Kuldeep Singh Sengar

ఉన్నావ్ రేప్ కేసు... బీజేపీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన సీఎం యోగి...

Submitted by arun on Fri, 04/20/2018 - 13:44

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కుల్దీప్‌ సెంగార్‌కు కొనసాగుతున్న ‘వై’ కేటగిరీ భద్రతను తొలగించింది. ఉన్నావ్ జిల్లా బంగర్మావ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఇప్పటిదాకా ఇద్దరు కమెండోలు, పోలీసులు సహా మొత్తం 11 మందితో ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. ఎమ్మెల్యే కుల్దీప్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారిస్తున్న‌ది. యూపీ పోలీసులు ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని మరోవైపు బాధితురాలు ఆరోపించారు.

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్...

Submitted by arun on Fri, 04/13/2018 - 10:54

ఉన్నావ్  రేప్ ఘటనలో మరో అడుగు ముందుకు పడింది. మొత్తానికి నిందితుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో లక్నోలో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు అతన్ని హజ్రత్ గంజ్ లోని సీబీఐ ఆఫీస్ కు తరలించారు. అతనిపై గతంలోనే పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. యోగి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇవాళ కులదీప్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.