karthi

ఇంట్లో ప‌నిచేసే యువ‌కుడికి పెళ్లి చేసిన హీరో సూర్య

Submitted by arun on Wed, 01/24/2018 - 13:14

తమిళ హీరో సూర్య కుటుంబం తమిళ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. మిగిలిన సినీ ప్రముఖులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాలతో సంబంధం కలిగి ఉంటారు. కానీ, రాజకీయాలతో సంబంధం లేకుండా సూర్య కుటుంబం స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది. 'అరగం' ఫౌండేషన్ ద్వారా సూర్య పలు సేవాకార్యక్రమాలను చేస్తుంటాడు. సూర్య, కార్తీలు తమ అభిమానులతో చాలా ఆప్యాయంగా మెలుగుతుంటారు. తాజాగా తన వద్ద పని చేసే ఓ యువకుడికి సూర్య దగ్గరుండి పెళ్లి చేయించాడు. సూర్య కుటుంబ స‌మేతంగా హాజ‌ర‌య్యాడు. పెళ్లిని ద‌గ్గ‌రుండి జ‌రిపించాడు. కుటుంబ పెద్ద‌గా తాళిని స్వ‌యంగా అందించాడు. అలాగే ఆ పెళ్లి ఖ‌ర్చునంత‌టినీ భ‌రించాడు.

అభిమాని మరణంతో కన్నీరు పెట్టుకున్న కార్తీ

Submitted by arun on Wed, 12/27/2017 - 13:09

తమిళ నటుడు సూర్య తమ్ముడు కార్తీ తమిళంలోనే కాదు తెలుగులోను పాపులర్. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సత్తా చాటాడు కార్తీ. అంతేకాదు అభిమానులను తరుచూ కలుస్తూ వారికి సాయం చేస్తూ తన పెద్ద మనసును చాటుకున్న కార్తీ, ఓ అభిమాని మృతితో కన్నీరు పెట్టుకున్నాడు. తిరువన్నామలై కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ కుమార్ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కార్తీ వెంటనే జీవన్ ఇంటికి వెళ్ళి తన నివాళులు అర్పించాడు. అభిమాని మృతిని ఏ మాత్రం తట్టుకోలేకపోయాడు కార్తీ.
 

న‌వంబ‌ర్ 17న 'ఖాకీ'

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 13:12

'యుగానికి ఒక్క‌డు', 'ఆవారా', 'నాపేరు శివ' చిత్రాల‌తో తెలుగు వారికి చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు కార్తీ. తెలుగులో రూపొందిన స్ట్ర‌యిట్ చిత్రం 'ఊపిరి'తో ఇక్క‌డివారికి మ‌రింత చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం 'ధీర‌న్ అధిగారం ఒండ్రు' అనే త‌మిళ  చిత్రంలో న‌టిస్తున్నాడు కార్తీ. తెలుగులో ఈ చిత్రాన్ని 'ఖాకీ' పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.