Asaram Bapu

ఆధ్యాత్మిక పేరుతో ఆశ్రమాలు...భక్తి ముసుగులతో అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు

Submitted by arun on Thu, 04/26/2018 - 12:25

తమకు తాము బాబాలుగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు చేశారు. అక్కడితో ఆగని కొంత మంది బాబాలు భక్తి ముసుగులో అత్యాచారాలకు ఒడిగట్టారు. తమనెవరు ఏమీ చేయలేరన్న ధీమాతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఎప్పటికైనా పాపం పండుతుందన్న విషయం గ్రహించలేకపోయారు. 

ఆశారాం బాపుకు శిక్ష ఖరారు

Submitted by arun on Wed, 04/25/2018 - 15:05

అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు జోధ్‌పూర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆశారాంతో పాటు మరో ఇద్దరికి 20ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఈనెల 7న జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టులో వాదనలు ముగిశాయి. 2013లో మధ్యప్రదేశ్‌ చింద్వారాలోని ఆశ్రమంలో..  బాలికపై అత్యాచారం చేసినట్లు ఆశారాం బాపుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆశారాం బాపును దోషిగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది. 
 

అత్యాచార కేసు : ఆశారాం బాపు దోషే

Submitted by arun on Wed, 04/25/2018 - 11:24

మైనర్ బాలికపై రేప్ కేసులో ఆశారాం బాపూని జోధ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల కిందట నమోదైన అత్యాచారం కేసులో.. ఆశారాంతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2013 సెప్టెంబరు 1న ఆశారాంను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 7నే వాదనలు పూర్తవగా.. ఆశారాంను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెల్లడించింది.

ఒకే జైల్లో..ప్ర‌తి ఫ్రెండూ అవ‌స‌ర‌మేరా

Submitted by lakshman on Fri, 04/06/2018 - 09:09

కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలడంతో బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్‌ సెంట్రల్‌కు తరలించారు. జైలులో సల్మాన్‌ఖాన్‌కు 106 నెంబర్‌ను కేటాయించారు. లైంగిక వేధింపులో కేసులో అరెస్టైన ఆశారాం బాపు ఉంటున్న గది పక్కనే సల్మాన్‌ఖాన్‌కు గదిని కేటాయించారు. సినీ నటుడుగా పేరు ప్రఖ్యాతలున్న సల్మాన్‌ఖాన్‌ను సాధారణ ఖైదీలుగానే జైలులో ట్రీట్ చేస్తామని జైల్ అధికారులు ప్రకటించారు.