Hunger Strike

దీక్ష విరమించిన సీఎం రమేశ్.. చంద్రబాబు ఏం చెప్పారు..?

Submitted by arun on Sat, 06/30/2018 - 14:49

కడప ఉక్కు పరిశ్రమ కోసం గత 11 రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్ దీక్ష విరమించారు. ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరాడతామంటూ సీఎం చంద్రబాబు హామి ఇవ్వడంతో ఆయన దీక్ష విరమణకు అంగీకరించారు.  సీఎం చేతుల మీదుగా నిమ్మరసం అందుకున్న అనంతరం దీక్ష విరమించారు. బీటెక్ రవితో  కలసి ఈ నెల 20న దీక్షకు దిగిన సీఎం రమేష్  స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమణ లేదని ప్రకటించారు. శరీరంలో కిటోన్ లెవల్స్ పెరుగుతున్నాయంటూ వైద్యులు హెచ్చరించినా ఏ మాత్రం పట్టించుకోకుండా దీక్ష కొనసాగించారు.

ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష ప్రారంభం

Submitted by arun on Wed, 06/20/2018 - 12:41

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం ఉదయం జడ్పీ కార్యాలయం ఆవరణలో రమేష్ దీక్షను ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణదీక్షకు దిగారు. ముందుగా గాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలకు సీఎం రమేష్‌ పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. సీఎం రమేష్ దీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. అంతకుముందు పోట్లదుర్తి నుంచి భారీ ర్యాలీతో కడప దీక్షా శిబిరానికి సీఎం రమేష్‌ చేరుకున్నారు.
 

ముగిసిన పవన్ నిరాహారదీక్ష

Submitted by arun on Sat, 05/26/2018 - 17:43

ఉద్దానం బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేందటూ.. పవన్ కల్యాణ్ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష ముగిసింది. తను విధించిన 48 గంటల డెడ్ లైన్ ను ఏపీ సర్కార్ లైట్ తీసుకోవడంతో.. ముందుగా చెప్పినట్లుగానే.. దీక్షకు కూర్చున్నారు. ఇప్పటికే ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై 17 డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుంచింది జనసేన. ఉద్దానం కిడ్నీ బాధితులను  ఆదుకోవాలంటూ తాము ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దీక్షకు దిగాల్సి వచ్చిందని పవన్ చెప్పారు.
 

నెక్లెస్ రోడ్డులో పవన్ మౌన దీక్ష

Submitted by arun on Sat, 04/14/2018 - 14:50

కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తనను ఎంతో కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కథువా ఘటనకు నిరసనగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేపట్టారు. మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదని ఏదైనా దారుణం జరిగితే కానీ మనలో చలనం రావడం లేదని చెప్పారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు. కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా అని అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని... అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు.

విజయమ్మ 'పాదనమస్కారం'పై లోకేష్ కౌంట‌ర్

Submitted by lakshman on Wed, 04/11/2018 - 04:36

ప్ర‌త్యేక‌హోదాపై వైసీపీ - టీడీపీ - బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది.మైలేజ్ కోసం ఒక‌రిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీడీపీ బీజేపీని విమ‌ర్శిస్తూ త్వ‌ర‌లో జ‌రిగే క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటువేయాల‌ని పిలుపునిచ్చింది. క‌ర్నాట‌క‌లో తెలుగువారికి టీడీపీ ఇచ్చిన‌పిలుపుతో ఆ పార్టీ కాంగ్రెస్ కి అనుకూలం, బీజేపీకి వ్య‌తిరేకం అని అర్ధం వ‌చ్చిన‌ట్లు ప‌లువురు క‌మ‌లం నేత‌లు భావిస్తున్నారు. ఇక టీడీపీ - వైసీపీలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాక‌పుట్టిస్తున్నాయి. 

ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కోసం తెలివి ప్ర‌ద‌ర్శిస్తున్న జ‌గ‌న్

Submitted by lakshman on Wed, 04/11/2018 - 03:49

ప్రత్యేక‌హోదా కోసం హ‌స్తిన‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతుంది. రాష్ట్రంకోసం ఐదురోజుల నుంచి  ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు వైసీపీ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్ ల ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మిగిలిన  ఇద్ద‌రు ఎంపీల ఆరోగ్య‌ప‌రిస్థితి కూడా ఆందోళ‌నక‌రంగా మారిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమ‌ర‌ణ దీక్ష‌లో ఉన్న ఆ ఇద్ద‌ర్ని కూడా ఆస్ప‌త్రిలో చేరిస్తే ఏమౌవుతుంది. టీడీపీలాగా ఢిల్లీలో త‌ట్ట‌బుట్టా స‌ర్ధుకొని ఏపీలో పోరాటం అంటూ త‌ర‌లిస్తారా..?

ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లో వైసీపీ ఎంపీలు

Submitted by lakshman on Sun, 04/01/2018 - 11:38

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎత్తు పై ఎత్తులు వేస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ ఎన్డీఏ పై అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. అయితే స‌భ‌లో వైసీపీ పెట్టిన తీర్మానం చ‌ర్చ‌కు రాక‌పోవ‌డంతో జ‌గ‌న్ త‌దుప‌రి భవిష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్ల‌మెంట్ స‌మావేశాల ముగింపురోజున‌ వైసీపీ ఎంపీ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.