Delhi Tour

ఢిల్లీ వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య

Submitted by arun on Tue, 11/13/2018 - 10:11

మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ బాట పట్టారు. తొలి జాబితాలో తనకు చోటు దక్కకపోవడంతో  చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన  జనగామ నియోజకవర్గాన్ని కూటమి పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించినట్టు వార్తలు రావడంతో లాబీయింగ్‌ మొదలు పెట్టారు. అధిష్టానంలో తనకు పరిచయం ఉన్న నేతల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. అయితే జనగాం బదులు మరో చోటు పోటీ చేయాలంటూ అధిష్టానం కోరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు..ప్రధాని మోదీతో ఏం చర్చించబోతున్నారు..?

Submitted by arun on Fri, 08/24/2018 - 10:01

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయా ?  ఇప్పటికీ రాష్ట్రంలో హడావుడి చేసిన అధికార పార్టీ ఢిల్లీ వేదికగా కార్యకలాపాలు చేపట్టిందా ?  ముందస్తు ఎన్నికల అజెండాతోనే  నిన్న  మంత్రి కేటీఆర్ .. నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ  బాట పడుతున్నారా ? ముందస్తు వ్యూహం ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయా ? 

ఢిల్లీ టూర్‌ను మధ్యలోనే ముగించిన గవర్నర్ నరసింహన్

Submitted by arun on Wed, 04/25/2018 - 11:14

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తన ఢిల్లీ పర్యటనను మధ్యలోనే ముగించారు. నిన్న సాయంత్రం ప్రధాని సహా.. కేంద్రంలోని ప్రముఖులను కలిసేందుకు నరసింహన్ ఢిల్లీ వెళ్లారు. ఐతే అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ తన పర్యటనను మధ్యలోనే ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. గవర్నర్ 2 రోజులు ఢిల్లీలోనే మకాం వేస్తారనుకున్నా ఇంతలోనే ఆయన ఢిల్లీ నుంచి రిటర్న్ అయ్యారు.
ఇవాళ ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలవాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించాల్సి ఉన్నా.. గవర్నర్ మధ్యలోనే తన పర్యటనను ముగించుకొని రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 

పార్లమెంట్ సాక్షిగా..

Submitted by arun on Tue, 04/03/2018 - 12:52

అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ గడ్డపై కాలు మోపిన చంద్రబాబు... పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌‌లోకి అడుగు పెట్టడానికి ముందు ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్‌ సెంట్రల్‌‌ హాల్లోకి వెళ్తూ ప్రధాన ద్వారం దగ్గర మెట్లకు వంగి నమస్కరించారు.