CBI

సీబీఐలో ప్రకంపనల వెనుక తెలుగు వ్యక్తి

Submitted by arun on Wed, 10/24/2018 - 14:33

సీబీఐలో పెను ప్రకంపనాలకు తెలుగు వ్యాపారవేత్త సాన సతీష్‌ బాబు వాంగ్మూలం మూల కేంద్రంగా మారింది. ఢిల్లీ వ్యాపారి మెయిన్ ఖురేషీ కేసులో మధ్యవర్తిగా రంగ ప్రవేశం చేసిన సతీష్‌ బాబు విదేశాల్లో కొందరి  తరపున లాబీయింగ్ చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి సుఖేష్ గుప్తా బెయిల్ వ్యవహరంలోనూ జోక్యం చేసుకున్నాడు. అయితే మెయిన్ ఖురేషీ వ్యవహారంలో సతీష్ సానా నుంచి సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్ వర్మ మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాడంటూ మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్ ఆస్ధానా ఆగస్టు 24న కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు.  

సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలుగు అధికారి

Submitted by arun on Wed, 10/24/2018 - 10:22

సీబీఐ చీఫ్‌గా తెలుగు వ్యక్తికి ఛాన్స్‌ దక్కింది. సీబీఐలో సంక్షోభం నేపథ్యంలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావుకు డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వలు జారీ అయ్యాయి. మన్నెం స్వస్థలం వరంగల్‌ జిల్లా మంగపేట మండలం బోర్‌నర్సాపూర్. 1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావు ఒడిశా డీజీపీగా పని చేశారు. అనంతరం సీబీఐ దక్షిణాది రాష్ట్రాల జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు.

ఢిల్లీ హైకోర్టుకు చేరిన సీబీఐ వివాదం ..

Submitted by arun on Tue, 10/23/2018 - 14:00

సీబీఐ డైరెక్టర్‌, డిప్యూటి డైరెక్టర్‌ మధ్య రేగిన ముడుపుల వివాదం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ డిప్యూటి డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ రాకేష్‌ ఆస్ధానా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరో వైపు ఇదే కేసులో అరెస్టయిన సీబీఐ డీఎస్పీ దేవేందర్ కూడా కోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన ఆరోపించారు. విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కొద్ది సేపటి క్రితం విచారణ ప్రారంభించింది.  
 

సీబీఐలో అవినీతి కలకలం

Submitted by arun on Mon, 10/22/2018 - 10:28

నేర పరిశోధన, నేర నిరూపణల్లో తనదైన ముద్ర వేసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. ఇప్పటికే రాజకీయ నేతల కబంధ హస్తాల్లో పంజరంలో చిలకగా మారిన సంస్ధ ఉన్నతాధికారుల ఆధిపత్య పోరుతో వ్యక్తిగత ప్రతిష్ట కూడా మంటగలుస్తోంది. తాజాగా సంస్ధలో నెంబర్‌ టూగా ఉన్న అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దేశ చరిత్రలో మునుపెన్నడు లేని రీతిలో అత్యున్నత స్ధాయి సంస్ధలో అత్యున్నత అధికారిపై సొంత సంస్ధే అవినీతి కేసు నమోదు చేసింది.  

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్...

Submitted by arun on Fri, 04/13/2018 - 10:54

ఉన్నావ్  రేప్ ఘటనలో మరో అడుగు ముందుకు పడింది. మొత్తానికి నిందితుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో లక్నోలో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు అతన్ని హజ్రత్ గంజ్ లోని సీబీఐ ఆఫీస్ కు తరలించారు. అతనిపై గతంలోనే పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. యోగి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇవాళ కులదీప్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

రూ.371కోట్ల దుర్వినియోగం : చంద్ర‌బాబుపై సీబీఐ విచార‌ణ‌..?

Submitted by lakshman on Wed, 04/11/2018 - 12:43

కాగ్ నివేదిక ఆధారంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై కేంద్రం సీబీఐ విచార‌ణ జ‌రిపించ‌నుందా..? ఎన్డీఏకి వ్య‌తిరేకంగా ఫైట్ చేస్తున్న చంద్ర‌బాబుకు బీజేపీ భ‌యం ప‌ట్టుకుందా..? నేను నిప్పే అయినా జ‌న‌సేన - బీజేపీ - వైసీపీలు త‌న‌పై కుట్ర చేస్తున్నాయ‌న్న చంద్ర‌బాబు మాటల్లో నిజ‌మెంత‌..? ఏపీలో జ‌రుగుతున్న అవినీతి గురించి చ‌ంద్ర‌బాబును సీబీఐ విచారించ‌నుందా..? అంటే అవున‌నే అంటున్నాయి సోష‌ల్ మీడియాలోని వార్త‌లు .