Deve Gowda

‘నేను సీఎం కావడం మా నాన్నకు ఇష్టం లేదు’

Submitted by arun on Tue, 06/12/2018 - 17:26

తనను సీఎంను చేయడం తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు సీఎం పదవిని మీరే ఉంచుకోండని దేవగౌడ కాంగ్రెస్ నేతల​​కు సూచించారని పేర్కొన్నారు. అయితే, వారు మాత్రం సీఎంగా తనకే ఓటు వేశారని తెలిపారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉండడంతోనే ఆయనీ సూచన చేసి ఉంటారని పేర్కొన్నారు. ‘‘నాకు ఇప్పటికే రెండుసార్లు గుండె ఆపరేషన్ అయింది. ఇటువంటి సమయంలో నేను సీఎం కావడం అంత మంచిది కాదన్న ఉద్దేశంతో ఆయనీ సూచన చేసి ఉండొచ్చు’’ అని వివరించారు.

కర్ణాటకలోని తెలుగువారంతా ఆ పార్టీకే ఓటేయండి

Submitted by arun on Fri, 04/13/2018 - 15:50

కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలందరూ జేడీఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఫెడరల్ ఫ‌్రంట్‌ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ జేడీఎస్ దళపతి దేవేగౌడతో చర్చలు జరిపారు. కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్న కేసీఆర్‌ భారతమాతను, రైతులను రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బీజేపీ పాలిస్తున్నాయని వీటికి ప్రత్యామ్నాయంగా గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ పని చేస్తుందన్నారు. ఏడు దశాబ్దాలుగా కావేరి వివాదం కొనసాగుతూనే ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

ఫ్రంట్‌ ఏర్పాటుపై వేగం పెంచిన కేసీఆర్‌‌

Submitted by arun on Fri, 04/13/2018 - 14:17

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక అడుగు వేశారు. ఇప్పటికే కోల్‌కతా వెళ్లి బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో చర్చలు జరిపిన కేసీఆర్‌‌ ఇవాళ బెంగళూర్‌ వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆవశ్యకతను వివరించిన కేసీఆర్‌ లక్ష్యాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే ప్రస్తుత దేశ రాజకీయాలపై దేవెగౌడ, కేసీఆర్‌ మాట్లాడుకున్నారు. ఇక కేసీఆర్‌‌ వెంట సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్, ఎంపీలు వినోద్‌, సంతోష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.