Jodhpur Court

ఐదేళ్ళ జైలు శిక్షపై రాజస్థాన్ హైకోర్టులో సల్మాన్ సవాల్

Submitted by arun on Thu, 04/05/2018 - 16:08

కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌‌ను దోషిగా తేల్చిన రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌ కోర్టు...ఐదేళ్ళ కారాగార శిక్షతో పాటు 10 వేల జరిమానా కూడా విధించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గరిష్ఠంగా ఆరేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉండగా, న్యామమూర్తి ఐదేళ్ల జైలు శిక్షను విధించారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో ఇతర నిందితులు సైఫ్‌ అలీఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.

సల్మాన్‌కు రెండేళ్ల జైలుశిక్ష

Submitted by arun on Thu, 04/05/2018 - 13:00

కృష్ణజింకల కేసులో సల్మాన్‌‌ఖాన్‌‌ను దోషిగా తేల్చిన జోథ్‌పూర్‌ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్‌ 51కింద తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మిగతా నిందితులను జోథ్‌పూర్‌ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దాంతో సైఫ్ అలీఖాన్‌‌, టబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లు కేసు నుంచి బయటపడ్డారు.

సల్మాన్‌ఖాన్‌కు షాక్‌

Submitted by arun on Thu, 04/05/2018 - 12:25

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను జోథ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. మిగితా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుదివాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది.
 

కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ ఖాన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం..కాసేపట్లో శిక్ష ఖరారు

Submitted by arun on Thu, 04/05/2018 - 11:45

1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్ పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషేనని న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని పేర్కొన్న న్యాయమూర్తి, సల్మాన్ కు మరికాసేపట్లో శిక్షను ఖరారు చేయనున్నారు. జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని చెప్పారు. కాగా, కేసు విచారణ సుదీర్ఘంగా సాగిన సంగతి తెలిసిందే.

కృష్ణ జింకల వేట కేసులో నేడే తీర్పు

Submitted by arun on Thu, 04/05/2018 - 10:13

బాలీవుడ్ నటులు సల్మాన్, సైఫ్ అలీఖాన్, హీరోయిన్లు టబూ, సోనాలీ, నీలమ్‌పై 1998లో నమోదైన నల్లజింకల వేట కేసులో జోథ్‌పూర్ కోర్టు తీర్పు మరికాసేపట్లో కీలక తీర్పు వెలువరించనుంది. 20 ఏళ్ల తర్వాత తీర్పు రానుండటంతో ఉత్కంఠ నెలకొంది. ట్రయిల్ కోర్టులో తుది వాదనలు పూర్తి చేసుకున్న కేసు తీర్పును మెజిస్ట్రేట్ దేవ్‌కుమార్ ఖాత్రి రిజర్వ్‌లో ఉంచారు. తీర్పు ఇవాళ వెలువడనుండటంతో జోథ్‌పూర్ కోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.