west godavari District

ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు..

Submitted by arun on Wed, 06/20/2018 - 09:54

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించి, మరొరికితో పెళ్లికి ఒప్పుకుందని లహరి అనే యువతిని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ పై తాను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాపూజీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమ పేరుతో కిరణ్‌ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది.

పశ్చిమ జిల్లాలో గొంతెండుతున్న గ్రామాలు... హెచ్‌ఎంటీవీ ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్ట్

Submitted by santosh on Tue, 05/08/2018 - 11:17

బిందెడు తాగునీటి కోసం ఆ గ్రామాల ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం.. జీవనాధారమైన నీళ్ల కోసం వారిది నిత్యం జీవన సమరమే.. ప్రాణాలకు తెగించి మరీ గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి.. నీటికోసం ఏకంగా జిల్లా సరిహద్దులు దాటిమరీ మంచినీటి కోసం పోరాటం చేయాల్సివస్తోంది వారికి.. ఏరుదాటితేనే గుక్కెడు నీరు.. మరి ఆ ఏరు పొంగితే.. నాటు పడవలు తిరగబడితే.. నీటి కోసం వెళ్లిన వారి బతుకులు ఏటి పాలవ్వాల్సిందే.. గుక్కెడు నీటికోసం గొంతెండుతున్న గ్రామాలపై HMTV ఎక్స్ క్లూజివ్ స్టోరీ. ఓ వైపు ప్రమాదకరంగా ప్రవహించే ఉప్పుటేరు.. మరోవైపు గొంతెండుతున్న గ్రామాలు..

కొడుకు తప్పు చేశాడని తండ్రికి శిక్ష

Submitted by arun on Thu, 04/05/2018 - 15:37

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. టి నర్సాపురం మండలం సాయంపాలెంలో అమానుషం చోటు చేసుకొంది. కొడుకు తప్పుచేశాడన్న కారణంతో తండ్రిని చెట్టుకు కట్టేసి అవమానించారు. మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. సాయంపాలెంకు నాగేంద్ర ఓ అమ్మాయిని వేధించాడంటూ గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు.