vijay devarakonda

బ్యాక్ లాగ్ క్లియర్ చేసుకుంటున్న అర్జున్ రెడ్డి!

Submitted by arun on Sat, 03/03/2018 - 07:39

అర్జున్ రెడ్డి.. అదేనండీ. మన లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. సినిమాల్లో బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకుంటున్నాడు. మామూలుగా అయితే మనకు పరీక్షల్లో బ్యాక్ లాగ్స్ ఉంటాయి. అలాగే.. విజయ్ దేవరకొండ సినిమాల్లో బిజీ కాకముందు.. ఏం మంత్రం వేశావే అంటూ ఓ సినిమా మొదలు పెట్టాడు. 2014 నుంచి అది అలా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అంటూ లేట్ అవుతూ వచ్చి.. కొన్నాళ్లకు ఆగిపోయింది.

ఏ మంత్రం వేశావే

Submitted by arun on Sat, 02/24/2018 - 15:13

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో  కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోగా మారాడు. ఇక ఈ యువహీరో నటిస్తున్న తాజా చిత్రం  'ఏ మంత్రం వేశావే'. విజయ్ సరసన శివానీసింగ్ నాయికగా నటిస్తుంది.

ఐ యామ్ బ్యాక్.. దుమ్మురేపుతోన్న విజయ్ దేవరకొండ!

Submitted by arun on Fri, 02/09/2018 - 11:31

‘పెళ్ళిచూపులు’ సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ క్రేజ్ ‘అర్జున్‌రెడ్డి’తో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ హీరోల్లో ఒకడిగా మారపోయాడు విజయ్. ‘అర్జున్‌రెడ్డి’ బ్లాక్‌బస్టర్‌తో విజయ్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. ఒక్క సినిమాతో సాధించిన క్రేజ్‌ను కాపాడుకోవడానికి విజయ్ చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

టాలీవుడ్ హీరో ఎవ‌రో చెప్పుకోండి చూద్దాం

Submitted by lakshman on Mon, 01/15/2018 - 03:54

మీ లాజిక‌ల్ థింకింగ్ కో స‌వాల్? ఇక్క‌డ మీరు చూస్తున్న ఫోటో టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ హీరో. సైలెంట్ గా వ‌చ్చి సునామీలా వ‌రుస సినిమాల‌తో అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాడు. అంతేకాదండోయ్ ఈ హీరో చేసిన ఓ చిన్న సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ ఢం ను సంపాదించుకున్నాడు. అయినా ఓవ‌ర్ నైట్ స్టార్ ఢం అంటే అంత ఈజీ కాదులేండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్ద‌లు. ఈ సామెత‌ను నిజం చేస్తున్నాడు సెన్సేష‌న‌ల్ స్టార్ . సినిమా సినిమాకు మూస‌దోరిణిలో కాకుండా వైవిద్యంగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. వ‌రుస ఆప‌ర్లు ప‌ట్టేస్తున్నాడు. రీసెంట్ గా ఈ హీరో ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

విజ‌య్ ఇంత‌కీ ఆ వ‌రంగల్ అమ్మాయి ఎవ‌రు

Submitted by lakshman on Sat, 01/13/2018 - 16:20

గీతాఆర్ట్స్ నిర్మాణంలో సినిమాచేస్తున్న యంగ్ సెన్సేషన్  విజయ్ దేవరకొండ వ‌రంగ‌ల్ లో సంద‌డి చేశాడు. హనుమకొండలో ఓ షోరూమ్ ఓపెనింగ్ కు వ‌చ్చిన విజయ్ అభిమానుల‌తో స‌ర‌ద‌గా గ‌డిపాడు. ఈ సంద‌ర్భంగా  తాను చేసుకుంటే వ‌రంగ‌ల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక విజ‌య్ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాడు.  విజయ్ మనసులో వరంగల్ అమ్మాయి ఉందా? ఉంటే ఆమె ఎవరు? అని టాలీవుడ్ స‌ర్కిల్ ల్లో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. కాగా త్వ‌ర‌లో విజ‌య్ షార్ట్ ఫిల్మింలో యాక్ట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు నేరాల‌ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ షార్ట్ ఫిల్మిం రెడీ అయ్యింది.

నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడూ గొడవలే : విజయ్‌ దేవరకొండ

Submitted by arun on Tue, 12/19/2017 - 12:21

తక్కువ కాలంలో మొదటి అడుగుల్లోనే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కానీ అర్జున్‌రెడ్డి పాత్రలో నటించిన విజయ్‌కి మాత్రం సమస్యలు తెచ్చిపెట్టిందట. ప్రస్తుతం విజయ్‌ ‘ఏ మంత్రం వేశావె’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారిలా..

రామన్నా కంగ్రాట్స్: హీరో విజయ్ దేవరకొండ..సరదాగా రిప్లై ఇచ్చిన కేటీఆర్

Submitted by arun on Mon, 12/18/2017 - 13:15

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‘లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా అవార్డు అందుకోబోతున్నారు. భారతదేశ అతిపెద్ద మ్యాగజైన్‌ అయిన ‘బీడబ్ల్యూబీ బిజినెస్‌ వరల్డ్‌’ ఈ అవార్డును ప్రకటించింది. డిసెంబర్‌ 20న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఐదో జాతీయ స్మార్ట్‌ సిటీ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా కేటీఆర్ కు అభినందనలు తెలియజేశాడు. "రమనన్నా, లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు కంగ్రాట్స్. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నా... ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు మాకు అవసరం" అంటూ ట్వీట్ చేశాడు.

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 16:29

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం', 'పెళ్లిచూపులు' చిత్రాల‌తో ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించాడు. ఆ చిత్రంలోని టైటిల్ రోల్ లో విజ‌య్ న‌ట‌న విమ‌ర్శ‌కుల‌ను, ప్రేక్ష‌కుల‌నే కాదు సెల‌బ్రిటీల‌ను సైతం మెప్పించింది. ఈ సెల‌బ్రిటీల‌ జాబితాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కూడా ఉన్నారు. కేవ‌లం విజ‌య్ న‌ట‌న‌ని మెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. త‌న త‌దుప‌రి చిత్రంలో విజ‌య్‌కి ఆఫ‌ర్ కూడా ఇచ్చారని త‌మిళ‌నాట వార్త‌లు వినిపించాయి.  

కెఎల్‌ఎమ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

Submitted by lakshman on Tue, 09/19/2017 - 19:10

ఒక్క చాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటానంటూ ఫిల్మ్ నగర్‌లో చెప్పులరిగేలా తిరిగే వాళ్లు ఈరోజుకూ ఉన్నారు. టాలీవుడ్‌లో చాలామంది ఆ ఒక్క చాన్స్ వల్లే ఈరోజు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎన్ని సినిమాలు తీసే సత్తా ఉన్నా ఒక్క హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎన్నటికీ గుర్తింపు రాదు. ఆ ఒక్క హిట్ పడితే ఆ హీరో రేంజే మారిపోతుంది. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో అలా ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నాడా అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానమొస్తుంది. పెళ్లిచూపులు సినిమాకు ముందు ఎన్ని సినిమాల్లో నటించినా విజయ్‌కు ఆశించిన గుర్తింపు రాలేదు.

విజ‌య్ దేవ‌ర‌కొండతో క‌న్న‌డ న‌టి

Submitted by nanireddy on Wed, 09/06/2017 - 19:36

'పెళ్లిచూపులు'తో సోలో హీరోగా తొలి విజ‌యం అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. తాజాగా విడుద‌లైన 'అర్జున్ రెడ్డి'తో సంచ‌ల‌న విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. వివాదాల న‌డుమ విడుద‌లైన‌ప్ప‌టికీ.. సినిమాలోని బోల్డ్ కంటెంట్ యూత్‌ని బాగా  ఎట్రాక్ట్ చేసింది. త‌మిళంలోనూ, హిందీలోనూ ఈ సినిమా రీమేక్ అయ్యే అవ‌కాశం ఉంది.