north korea

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ట్రంప్‌, కిమ్ భేటీ

Submitted by arun on Tue, 06/12/2018 - 13:54

ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సింగపూర్‌లో ఇవాళ ఉదయం తొలిసారి సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్‌లు...గతానికి భిన్నంగా స్పందించారు. మొదటి నుంచి చివరి దాకా సమావేశం హ్యాపీగా సాగిందని ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్, కిమ్ ప్రకటించారు. 

ట్రంప్‌తో భేటికి టాయ్‌లెట్‌ వెంట తెచ్చుకున్న కిమ్‌

Submitted by arun on Tue, 06/12/2018 - 12:02

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌...దేశాధినేతల్లో విలక్షణమైన వ్యక్తి. విచిత్రమైన పనులు చేస్తూ....వార్తల్లోకి ఎక్కుతుంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీకి సింగపూర్‌‌కు వెళ్లారు. అధికారులు, భద్రతా సిబ్బందితో పాటు తన వ్యక్తిగత సహాయకులను వెంట తీసుకెళ్లారు. అక్కడి ఆగని కిమ్‌....ఓ విచిత్ర పని చేసి తాజాగా వార్తల్లో నిలిచారు.

త‌న‌దైన శైలిలో న్యూఇయ‌ర్ కి విష‌స్ చెప్పిన కిమ్

Submitted by arun on Mon, 01/01/2018 - 12:48

దేశాధినేత‌లు ఎవ‌రికి వారు..వారి వారి దేశ ప్ర‌జ‌ల‌కు నూత‌న‌సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెబుతుంటారు.  కానీ ఆ దేశాద్య‌క్షుడు మాత్రం త‌న‌దైన శైలిలో న్యూఇయ‌ర్ కి విష‌స్ చెప్పాడు. అమెరికాని నువ్వో కుక్క... అంటాడు. వాడో మెంటలోడు అని తేల్చేస్తాడు. నాతో పెట్టుకుంటే పుట్టగతులండవ్ అంటూ దుమ్మెత్తిపోస్తాడు. అలా అని అమెరికాలో కొంత బలవంతుడు కూడా కాదు. ఓ చిన్న దేశానికి పెద్ద నియంత. నా మాటే శాసనమంటూ ఫత్వాలు జారీచేసేంత పరమశాడిస్టు. ఎక్కడ ఏ పంచాయతీ జరుగుతున్నా, నాకేంటి లాభం? అని లెక్కలేసుకునే  ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను టార్గెట్ చేస్తూ న్యూఇయ‌ర్ కు స్వాగ‌తం ప‌లికాడు.

మరో ప్రచ్ఛన్నం

Submitted by lakshman on Thu, 09/21/2017 - 20:16

ఉత్తర కొరియా రూపంలో అమెరికాకు నేడు మరో విలన్ దొరికింది. ప్రచండ తుపానులతో అతలాకుతలమవుతున్న అమెరికాలోని న్యూయార్క్  నగరంలో మంగళవారం నాడు  జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో ఉత్తర కొరియాపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలిసారి ప్రసంగంలో చండ్రనిప్పులు చెరిగారు. అణు విధానంపై ఉత్తర కొరియా తన వైఖరిని మార్చుకోకపోతే విధ్వంసం  తప్పదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలపై దురాక్రమణ పూరిత యుద్ధాలు చేసిన అమెరికా, ఆ తర్వాత ఇరాన్, సిరియా దేశాలను విలన్‌లుగా చిత్రీకరిస్తూ  ప్రచారం చేసింది.

ఉత్తర కొరియా ధైర్యం

Submitted by lakshman on Mon, 09/18/2017 - 21:59

అమెరికాకు తాజా క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా స్పష్టమైన సంకేతం ఇచ్చింది. జపాన్లోని హొక్కాయిడో ద్వీపం మీదుగా వారం రోజుల్లోనే రెండోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి ప్రపంచ దేశాలకు మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సవాల్ విసిరారు. తాము ఏకంగా హైడ్రోజన్ బాంబునే పరీక్షించామని చెప్పి ప్రపంచ దేశాలకు పెనుసవాల్ విసిరిన కిమ్ సరిగ్గా వారం తిరక్కుండానే మరో ఖండాంతర క్షిపణి ప్రయోగిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోమని తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు. అసలు కిమ్ జాంగ్ ఉన్ కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? అణ్వస్త్ర అగ్ర దేశాలు కిమ్‌ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి?