triple talaq

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

Submitted by arun on Wed, 09/19/2018 - 16:36

ట్రిపుల్ తలాక్ చెబితే ఇకపై నేరంగా పరిగణిస్తారు. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరమని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. మూడుసార్లు తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ళ జైలుతో పాటు భార్యకు భరణం ఇచ్చేలా అత్యవసర చట్టాన్ని తెచ్చారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

ట్రిపుల్ తలాక్ అంశంలో కీలక పరిణామం

Submitted by arun on Fri, 12/22/2017 - 11:08

ట్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రాబోతోంది. ట్రిపుల్ తలాక్‌‌ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నిషేధించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ ఎంపీలకు విప్ జారీ చేశాయి. తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించాయి. ట్రిపుల్ తలాక్ విధానం చెల్లదని, చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం తయారుచేసింది. బిల్లు చట్టరూపం దాల్చగానే ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
 

ట్రిపుల్ తలాఖ్‌ను మట్టికరిపించింది వీరే..!!

Submitted by lakshman on Mon, 09/18/2017 - 21:49

పుల్ తలాఖ్  శతాబ్దాలుగా ముస్లిమ్ స్త్రీలని గజగజ వణికిస్తోన్న సంప్రదాయం. దశాబ్దాలుగా భారతదేశంలో వివాదాస్పదంగా నిలుస్తోన్న అంశం! ఎట్టకేలకు సుప్రీమ్ కోర్ట్ ట్రిపుల్ తలాఖ్ చట్ట వ్యతిరేకమని తేల్చేసింది. అంతే కాదు, పార్లమెంట్ దీనిపై తగిన చట్టం కూడా చేయాలని ఆదేశించింది. అప్పటి వరకూ కోర్టే ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించింది! అయితే, ఈ చారిత్రక తీర్పు వెలువడిన సందర్భరంలో మనం పది మంది గురించి తెలుసుకోవాలి! వారెవరో తెలుసా?