Rashmi Gautam

కాస్టింగ్ కౌచ్ పై రష్మీ సంచలన వ్యాఖ్యలు..!

Submitted by arun on Sun, 09/02/2018 - 11:51

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఆమె నటించిన ‘అంతకు మించి’ సినిమాలో తన అందంతో యూత్ ని అట్ట్రాక్ట్ చేద్దాం అనుకుంది కానీ అది ఫలించలేదు. సినిమా డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో రష్మీ కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసింది. అవకాశం ఇస్తానంటే వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ అని చెప్పింది. అంతేకాదు.. ఇలాంటి అవకాశానికి తను క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టననీ, దాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. కెరీర్ బాగుంటుందనిపిస్తే అలా వెళ్లడంలో తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పింది.

సుధీర్‌ను పెళ్లి చేసుకో.. రష్మీ ఘాటు రిప్లై!

Submitted by arun on Fri, 06/22/2018 - 10:25

జబర్దస్త్ తో యాంకర్ గా రష్మీ, కమెడియన్ గా సుధీర్ బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ లో వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందనే అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్లుగానే వీరి మధ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా కెమిస్ట్రీ జరుగుతోందనే రూమర్స్ ఉన్నాయి. ఈ రూమర్స్ ని సుధీర్, రష్మీ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎలాంటి రూమర్స్ వచ్చినా వారి తరహాలోనే ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. వీరిమధ్య ప్రేమాయణం జరుగుతోందనే వార్తలపై రూమర్స్ సహజమే కదా అన్నట్లుగా గతంలో వీరి స్పందన ఉండేది. తాజగా సోషల్ మీడియాలో రష్మీకి చేదు అనుభవం ఎదురైంది. నెటిజన్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 

ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదు: రష్మీ

Submitted by arun on Mon, 04/02/2018 - 13:37

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన యాంకర్ రాధికారెడ్డి ఆపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆమె మరణంపై పలువురు సినీ, టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందిస్తూ, ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన బాధలు తొలగిపోవని ట్వీట్ చేసింది. మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని చెప్పింది.