Nallala Odelu

ఇందారంలో ఉద్రిక్తత...బాల్కసుమన్, ఓదేలు వచ్చి, గట్టయ్య కుటుంబాన్ని...

Submitted by arun on Wed, 09/19/2018 - 11:01

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. ఓదేలుకు టికెట్‌ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న టీఆర్‌ఎస్‌ నేత గట్టయ్యకు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, బాల్కసుమన్, ఓదేలు వచ్చి.. గట్టయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టమైన హామీ వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేదిలేదని బంధువులు అంటున్నారు. గట్టయ్య ఇద్దరు పిల్లలకు చెరో ఇరవై లక్షలు ఇవ్వడంతో పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.   

నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి

Submitted by arun on Tue, 09/18/2018 - 15:53

టీఆర్ఎస్‌ కార్యకర్త, నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతిచెందాడు. ఓదెలుకు టిక్కెట్‌ ఇవ్వాలంటూ.. ఈ నెల 12 న ఆయన పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదెలును కాదని.. బాల్క సుమన్‌కు టిక్కెట్‌ ఇవ్వడంపై ఆయన వర్గం ఆందోళన చేపట్టింది. ఈ నెల 12 న బాల్క సుమన్‌ ర్యాలీలో గట్టయ్య పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ప్రాణాలు కోల్పోయాడు. 

కొలిక్కివచ్చిన చెన్నూరు టీఆర్‌ఎస్‌ టికెట్‌ వివాదం

Submitted by arun on Fri, 09/14/2018 - 10:03

టీఆర్‌ఎస్‌లో వారంరోజులుగా రగులుతున్న చెన్నూరు టికెట్‌ వ్యవహారం కొలిక్కి వచ్చింది. కేసీఆర్ బుజ్జగింపులతో ఓదేలు మెత్తబడ్డారు. తన జీవితాంతం కేసీఆర్‌తోనే కలిసి పనిచేస్తానన్న ఓదేలు చెన్నూరులో బాల్క సుమన్‌ గెలుపు కోసం కృషిచేస్తామంటూ ప్రకటించారు.

యశోద ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత...నల్లాల ఓదేలును అడ్డుకున్న గట్టయ్య బంధువులు

Submitted by arun on Thu, 09/13/2018 - 17:52

చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు చేదు అనుభవం ఎదురైంది. ఓదేలుకు టికెట్ ఇవ్వాలంటూ నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్యను పరామర్శించేందుకు వచ్చిన ఓదేలును బంధువులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ యశోదా ఆసుపత్రి బయటే అడ్డుకున్న బంధువులు ఓదేలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  

ఇందారంలో సంచలనంగా నమోదైన ఈ ఘటనపై ఆసక్తికరమైన...

Submitted by arun on Thu, 09/13/2018 - 10:32

ఇందారంలో బాల్క సుమన్‌పై హత్యాయత్నం జరిగిందా? లేదంటే ఓదేలుకు సీటు రాలేదన్న బాధతో ఆయన వర్గీయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా, ఇందారంలో సంచలనంగా నమోదైన ఈ ఘటనపై ఆసక్తికరమైన సంగతులు బయటపడుతున్నాయి. 

చెన్నూరు టిక్కెట్‌ తనకు రాలేదన్న బాధతో ఉన్న ఓదేలు కొన్నాళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్నారు. తన అసమ్మతిరాగాన్ని అధినేతకు కూడా వినిపించారు. ఇంతలోనే సుమన్‌పై ఎదురైన చేదు అనుభవం ఓదేలు కేంద్రంగా చక్కర్లు కొడుతుంది. కావాలనే తనపై హత్యాయత్నం చేయించారన్న సుమన్‌ వర్గీయుల ఆరోపణ రాజకీయంగా సరికొత్త అస్త్రాన్ని సంధించినట్టయింది. 

నాపై హత్యాయత్నం జరిగింది.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 14:35

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాల్క సుమన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓదేలు వర్గానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనపై బాల్క సుమన్ స్పందించారు. చెన్నూరులో పోటీ చేయమని తమ అధినేత కేసీఆర్ తనను ఆదేశించారని బాల్క సుమన్ చెప్పారు. ఎవరి సీటును తాను కావాలని తీసుకోలేదని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో తాను చెన్నూరు నుంచే పోటీ చేస్తానని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే ఓదెలు స్వీయా గృహనిర్బంధం

Submitted by arun on Tue, 09/11/2018 - 11:45

మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలనేదని మనస్థాపంతో.. మాజీ ఎమ్మెల్యే ఓదెలు స్వయంగా గృహనిర్బంధం వెళ్లారు. ఇంట్లో తాళం వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఓదెలుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా గృహనిర్బంధంలోనే ఉన్నారు. 24 గంటల్లో టికెట్‌పై హామీ రాకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా ఓదెలు చెప్పారు. కేసీఆర్ ను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనకు టికెట్ ఎందుకు ఇవ్వరని ఓదెలు ప్రశ్నించారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశాననీ, అలాంటి తనను పక్కకు తప్పించడం దారుణమని ఓదేలు వాపోయారు.

బరితెగించిన విప్ నల్లాల ఓదేలు

Submitted by arun on Mon, 04/09/2018 - 16:22

ప్రభుత్వ విప్.. నల్లాల ఓదేలు బరితెగించారు. న్యాయం చేయమని అడిగితే.. బెదిరింపులకు దిగారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన దళిత రైతు రాజయ్య భూమిని.. ఓదేలు అనుచరులు ఆక్రమించారు. అయితే కబ్జాలో ఉన్న తన భూమిని ఇవ్వాలని ఓదేలును ఆశ్రయిస్తే.. బాధితుడిపై ఆయన బెదిరింపులకు దిగారు. బండ బూతులు తిడుతూ.. అధికార అహంకారాన్ని ప్రదర్శించారు. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమ్మని తేగేసి చెప్పాడు. నీ వల్లే ఏం కాదంటూ ఫోన్‌లో బెదిరించిన ఆడియో.. ప్రస్తుతం సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తనకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరితే.. దుర్భషలాడారని రైతు రాజయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.