వ కుశ‌'. కెరీర్‌లోనే మొద‌టిసారిగా ఈ సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేశాడు తార‌క్‌. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి 'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

'జై లవ కుశ'లు ఎలా ఉంటారంటే..

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 15:56

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం 'జై ల‌వ కుశ‌'. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ప‌వ‌ర్' ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఈ నెల 21న విడుద‌ల కానుంది. 158 నిమిషాల పాటు సాగే ఈ సినిమాలో  మూడు పాత్ర‌లు ఎలా ఉంటాయో ఎన్టీఆర్ నే ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా చెప్పుకొచ్చారు.